వృద్ధుల విషయంలో జపాన్‌ ప్రపంచ రికార్డు | Japan-Milestone-Number-of-People Aged 100 or Older Rising Above 1-Lakh-1st-Time | Sakshi
Sakshi News home page

వృద్ధుల విషయంలో జపాన్‌ ప్రపంచ రికార్డు

Sep 17 2026 4:28 AM | Updated on Sep 17 2026 4:52 AM

Japan-Milestone-Number-of-People Aged 100 or Older Rising Above 1-Lakh-1st-Time

జపాన్‌లో తొలిసారిగా 100 అంతకన్నా ఎక్కువ వయస్సు గల పౌరుల సంఖ్య లక్ష దాటింది. దేశంలో సెప్టెంబర్‌ 1 నాటికి శతాధిక వృద్ధుల సంఖ్య 1,07,677కు చేరుకున్నట్టు ఆ దేశ ఆరోగ్య, కార్మిక సంక్షేమ శాఖ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 7,914 ఎక్కువ. శతాధిక వృద్ధుల్లో మహిళలు 94,298 మంది ఉండగా, పురుషులు 13,779 మంది ఉన్నారు.

ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. శతాధికుల్లో మహిళలదే అగ్రస్థానం. మొత్తం సంఖ్యలో సుమారు 88 శాతం, అంటే 94,298 మంది మహిళలే ఉన్నారు. ప్రస్తుతం దేశంలో అత్యంత వృద్ధురాలిగా క్యోటోకు చెందిన 114 ఏళ్ల ఫుయో కిషిమోటో, అత్యంత వృద్ధుడిగా కుమామోటోకు చెందిన 112 ఏళ్ల హికారు కాటో రికార్డుల్లో నిలిచారు. 

జపాన్‌లో శతాధికుల సంఖ్య వృద్ధిని పరిశీలిస్తే.. 1963లో గణాంకాల సేకరణ ప్రారంభమైనప్పుడు వీరి సంఖ్య కేవలం 153 మాత్రమే ఉండేది. ఆ సంఖ్య 1981 నాటికి వెయ్యి దాటింది. 1998లో 10,000 కు, 2012లో 50,000 కు చేరింది. ఇప్పుడు ఏకంగా లక్ష మార్కును దాటి సరికొత్త రికార్డును నమోదుచేసింది. ఈ గణాంకాలపై జపాన్ ఆరోగ్య శాఖ మంత్రి కెనిచిరో యునో హర్షం వ్యక్తంచేశారు.

ఇదీ చదవండి: భారీగా హెచ్‌ఐవీ కేసులు.. ఆ దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement