భారీగా హెచ్‌ఐవీ కేసులు.. ఆ దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ! | Fiji declares HIV emergency- drug crisis fuels outbreak-Viral | Sakshi
Sakshi News home page

భారీగా హెచ్‌ఐవీ కేసులు.. ఆ దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ!

Sep 17 2026 2:56 AM | Updated on Sep 17 2026 2:56 AM

Fiji declares HIV emergency- drug crisis fuels outbreak-Viral

Photo Credit: Twitter

పసిఫిక్‌ దేశం ఫిజీలో హెచ్‌ఐవీ కేసులు భారీగా పెరగడంతో అక్కడి ప్రభుత్వం ‘నేషనల్‌ హెచ్‌ఐవీ ఎమర్జెన్సీ’ ప్రకటించింది. 10 లక్షల్లోపు జనాభా ఉన్న ఈ దేశంలో ప్రస్తుతం ప్రతి 60 మంది వయోజనుల్లో ఒకరు హెచ్‌ఐవీతో జీవిస్తున్నట్లు అంచనా. 2024లో కొత్తగా 2,060 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. 

గర్భిణులు, నవజాత శిశువుల్లోనూ కేసులు గుర్తిస్తున్నారు. ఒకే సిరంజీని పలువురు ఉపయోగించడం, అసురక్షిత లైంగిక సంబంధాలు వైరస్‌ వ్యాప్తికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. డ్రగ్స్ ఎక్కించుకునేందుకు ఒకే సిరంజీని అనేక మంది ఉపయోగించడం, అసురక్షిత లైంగిక కార్యకలాపాల వంటి కారణాలతో ఈ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. 

2021లో 25గా ఉన్న హెచ్‌ఐవీ సంబంధిత మరణాల సంఖ్య 2025 నాటికి 117కు పెరిగింది. స్థానికంగా హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిలో కేవలం 39 శాతం మందికి మాత్రమే ఆ విషయం తెలుసని, నాలుగింట ఒక వంతు కంటే తక్కువ మంది మాత్రమే చికిత్స పొందుతున్నారని యూఎన్‌ఎయిడ్స్ ఫిజీ ప్రతినిధి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఆసియా గేమ్స్‌కు స్టార్ ఆల్‌రౌండ‌ర్ దూరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement