చార్మినార్: వందేళ్ల చరిత్ర ఉన్న ప్రఖ్యాత సిటీ కళాశాల భవనంలోని కారిడార్ కూలిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఫిజిక్స్ ల్యాబ్ వైపు ఉన్న కారిడార్ ఒక్కసారిగా కుప్పకూలింది. విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లక్ష్మి, డాక్టర్ నీరజలు ఉన్నతాధికారులకు సమాచారం అందజేశారు. కారిడార్ ఆదివారం కూలి ఉండవచ్చునని..తమకు మాత్రం సోమవారం ఉదయం తెలిసిందని కళాశాల అధికారులు చెబుతున్నారు. సిటీ కళాశాల పూర్వ విద్యారి్థ, చారి్మనార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వెంటనే నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.
సిటీ స్కూల్‌గా ప్రారంభమై..
6వ, ఆసిఫ్ జా కాలంలో మెహబూబ్ అలీ ఖాన్ 1865లో దారుల్–ఉల్–ఉలూం పేరుతో సిటీ స్కూల్‌గా ప్రారంభమై.. ఏడో ఆసిఫ్ జా ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో హైస్కూల్‌గా మారింది. 1929లో సిటీ కళాశాలగా ఉన్నతీకరించారు. 30 మందితో ప్రారంభమైన ఈ కాలేజీలో ప్రస్తుతం 6వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. నవాబ్ ఖాన్ బహదూర్ మీర్జా అక్బర్ బేగ్ అనే చీఫ్ ఇంజినీర్ ఈ భవన నిర్మాణాన్ని చేపట్టారు.
ఆన్‌లైన్‌లో ప్రాక్టికల్స్
ప్రస్తుతం సైన్స్ ల్యాబ్‌లు అన్నింటినీ మూసివేశారు. వారం రోజులు ప్రాక్టికల్స్ ఉండవని సంబంధిత ప్రొఫెసర్లు చెబుతున్నారు. అవసరమైతే ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామన్నారు.
శిథిలావస్థకు చేరి..
ఈ కళాశాల ఇప్పటికే శిథిలావస్థకు చేరుకుంది. హెరిటేజ్ భవనం కావడంతో పురావస్తు శాఖ అధికారుల అనుమతితో మరమ్మతులు చేయించాల్సి ఉంది. కానీ గత కొన్నేళ్లుగా ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు. ఎప్పుడు వర్షాలు కురిసినా.. పైకప్పు తడిసి ముద్దయి..సైన్సు ల్యాబ్ లోకి నీరు కారుతుంది. అప్పుడప్పుడు పెచ్చులు సైతం ఊడిపడ్డాయి. సంబంధిత అధికారులకు తెలియజేసినప్పటికీ హెరిటేజ్ భవనం కావడంతో మరమ్మతులకు ఆలస్యమవుతుంది. వర్షాలలో ప్రమాదం పొంచి ఉండడంతో ఈనెల 20న చారి్మనార్ ఎమ్మెల్యే మీర్ జులి్ఫకర్ అలీతో పాటు ఉన్నతాధికారులకు సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపక బృందం సమాచారాన్ని అందజేసింది. అప్పటికే పెచ్చులూడిపడటంతో ఫిజిక్స్ ల్యాబ్ మూసివేశారు.
వందేళ్ల సిటీ కళాశాలలో ప్రమాదం


