హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల గుట్టురట్టు | 11 Fake Doctors Arrested In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల గుట్టురట్టు

Aug 25 2026 11:38 AM | Updated on Aug 25 2026 11:44 AM

11 Fake Doctors Arrested In Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో నకిలీ డాక్టర్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. నకిలీ వైద్యుల దందాపై దాడులు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. 11 మంది నకిలీ డాక్టర్లను పట్టుకున్నారు. డాక్టర్లుగా చలామణి అవుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పలు ప్రాంతాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల పేరుతో వైద్యం చేస్తున్నారు. నకిలీ వైద్యులపై ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన పోలీసులు.. అర్హతలు లేకుండానే వైద్యం చేయడంపై ఆరా తీస్తున్నారు. నకిలీ వైద్యులపై ఉక్కుపాదం మోపిన పోలీసులు.. నకిలీ డాక్టర్ల వైద్యంపై విచారణ చేపట్టారు.

కాగా, గత ఏడాది కూడా అర్హత లేకుండా వైద్యం చేస్తున్న 8 మంది నకిలీ డాక్టర్లను తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ గుర్తించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ నగరంలోని బౌరంపేట్, దుండిగల్, సూరారం ప్రాంతాల్లో నకిలీ డాక్టర్లు యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్‌ వంటి అధిక స్థాయి మందులను రోగులకిచ్చి హాని కలిగిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మెడికల్‌ బృందాలు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement