దళిత వ్యతిరేక బీఆర్‌ఎస్ పార్టీని తెలంగాణలో రద్దు చేయాలి
శాసనమండలిలో మంత్రులు సీతక్క, జూపల్లి, దామోదర, మహేశ్‌కుమార్‌గౌడ్
తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిల ఘటనపై మండలిలో చర్చ
పలుమార్లు సభను వాయిదా వేసిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతామధుతోపాటు మరో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిలపై కఠిన చర్యలు తీ సుకోవాలని పలువురు మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. స్పీకర్‌ను అవమానించడం బీఆర్‌ఎస్ అహంకారపూరిత ధోరణికి నిదర్శనమని వారు ఆరోపించారు.
మరోవైపు నల్లబ్యాడ్జీలతో మండలికి హాజరైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు.. సభ జరుగుతున్నంత సేపు వెల్‌లోకి దూసుకొచ్చి ‘వీ వాంట్ జస్టిస్.. పోలీసుల దౌర్జన్యం నశించాలి.. అక్రమ కేసులు ఎత్తివేయాలి’అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో సభను చైర్మన్ పలుసార్లు వాయిదా వేశారు. మంగళవారం చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభను ప్రారంభిస్తూ..సోమవారం సభ బయట జరిగిన ఘటనల్లో ఇద్దరు ఎమ్మెల్సీలపై కేసు నమోదు చేసిన విషయాన్ని సభ్యుల దృష్టికి తెచ్చారు. అనంతరం ఈ అంశంపై చర్చను ప్రారంభించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ‘నిన్న జరిగిన సంఘటన బాధాకరం. స్పీకర్ పదవి అత్యంత గౌరవప్రదమైనదని, ఆ పదవిలో ఉన్న వ్యక్తిపై కులపరమైన వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు. తాతా మధు వ్యాఖ్యలతో ప్రజల్లో సభ పట్ల ఉన్న గౌరవం సన్నగిల్లే అవకాశం ఉంది’మహేశ్‌గౌడ్ అన్నారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభను అరగంట వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ గుత్తా ప్రకటించారు.
అనంతరం సభ ప్రారంభమైన వెంటనే చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలోనూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు శంభీపూర్‌రాజు, తాతా మధు, నవీన్‌కుమార్‌లు తనపై పుస్తకాలు చించి విసిరారని, ఆ పుస్తకాల్లోని పిన్నులు గుచ్చుకుంటే గాయం అయ్యేదని..పెద్దల సభలో సభ్యులు హుందాగా ప్రవర్తించాలని పదేపదే సూచిస్తున్నట్టు తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు వారి స్థానాల్లోకి వెళ్లి కూర్చుంటే మాట్లాడేందుకు అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయినా బీఆర్‌ఎస్ సభ్యులు నినాదాలు కొనసాగించారు. అనంతరం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ స్పీకర్‌పై పరుషపదజాలం వాడడం నిమ్న జాతులను అవమానించడమేనని, ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ది దళిత వ్యతిరేక స్వభావమని విమర్శించారు. మహిళా పోలీసులపైనా బీఆర్‌ఎస్ సభ్యులు దాడి చేశారని, ఈ విషయంపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. సబితాఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల విషయంలో దురుసుగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, స్పీకర్‌పై అవమానకరమైన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ స్పీకర్‌ను ఎమ్మెల్సీ తాతా మధు అసభ్య పదజాలంతో దూషించడం దురదృష్టకరమన్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, స్పీకర్ అంటే పారీ్టలకతీతంగా గౌరవం ఇవ్వాలని, అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ళీ అంతకు ముందు ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్, శంకర్‌నాయక్, ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ దళితులపట్ల బీఆర్‌ఎస్ ఈ ధోరణి సరికాదన్నారు. అనంతరం టీ బ్రేక్ ఇస్తూ చైర్మన్ సభను వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి: ఫామ్‌హౌస్‌లో జరిగిన కుట్రే


