పుల్లను తీపి చేసే... మిరాకిల్‌ ఫ్రూట్‌! | Miracle fruit is a small red berry native to West Africa that makes sour foods | Sakshi
Sakshi News home page

పుల్లను తీపి చేసే... మిరాకిల్‌ ఫ్రూట్‌!

Sep 19 2026 4:25 AM | Updated on Sep 19 2026 4:24 AM

Miracle fruit is a small red berry native to West Africa that makes sour foods

ప్రకృతి
 

బుజ్జాయిలూ! మీరు పుల్లగా ఉండే నిమ్మకాయను తిన్నప్పుడు అది మీకు తియ్యగా అనిపిస్తే ఎలా ఉంటుంది? అలా చేసే పండు ఉంది. దాని పేరు ‘మిరాకిల్‌ ఫ్రూట్‌’. ఈ పండు తిని, ఆ గుజ్జును నాలుకకు రాసుకున్న తర్వాత మీరు ప్రపంచంలోనే అత్యంత పుల్లటి నిమ్మకాయ తిన్నా లేదా చేదుగా ఉండే పదార్థాలు తిన్నా అవన్నీ ఎంతో తియ్యగా అనిపిస్తాయి. 

 పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాల్లో దొరికే ఈ పండును నైజీరియాలోని యోరుబా తెగ ప్రజలు ‘ఆగ్బాయున్‌’ అని పిలిస్తే, ఘనా దేశంలో ‘అసా’ లేదా ‘తామి’ అని, మరికొన్ని ప్రాంతాల్లో ‘లెడిడి’ అని పిలుస్తారు. 

ఈ పండు చూడటానికి మన చిన్న ద్రాక్షపండు లాగా ఎర్రగా ఉంటుంది. దీని సొంత రుచి పెద్దగా తీపిగా ఏమీ ఉండదు. కానీ ఈ పండును తిన్న తర్వాత ఏది తిన్నా తియ్యగా ఉంటుంది. సైన్స్‌ ఏమిటంటే ఈ పండులోని మిరాకులిన్‌ అనే ప్రొటీన్‌ మన నాలుకపై ఉండే రుచిని తెలిపే కణాలకు లాక్‌ వేసేస్తుంది. దీనివల్ల మన నాలుక పులుపును, చేదును గుర్తించలేదు. కేవలం తీపిని మాత్రమే మెదడుకు పంపుతుంది. పిల్లలు ఈ పండును హాయిగా తినవచ్చు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement