చందమామపై భారీ గుంత... కనిపెట్టిన నాసా! | NASA spacecraft just found a giant new crater on the moon | Sakshi
Sakshi News home page

చందమామపై భారీ గుంత... కనిపెట్టిన నాసా!

Sep 19 2026 4:20 AM | Updated on Sep 19 2026 4:20 AM

NASA spacecraft just found a giant new crater on the moon

అంతరిక్షం

బుజ్జాయిలూ! అంతరిక్ష శాస్త్రవేత్తలు చందమామపై ఒక కొత్త విశేషాన్ని కనుగొన్నారు! అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన ప్రత్యేక శాటిలైట్‌ చంద్రుని ఉపరితలాన్ని ఫోటోలు తీస్తుండగా ఒక భారీ గుంత కనిపించింది. సాధారణ గుంత అనుకుంటే పొరపాటే.. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం, వందేళ్ల కాలంలో చంద్రుడిపై పడిన అత్యంత పెద్ద గుంత ఇదేనట! ఇది 222 మీటర్ల వెడల్పు, 43 మీటర్ల లోతు ఉంది. దీనికి ‘మెక్‌గెట్చిన్‌’ అని పేరు కూడా పెట్టారు.

భూమికి చుట్టూ రక్షణగా గాలిపొర ఉంటుంది కాబట్టి అంతరిక్షం నుండి వచ్చే ఆస్ట్రాయిడ్స్‌ గాలిలోనే మండిపోయి నశిస్తాయి. కానీ చందమామపై గాలి, నీరు, వాతావరణం ఏవీ ఉండవు. అందుకే అంతరిక్షంలో తిరిగే పెద్ద పెద్ద గ్రహశకలాలు ఎలాంటి అడ్డు లేకుండా నేరుగా వచ్చి చంద్రుడిని బలంగా ఢీకొడతాయి. అలా ఒక పెద్ద రాయి వచ్చి గుద్దుకోవడం వల్లే ఈ సరికొత్త భారీ గుంత ఏర్పడింది.

 దీని లోపల దాగి ఉన్న మట్టి, రాళ్లను పరిశీలిస్తే చందమామ లోపల ఏముందో మనకు తెలిసిపోతుంది. భవిష్యత్తులో మన శాస్త్రవేత్తలు లేదా వ్యోమగాములు చంద్రుడిపైకి వెళ్ళినప్పుడు, అక్కడ ఇళ్లు ఎలా కట్టుకోవాలి, ప్రమాదకరమైన సూర్యకిరణాల నుండి ఎలా రక్షణ పొందాలో తెలుసుకోవడానికి ఈ గుంత  సహాయపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement