ప్రాణి ప్రపంచం
పిల్లలూ, పులి పళ్ల ముందు ఇనుము కూడా దూదిలాంటిదే!
→ మనకు 32 పళ్లు ఉంటే పులికి 30 పళ్లు ఉంటాయి. కానీ ఒక్కొక్కటీ కత్తి లాంటిది. పులి కోర పళ్లు 10 సెం.మీ వరకు ఉంటాయి! అంటే మీ చేతి వేలు అంత పొడవు → పులి కొరికే శక్తి 1050PSI (పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్). అంటే ఒక్కసారి కొరికిందంటే ఎద్దు మెడ ఎముకను కూడా విరిచేయగలదు! మన కొరికే శక్తి కేవలం 150PSI మాత్రమే.
పులి వెనక ఉన్న పళ్లను ‘కార్నాసియల్’ అంటారు. అవి కత్తెరలా పని చేసి మాంసాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసేస్తాయి. పులి ఏదీ నమలదు. నేరుగా మింగేస్తుంది
→ పులి పిల్లలకు కూడా మనలాగే పాల పళ్లు ఊడి కొత్త పళ్లు వస్తాయి. పెద్దయ్యాక పన్ను ఊడితే మళ్లీ రాదు. అందుకే పులి తన పళ్లను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది.


