తెలివైన చలికోడి | sly fox wants to catch the hardworking little red hen for dinner | Sakshi
Sakshi News home page

తెలివైన చలికోడి

Sep 19 2026 4:39 AM | Updated on Sep 19 2026 4:39 AM

sly fox wants to catch the hardworking little red hen for dinner

కథ

అనగనగా రష్యాలోని దట్టమైన మంచు అడవిలో ఒక చలికోడి (రష్యన్‌ గ్రౌస్‌) ఉండేది. ఒక సాయంత్రం ఆ కోడి ఒక చెట్టు కొమ్మపై కూర్చుని విశ్రాంతి తీసుకుంటోంది. అదే సమయంలో ఆహారం కోసం వెతుకుతున్న జిత్తులమారి నక్క ఆ చెట్టు కిందికి వచ్చింది. పైన కూర్చున్న కోడిని చూడగానే నక్క నోట్లో నీరూరాయి. కానీ అంత ఎత్తుకు తను ఎగరలేదు కదా. అందుకే ఒక ఉపాయం ఆలోచించింది.

నక్క మంచితనంగా ‘ఓ కోడి మరదలా! నీకో శుభవార్త. మన అడవి జంతువులన్నీ కలిసి ఇప్పుడే ఒక కొత్త చట్టం చేసుకున్నాయి. దాని ప్రకారం అడవిలో ఎవరూ ఒకదానినొకటి చంపుకోకూడదు, అందరూ స్నేహంగా ఉండాలి. కాబట్టి నువ్వు భయం లేకుండా కిందికి రా, ఇద్దరం ఆలింగనం చేసుకుని స్నేహం చేద్దాం’ అంది.

కోడి నక్క మోసాన్ని గ్రహించి, ‘అవునా బావా! ఎంత మంచి వార్త చెప్పావు. అదో చూడు, దూరంగా  వేటగాళ్లు తమ వేట కుక్కలతో ఇటువైపే వస్తున్నారు. ఆ కుక్కలు కూడా ఈ కొత్త చట్టం వింటే ఎంతో సంతోషిస్తాయి కదా’ అంది.

‘వేట కుక్కలు’ మాట వినగానే నక్క గుండె ఆగిపోయినంత పనైంది. తోక ముడుచుకుని పారిపోవడానికి సిద్ధమైంది. 

అప్పుడు కోడి నవ్వుతూ ‘ఎందుకు పారిపోతున్నావు నక్క బావా? కొత్త చట్టం వచ్చింది కదా, కుక్కలు నిన్నేం చేయవులే’ అంది. దానికి నక్క వణుకుతూ ‘బహుశా ఆ కుక్కలకు ఇంకా  కొత్త చట్టం తెలిసి ఉండదు’ అని అడవిలోకి పరుగు తీసింది. కోడి తన తెలివితో ప్రాణాలు కాపాడుకుంది.

నీతి: ఆపద సమయంలో ఆవేశపడకుండా ఉపాయంతో ఆలోచిస్తే ఎంతటి శత్రువునైనా ఓడించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement