breaking news
Hunting dog
-
తెలివైన చలికోడి
అనగనగా రష్యాలోని దట్టమైన మంచు అడవిలో ఒక చలికోడి (రష్యన్ గ్రౌస్) ఉండేది. ఒక సాయంత్రం ఆ కోడి ఒక చెట్టు కొమ్మపై కూర్చుని విశ్రాంతి తీసుకుంటోంది. అదే సమయంలో ఆహారం కోసం వెతుకుతున్న జిత్తులమారి నక్క ఆ చెట్టు కిందికి వచ్చింది. పైన కూర్చున్న కోడిని చూడగానే నక్క నోట్లో నీరూరాయి. కానీ అంత ఎత్తుకు తను ఎగరలేదు కదా. అందుకే ఒక ఉపాయం ఆలోచించింది.నక్క మంచితనంగా ‘ఓ కోడి మరదలా! నీకో శుభవార్త. మన అడవి జంతువులన్నీ కలిసి ఇప్పుడే ఒక కొత్త చట్టం చేసుకున్నాయి. దాని ప్రకారం అడవిలో ఎవరూ ఒకదానినొకటి చంపుకోకూడదు, అందరూ స్నేహంగా ఉండాలి. కాబట్టి నువ్వు భయం లేకుండా కిందికి రా, ఇద్దరం ఆలింగనం చేసుకుని స్నేహం చేద్దాం’ అంది.కోడి నక్క మోసాన్ని గ్రహించి, ‘అవునా బావా! ఎంత మంచి వార్త చెప్పావు. అదో చూడు, దూరంగా వేటగాళ్లు తమ వేట కుక్కలతో ఇటువైపే వస్తున్నారు. ఆ కుక్కలు కూడా ఈ కొత్త చట్టం వింటే ఎంతో సంతోషిస్తాయి కదా’ అంది.‘వేట కుక్కలు’ మాట వినగానే నక్క గుండె ఆగిపోయినంత పనైంది. తోక ముడుచుకుని పారిపోవడానికి సిద్ధమైంది. అప్పుడు కోడి నవ్వుతూ ‘ఎందుకు పారిపోతున్నావు నక్క బావా? కొత్త చట్టం వచ్చింది కదా, కుక్కలు నిన్నేం చేయవులే’ అంది. దానికి నక్క వణుకుతూ ‘బహుశా ఆ కుక్కలకు ఇంకా కొత్త చట్టం తెలిసి ఉండదు’ అని అడవిలోకి పరుగు తీసింది. కోడి తన తెలివితో ప్రాణాలు కాపాడుకుంది.నీతి: ఆపద సమయంలో ఆవేశపడకుండా ఉపాయంతో ఆలోచిస్తే ఎంతటి శత్రువునైనా ఓడించవచ్చు. -
కుక్కలకు భయపడి.. చిరుత చెట్టెక్కింది!
సాక్షి, కామారెడ్డి: పిల్లిని బంధించి కొడితే పులిలా మారి తిరగబడుతుందంటారు. కానీ వేట కుక్కలకు భయపడి ఓ చిరుత బేలగా మారి చెట్టెక్కింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోతాయిపేట అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోతాయిపల్లి, నందివాడ శివారులో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఆదివారం మధ్యాహ్నం గొర్రెల కాపరులకు చెందిన వేట కుక్కలపైకి ఓ చిరుత దాడికి యత్నించింది. అక్కడే ఉన్న ఎనిమిది వేట కుక్కలు చిరుతపై తిరగబడ్డాయి. ప్రాణభయంతో చిరుత చెట్టుపైకి ఎక్కింది. కాసేపటి తర్వాత కుక్కలు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో చిరుత చెట్టు దిగి అడవిలోకి వెళ్లిపోయింది. పశువుల కాపరులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎల్లారెడ్డి రేంజ్ అధికారి చంద్రకాంత్‌రెడ్డి బేస్ క్యాంపు సిబ్బందితో కలసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, పోతాయిపల్లి, కోమట్‌పల్లి, నందివాడ, కేశాయిపేట తదితర గ్రామాలకు చెందిన పశువుల కాపరులు, తునికాకు సేకరణ కోసం వెళ్లే మహిళలు అప్రమత్తంగా ఉండాలని చంద్రకాంత్‌రెడ్డి సూచించారు. చదవండి: 21దాకా లాక్డౌన్..? కరోనాకి అంత సీన్ లేదు! -
వేట, కొన్ని షరతులతో...
ఇది బ్రిటన్‌లో వేటకాలం. ‘హోల్కోంబి హంట్’గా పిలుచుకునే సంప్రదాయ వేడుక కూడా! దీనికి కనీసం వెయ్యేళ్ల చరిత్ర ఉంది. అందుకే ఉత్తర ఇంగ్లండ్ వేటగాడు స్టీవెన్ ఆష్వర్త్ తన వేటకుక్కలతో బయలుదేరాడు. అయితే, బ్రిటన్‌లో ప్రస్తుతం నక్కలు, జింకలు, కుందేళ్లు, మరికొన్ని వన్యప్రాణుల్ని ‘కుక్కలతో’ వేటాడటం మీద నిషేధం ఉంది. అందువల్ల ఆష్వర్త్లాంటివాళ్లు ఏం చేస్తారంటే, గుట్టుగా పోసిన సెంటు జాడను తమ కుక్కలతో పట్టించడం ద్వారా వేటాడిన తృప్తి పొందుతారు.


