రష్యాలో పార్లమెంటరీ ఎన్నికల సందడి  | Russia begins 3 days of voting in a parliamentary elections | Sakshi
Sakshi News home page

రష్యాలో పార్లమెంటరీ ఎన్నికల సందడి 

Sep 19 2026 5:41 AM | Updated on Sep 19 2026 5:41 AM

Russia begins 3 days of voting in a parliamentary elections

ఆన్‌లైన్‌ ద్వారా ఓటు వేసిన అధ్యక్షుడు పుతిన్‌   

మాస్కో: రష్యాలో పార్లమెంటరీ ఎన్నికల సందడి మొదలైంది. మూడు రోజులపాటు పోలింగ్‌ జరుగనుంది. దేశంలో 11.1 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఓటింగ్‌ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం అధికారులు వారాంతంలో పోలింగ్‌ ప్రక్రియ చేపట్టారు. ఈసారి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ విధానాన్ని కూడా అనుమతించారు. శుక్రవారం ప్రారంభమైన పోలింగ్‌ ఆదివారం ముగుస్తుంది. 

2022లో ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి దండయాత్ర ప్రారంభమైన తర్వాత జరుగుతున్న తొలి పార్లమెంటరీ ఎన్నికలు ఇవే కావడం విశేషం. ఉక్రెయిన్‌పై యుద్ధానికి ప్రజల మద్దతు ఉందని చాటుకోవాలని, తమ చర్యలకు చట్టబద్ధత ఉ న్నట్లుగా ఒక ముద్ర వే యాలని పుతిన్‌ ప్రభుత్వం భావిస్తోంది. అ ధ్యక్షుడు పుతిన్‌ శుక్ర వారం ఆన్‌లైన్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 

‘‘మీ ఎంపిక, మీ సంకల్పం లక్షలాది మంది మన యోధులకు అండగా నిలుస్తున్నారని నిరూపిస్తుంది. ఐక్యతను చాటిచెబుతుంది’’ అని పేర్కొన్నారు. ఓటు వేయడానికి కంప్యూటర్‌ స్క్రీన్‌ ముందు పుతిన్‌ ఉన్న వీడియోను రష్యా ప్రభుత్వ వార్తా సంస్థలు విడుదల చేశాయి.

 ప్రజలు ఓటు వేయడానికి రెండు వేర్వేరు బ్యాలెట్లను ఉపయోగిస్తారు. మొదటి బ్యాలెట్‌ లోని రాజకీయ పార్టీల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవడం ద్వారా పార్లమెంట్‌ దిగువ సభ అయిన స్టేట్‌ డూమాలోని 450 సీట్లలో సగాన్ని భర్తీ చేస్తారు. మిగిలిన సింగిల్‌–సీట్‌ నియోజకవర్గాల్లో అభ్యర్థు లను ఎన్నుకుంటారు. పుతిన్‌ నాయకత్వంలోని ‘యునైటెడ్‌ రష్యా’ స్టేట్‌ డూమాపై తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకో వడం ఖాయంగా కనిపిస్తోంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement