ఫైనాన్షియల్ పర్సనాలిటీ అంటే..? | Health Tips: Whats your money personality | Sakshi
Sakshi News home page

ఫైనాన్షియల్ పర్సనాలిటీ అంటే..?

Mar 18 2026 7:10 AM | Updated on Mar 18 2026 7:10 AM

Health Tips: Whats your money personality

డబ్బు కేవలం కరెన్సీ మాత్రమే కాదు, అది మీ 'పర్సనాలిటీకి అద్దం'. మీరు డబ్బును ఎలా చూస్తున్నారు? భద్రత కోసం చూస్తున్నారా? లేక హోదా కోసం చూస్తున్నారా?  

మీ వ్యక్తిత్వం ఎంత గొప్పదైనా, మీ డబ్బు ఖర్చు చేసే విధానం మీలోని భయాలను, ఆశలను బయటపెడుతుంది. సైకాలజీ ప్రకారం, మన ఫైనాన్షియల్ నిర్ణయాలు మన బాల్యంలో ఏర్పడిన నమ్మకాలపై (Money Beliefs) ఆధారపడి ఉంటాయి.

1. నాలుగు రకాల ఫైనాన్షియల్ పర్సనాలిటీలు

సైకాలజీ ప్రకారం, మనుషులను డబ్బును ఖర్చు చేసే తీరు బట్టి నాలుగు రకాలుగా విభజించవచ్చు. The Spender (ఖర్చు చేసేవాడు): వీరు డబ్బును 'సంతోషం' కోసం ఖర్చు చేస్తారు. ఎవరైనా ఏమనుకుంటారో అని, లేదా ఇన్‌స్టంట్ హ్యాపీనెస్ కోసం ఖర్చు చేస్తారు. ఇది వారిలోని 'అభద్రతా భావం' (Insecurity) ను కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం.

The Saver (దాచుకునేవాడు): వీరు డబ్బును 'భద్రత'గా భావిస్తారు. ప్రతి రూపాయిని దాచుకోవడం వీరి పర్సనాలిటీ. ఇది వారిలోని 'భవిష్యత్తు భయం' (Fear of the future) ను ప్రతిబింబిస్తుంది. 

The Avoider (తప్పించుకునేవాడు): వీరు తమ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూడ్డానికి కూడా భయపడతారు. డబ్బు విషయంలో ఒక రకమైన 'నిరాసక్తత'ను ప్రదర్శిస్తారు. ఇది వారి 'అసమర్థత' (Feeling of helplessness) ని సూచిస్తుంది. 

The Investor/Planner: వీరు డబ్బును ఒక 'సాధనం'లా వాడతారు. వీరిలో ప్లానింగ్, క్రమశిక్షణ ఉంటాయి. వీరు తమ వ్యక్తిత్వాన్ని 'రిస్క్ అండ్ రివార్డ్' తో బ్యాలెన్స్ చేసుకుంటారు.

2. మనీ ట్రాప్స్: పర్సనాలిటీని ఎలా దెబ్బతీస్తాయి?

Status Spending: మనకు నచ్చని వస్తువులను, మనకు ఇష్టం లేని వ్యక్తులను మెప్పించడానికి కొనడం. ఇది మీ 'ఆత్మవిశ్వాసం' లేకపోవడానికి సంకేతం.

Impulse Buying: ఎమోషనల్ గా ఉన్నప్పుడు (కోపం లేదా బాధ) ఖర్చు చేయడం. ఇది మీ 'ఎమోషనల్ ఇంటెలిజెన్స్' లోపం.

3. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్

Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ డబ్బుని మీ పర్సనాలిటీని పెంచే ఆయుధంగా ఎలా మార్చుకోవాలి?

Step 1: డబ్బుతో ఉన్న ఎమోషనల్ అటాచ్‌మెంట్‌ని బ్రేక్ చేయండి

మీరు ఎందుకు ఖర్చు చేస్తున్నారో గమనించండి. అది మీ అవసరమా? లేక మీలోని ఏదో వెలితిని నింపుకోవడానికా? మీరు 'Spender' అయితే, మీలోని 'Insecurity' ని 'Break' చేయండి. 'Saver' అయితే, మీలోని 'భయాన్ని' బ్రేక్ చేయండి.

Step 2: వాల్యూ బేస్డ్ స్పెండింగ్

మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి మీ Values ని ప్రతిబింబించాలి. మీరు చదువుకోవడానికి, ఆరోగ్యం కోసం, మంచి సంబంధాల కోసం ఖర్చు చేస్తున్నారా? అయితే అది మీ పర్సనాలిటీని Build చేసుకోవడం. అనవసరమైన వాటిని కట్ చేయండి.

Step 3: ఆర్థిక స్వేచ్ఛ

డబ్బు కోసమే బ్రతకడం కాదు, డబ్బు మీ కోసం పనిచేసేలా చేయాలి. మీ ఆర్థిక క్రమశిక్షణే మీ పర్సనాలిటీకి ఒక 'స్టేటస్'ను ఇస్తుంది. ఆర్థికంగా స్వేచ్ఛ ఉన్నప్పుడు, మీరు ప్రపంచాన్ని మరింత ధైర్యంగా ప్రభావితం చేయగలరు. ఇదే 'Beyond' స్టేజ్.

4. మీ ఫైనాన్షియల్ అద్దం

ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.

మీ గత నెల ఖర్చులలో ఎన్ని 'అవసరం' కోసం, ఎన్ని 'హోదా' కోసం?

మీరు ఎందుకు దాచుకుంటున్నారు? (భయం కోసమా? లక్ష్యం కోసమా?)

మీరు కష్టపడి సంపాదించిన డబ్బుకి, మీ వ్యక్తిత్వానికి సంబంధం ఉందని మీరు నమ్ముతున్నారా?

డబ్బు - మీ పర్సనాలిటీకి మందు!
బ్రో, డబ్బు లేకపోవడం వల్ల వచ్చేది పేదరికం, కానీ డబ్బుని సరిగ్గా నిర్వహించలేకపోవడం వల్ల వచ్చేది 'పర్సనాలిటీ క్రైసిస్'. క్రమశిక్షణతో కూడిన ఖర్చు, మీ వ్యక్తిత్వానికి ఒక గొప్ప గౌరవాన్ని ఇస్తుంది.

"Wealth is not about having a lot of money; it's about having a lot of options."  

Naval Ravikanth
సైకాలజిస్ట్ విశేష్ 
Genius Matrix Hub 
8019 000066
www.psyvisesh.com

(చదవండి: ఒత్తిడిలో మీ నిజమైన పర్సనాలిటీ బయటపడుతుందా?)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement