మౌనం మీ వ్యక్తిత్వాన్ని ఎలా పెంచుతుంది? | Health Tips: The Power of Silence Master It Before You Speak Again | Sakshi
Sakshi News home page

మౌనం మీ వ్యక్తిత్వాన్ని ఎలా పెంచుతుంది?

Mar 29 2026 4:06 PM | Updated on Mar 30 2026 10:00 AM

Health Tips: The Power of Silence Master It Before You Speak Again

ఒక పవర్‌ఫుల్ పర్సనాలిటీకి ఉండాల్సిన అతిపెద్ద ఆయుధం 'మాట' మాత్రమే కాదు.. ‘మౌనం’ కూడా అవసరం. చాలామంది మౌనాన్ని బలహీనత అనుకుంటారు, కానీ సైకాలజీ ప్రకారం మౌనం అనేది ఒక 'స్ట్రాటజిక్ పవర్'. మీరు ఎప్పుడు మాట్లాడాలో తెలియడం కంటే, ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలో తెలియడం మీ మెచ్యూరిటీకి నిదర్శనం.

నిజమైన అధికారం ఉన్న వ్యక్తి ఎప్పుడూ ఎక్కువగా అరవడు. నిశ్శబ్దం అనేది ఒక రకమైన 'గ్రేవిటాస్' (Gravitas) ని ఇస్తుంది. మీరు తక్కువగా మాట్లాడినప్పుడు, మీరు మాట్లాడే ప్రతి మాటకి విలువ పెరుగుతుంది. మౌనం మీ ప్రొఫెషనల్, సోషల్ ఇమేజ్‌ని ఎలా మారుస్తుందో చూద్దాం.

నిశ్శబ్దంలోని రకాలు 
మౌనం అంటే కేవలం మాట్లాడకపోవడం కాదు. అది ఒక కమ్యూనికేషన్ టూల్.

The Listening Silence: ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు మౌనంగా వినడం. ఇది వారిని గౌరవిస్తున్నట్లు అనిపిస్తుంది. మీరు వారి గురించి ఎక్కువ సమాచారం తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

The Thinking Silence: ఒక ప్రశ్న అడిగినప్పుడు వెంటనే సమాధానం చెప్పకుండా, ఒక రెండు సెకన్లు ఆగి చెప్పడం. ఇది మీరు 'ఆలోచించి' మాట్లాడుతున్నారనే నమ్మకాన్ని కలిగిస్తుంది.

The Power Pause: ప్రసంగం మధ్యలో ఇచ్చే చిన్న విరామం. ఇది వినేవారిలో కుతూహలాన్ని పెంచుతుంది.

తక్కువ మాట్లాడటం వల్ల వచ్చే లాభాలు 

Control of Emotions: మీరు మౌనంగా ఉన్నప్పుడు మీ ఎమోషన్స్ మీ కంట్రోల్ లో ఉంటాయి. ఆవేశంలో తప్పుడు మాటలు అనే ప్రమాదం తప్పుతుంది.

Increased Observation: నోరు తెరిస్తే మనం కేవలం మనకు తెలిసింది మాత్రమే చెప్తాం, కానీ చెవి తెరిస్తే కొత్త విషయాలు నేర్చుకుంటాం.

Mystery & Respect: ఎక్కువగా మాట్లాడేవారిని ప్రజలు తేలికగా తీసుకుంటారు. తక్కువగా, అర్థవంతంగా మాట్లాడేవారి పట్ల ఒక రకమైన గౌరవం, మిస్టరీ ఏర్పడతాయి.

నిశ్శబ్ద శక్తి...
మోటివేషన్ స్పీకర్లు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు "నీ వాయిస్ వినిపించు, అందరినీ డామినేట్ చేయి" అని చెప్తుంది. ఇది ఒక్కోసారి మిమ్మల్ని 'నాయిసీ' (Noisy) పర్సనాలిటీగా మారుస్తుంది. కానీ సైకాలజీ ఇందుకు భిన్నమైన మార్గం చూపిస్తుంది. "నీ మాటలు విలువైనవి, వాటిని అవసరమైనప్పుడే వాడు" అని చెప్తుంది. నిశ్శబ్దం అనేది అజ్ఞానానికి చిహ్నం కాదు, అది ఆత్మవిశ్వాసానికి చిహ్నం.

మౌనాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి?
Genius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, మీ పర్సనాలిటీలో నిశ్శబ్దాన్ని ఎలా భాగం చేసుకోవాలి?

Step 1: అనవసరమైన వివరణలు తగ్గించండి
మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి ఇచ్చే అనవసరమైన వివరణలను 'Break' చేయండి. ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా లేదా ప్రశ్నించినా, వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఒక నిమిషం మౌనంగా ఉండండి. ఆ నిశ్శబ్దమే అవతలి వ్యక్తిని ఆలోచింపజేస్తుంది.

Step 2: Build Deep Listening
మనుషులతో మాట్లాడేటప్పుడు "నేను ఎప్పుడు మాట్లాడాలి?" అని కాకుండా "వారు ఏం చెప్తున్నారు?" అని వినడం నేర్చుకోండి. మీరు ఎంత ఎక్కువ వింటే, మీ నిర్ణయాలు అంత ఖచ్చితంగా ఉంటాయి. మౌనం మిమ్మల్ని మంచి అబ్జర్వర్ గా మారుస్తుంది.

Step 3: Presence
మీరు ఏమీ మాట్లాడకుండా ఒక గదిలో కూర్చున్నా, మీ 'ప్రెజెన్స్' అందరికీ తెలియాలి. మీ కళ్ళలో ఉండే ప్రశాంతత, మీ బాడీ లాంగ్వేజ్ లో ఉండే స్థిరత్వం మీ మౌనాన్ని పవర్‌ఫుల్ గా మారుస్తాయి. ఇదే 'Beyond' స్టేజ్.

మీ మాటల విలువ ఎంత?
ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.
1.    ఈ రోజు మీరు మాట్లాడిన మాటలలో ఎన్ని అనవసరమైనవి?
2.    ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు మీరు వారిని మధ్యలో ఆపారా?
3.    మీరు మౌనంగా ఉన్నప్పుడు మీకు అసౌకర్యంగా అనిపిస్తోందా?

నిశ్శబ్దం మీ సంతకం!
బ్రో, ఖాళీగా ఉన్న పాత్రలే ఎక్కువ శబ్దం చేస్తాయి. నిండుగా ఉన్న వ్యక్తిత్వం నిశ్శబ్దంగా ఉంటుంది. మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీ వ్యక్తిత్వానికి అంతటి గాంభీర్యం (Depth) వస్తుంది. మౌనాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి, అది మిమ్మల్ని ప్రపంచం వైపు నుంచి మీ వైపుకు మళ్ళిస్తుంది.

"Silence is a source of great strength." 
-    Lao Tszu

 

సైకాలజిస్ట్ విశేష్ 
Genius Matrix Hub 
8019 000066
www.psyvisesh.com

(చదవండి: The Professional Mask: ఆఫీసులో మీ వ్యక్తిత్వం ఎలా ఉండాలి?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement