విమర్శలను మెట్లుగా ఎలా మార్చుకోవాలి? | Health Tips: How to Take Criticism and Turn It into Growth | Sakshi
Sakshi News home page

విమర్శలను మెట్లుగా ఎలా మార్చుకోవాలి?

Mar 24 2026 7:10 AM | Updated on Mar 24 2026 7:10 AM

Health Tips: How to Take Criticism and Turn It into Growth

మనం ఎదుగుతున్న కొద్దీ, మన చుట్టూ ఉండేవారు మనల్ని గమనించడం మొదలుపెడతారు. మీరు ఒక లీడర్‌గా, ఒక ఇన్ఫ్లుయెన్సర్‌గా మారుతున్నప్పుడు మీకు ఎదురయ్యే అతిపెద్ద సవాలు—విమర్శ. చాలామంది విమర్శ రాగానే కుంగిపోతారు లేదా ఎదురుదాడి చేస్తారు. కానీ ఒక 'జీనియస్' వ్యక్తిత్వానికి విమర్శ అనేది ఒక 'చెత్త' కాదు, అది ఒక 'ఎరువు' (Fertilizer).  

ప్రపంచంలో ఏమీ చేయని వాడిని ఎవరూ విమర్శించరు. మీరు విమర్శలు ఎదుర్కొంటున్నారంటే, మీరు ఏదో ఒకటి చేస్తున్నారు అని అర్థం. విమర్శ అనేది మీ పని తీరుపై లేదా మీ ప్రవర్తనపై ఇతరులు ఇచ్చే ఒక 'ఫీడ్‌బ్యాక్'. దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే మీ Professional Maturity ని నిర్ణయిస్తుంది.

ఏది తీసుకోవాలి? ఏది వదలాలి?
విమర్శలను మనం రెండు రకాలుగా విభజించవచ్చు.

నిర్మాణాత్మక విమర్శ (Constructive Criticism): ఇది మీ పనిని మెరుగుపరచడానికి ఉద్దేశించినది. ఇందులో లాజిక్ ఉంటుంది, మీ తప్పు ఎక్కడ ఉందో స్పష్టంగా చెప్తుంది. ఇది మీకు ఒక 'గురువు' లాంటిది.

విధ్వంసకర విమర్శ (Destructive Criticism): ఇది కేవలం మిమ్మల్ని మానసికగా దెబ్బతీయడానికి, మీ పరువు తీయడానికి చేసేది. ఇందులో అసూయ, ద్వేషం ఉంటాయి. దీన్ని మీరు ఒక 'నాయిస్' (Noise) లాగా వదిలేయాలి.

ది సైకాలజీ ఆఫ్ రియాక్షన్...
ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు మన మెదడులోని Amygdala వెంటనే "ప్రమాదం!" అని సిగ్నల్ ఇస్తుంది. అందుకే మనకు వెంటనే కోపం లేదా బాధ కలుగుతుంది.

Stoic Approach: విమర్శ రాగానే స్పందించకండి. "ఈ మాటలో నిజం ఉందా?" అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నిజం ఉంటే సరిదిద్దుకోండి, అబద్ధం అయితే నవ్వి ఊరుకోండి. ఎదుటివారి మాటలకు మీ ప్రశాంతతను తాకట్టు పెట్టకండి.

మోటివేషన్ మాయ vs రియల్ గ్రోత్
మోటివేషన్ "నిన్ను విమర్శించే వాళ్ళ నోళ్ళు మూయించు, నువ్వు ఎవరో నిరూపించుకో" అని ఆవేశాన్ని నూరిపోస్తుంది. ఇది మీలో అహంకారాన్ని (Ego) పెంచుతుంది.

సైకాలజీ "విమర్శను ఒక డేటా పాయింట్‌లా చూడు. నీ పర్సనాలిటీలో నీకు తెలియని 'Blind Spots' ని విమర్శకులు చూపిస్తారు" అని చెప్తుంది. విమర్శకుడు మీ ఉచిత సలహాదారు అని భావించండి.

విమర్శను మెట్టుగా మార్చే ఫార్ములా

Genius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, విమర్శను డీల్ చేసే విధానం.

Step 1: Break Emotional Defense  

విమర్శ వినగానే "నన్నే అంటావా?" అనే ఆ అహాన్ని 'Break' చేయండి. వెంటనే సమాధానం ఇవ్వాలనే ఆత్రుతను ఆపండి. ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉండటం వల్ల మీరు ఆ విమర్శను లాజికల్‌గా విశ్లేషించగలరు.

Step 2: Build Filtering Process  

వచ్చిన విమర్శ నుండి 'విషయాన్ని' (Content) తీసుకోండి, 'విషాన్ని' (Tone) వదిలేయండి. మీ పనిని మెరుగుపరిచే పాయింట్ ఏమైనా ఉందా? అని వెతకండి. ఉంటే, దాన్ని మీ పనిలో ఇంప్లిమెంట్ చేసి మీ నైపుణ్యాన్ని పెంచుకోండి.  

Step 3: Graceful Acceptance

మిమ్మల్ని విమర్శించిన వ్యక్తికి "థాంక్యూ, నీ ఫీడ్‌బ్యాక్ వల్ల నేను ఒక కొత్త విషయం తెలుసుకున్నాను" అని చెప్పండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ కరిష్మాను వంద రెట్లు పెంచుతుంది. విమర్శలను కూడా చిరునవ్వుతో స్వీకరించే స్థాయికి వెళ్లడమే 'Beyond' స్టేజ్.

విమర్శను ఎలా చూస్తున్నారు?

ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.

ఈ మధ్య కాలంలో మిమ్మల్ని ఎవరైనా విమర్శించారా? ఆ సమయంలో మీరు ఎలా రియాక్ట్ అయ్యారు?

ఆ విమర్శలో కనీసం 1% అయినా నిజం ఉందా?

ఆ విమర్శ మిమ్మల్ని మంచి వ్యక్తిగా మార్చిందా లేక కోపిష్టిగా మార్చిందా?

విమర్శకులు మీ ఎదుగుదలకి కావాలి!
బ్రో, ఒక శిల్పం అందంగా మారాలంటే దానికి ఉలి దెబ్బలు తగలాలి. విమర్శలు ఆ ఉలి దెబ్బల వంటివి. మీరు ఎంత గొప్పగా విమర్శలను స్వీకరిస్తారో, అంత అందమైన వ్యక్తిత్వంగా మీరు రూపొందుతారు. విమర్శకులని శత్రువులుగా చూడకండి, వారిని మీ క్వాలిటీ చెకర్స్ లాగా చూడండి.

"To avoid criticism, do nothing, say nothing, and be nothing.

-Aristotle
సైకాలజిస్ట్ విశేష్ 
Genius Matrix Hub 
8019 000066
www.psyvisesh.com

(చదవండి: నాయకుడిలా ఆలోచించడం ఎలా..?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement