critisising
-
విమర్శలను మెట్లుగా ఎలా మార్చుకోవాలి?
మనం ఎదుగుతున్న కొద్దీ, మన చుట్టూ ఉండేవారు మనల్ని గమనించడం మొదలుపెడతారు. మీరు ఒక లీడర్‌గా, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారుతున్నప్పుడు మీకు ఎదురయ్యే అతిపెద్ద సవాలు—విమర్శ. చాలామంది విమర్శ రాగానే కుంగిపోతారు లేదా ఎదురుదాడి చేస్తారు. కానీ ఒక 'జీనియస్' వ్యక్తిత్వానికి విమర్శ అనేది ఒక 'చెత్త' కాదు, అది ఒక 'ఎరువు' (Fertilizer). ప్రపంచంలో ఏమీ చేయని వాడిని ఎవరూ విమర్శించరు. మీరు విమర్శలు ఎదుర్కొంటున్నారంటే, మీరు ఏదో ఒకటి చేస్తున్నారు అని అర్థం. విమర్శ అనేది మీ పని తీరుపై లేదా మీ ప్రవర్తనపై ఇతరులు ఇచ్చే ఒక 'ఫీడ్‌బ్యాక్'. దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే మీ Professional Maturity ని నిర్ణయిస్తుంది.ఏది తీసుకోవాలి? ఏది వదలాలి?విమర్శలను మనం రెండు రకాలుగా విభజించవచ్చు.నిర్మాణాత్మక విమర్శ (Constructive Criticism): ఇది మీ పనిని మెరుగుపరచడానికి ఉద్దేశించినది. ఇందులో లాజిక్ ఉంటుంది, మీ తప్పు ఎక్కడ ఉందో స్పష్టంగా చెప్తుంది. ఇది మీకు ఒక 'గురువు' లాంటిది.విధ్వంసకర విమర్శ (Destructive Criticism): ఇది కేవలం మిమ్మల్ని మానసికగా దెబ్బతీయడానికి, మీ పరువు తీయడానికి చేసేది. ఇందులో అసూయ, ద్వేషం ఉంటాయి. దీన్ని మీరు ఒక 'నాయిస్' (Noise) లాగా వదిలేయాలి.ది సైకాలజీ ఆఫ్ రియాక్షన్...ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు మన మెదడులోని Amygdala వెంటనే "ప్రమాదం!" అని సిగ్నల్ ఇస్తుంది. అందుకే మనకు వెంటనే కోపం లేదా బాధ కలుగుతుంది.Stoic Approach: విమర్శ రాగానే స్పందించకండి. "ఈ మాటలో నిజం ఉందా?" అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నిజం ఉంటే సరిదిద్దుకోండి, అబద్ధం అయితే నవ్వి ఊరుకోండి. ఎదుటివారి మాటలకు మీ ప్రశాంతతను తాకట్టు పెట్టకండి.మోటివేషన్ మాయ vs రియల్ గ్రోత్మోటివేషన్ "నిన్ను విమర్శించే వాళ్ళ నోళ్ళు మూయించు, నువ్వు ఎవరో నిరూపించుకో" అని ఆవేశాన్ని నూరిపోస్తుంది. ఇది మీలో అహంకారాన్ని (Ego) పెంచుతుంది.సైకాలజీ "విమర్శను ఒక డేటా పాయింట్లా చూడు. నీ పర్సనాలిటీలో నీకు తెలియని 'Blind Spots' ని విమర్శకులు చూపిస్తారు" అని చెప్తుంది. విమర్శకుడు మీ ఉచిత సలహాదారు అని భావించండి.విమర్శను మెట్టుగా మార్చే ఫార్ములాGenius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, విమర్శను డీల్ చేసే విధానం.Step 1: Break Emotional Defense విమర్శ వినగానే "నన్నే అంటావా?" అనే ఆ అహాన్ని 'Break' చేయండి. వెంటనే సమాధానం ఇవ్వాలనే ఆత్రుతను ఆపండి. ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉండటం వల్ల మీరు ఆ విమర్శను లాజికల్‌గా విశ్లేషించగలరు.Step 2: Build Filtering Process వచ్చిన విమర్శ నుండి 'విషయాన్ని' (Content) తీసుకోండి, 'విషాన్ని' (Tone) వదిలేయండి. మీ పనిని మెరుగుపరిచే పాయింట్ ఏమైనా ఉందా? అని వెతకండి. ఉంటే, దాన్ని మీ పనిలో ఇంప్లిమెంట్ చేసి మీ నైపుణ్యాన్ని పెంచుకోండి. Step 3: Graceful Acceptanceమిమ్మల్ని విమర్శించిన వ్యక్తికి "థాంక్యూ, నీ ఫీడ్‌బ్యాక్ వల్ల నేను ఒక కొత్త విషయం తెలుసుకున్నాను" అని చెప్పండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ కరిష్మాను వంద రెట్లు పెంచుతుంది. విమర్శలను కూడా చిరునవ్వుతో స్వీకరించే స్థాయికి వెళ్లడమే 'Beyond' స్టేజ్.విమర్శను ఎలా చూస్తున్నారు?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.ఈ మధ్య కాలంలో మిమ్మల్ని ఎవరైనా విమర్శించారా? ఆ సమయంలో మీరు ఎలా రియాక్ట్ అయ్యారు?ఆ విమర్శలో కనీసం 1% అయినా నిజం ఉందా?ఆ విమర్శ మిమ్మల్ని మంచి వ్యక్తిగా మార్చిందా లేక కోపిష్టిగా మార్చిందా?విమర్శకులు మీ ఎదుగుదలకి కావాలి!బ్రో, ఒక శిల్పం అందంగా మారాలంటే దానికి ఉలి దెబ్బలు తగలాలి. విమర్శలు ఆ ఉలి దెబ్బల వంటివి. మీరు ఎంత గొప్పగా విమర్శలను స్వీకరిస్తారో, అంత అందమైన వ్యక్తిత్వంగా మీరు రూపొందుతారు. విమర్శకులని శత్రువులుగా చూడకండి, వారిని మీ క్వాలిటీ చెకర్స్ లాగా చూడండి."To avoid criticism, do nothing, say nothing, and be nothing.-Aristotleసైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: నాయకుడిలా ఆలోచించడం ఎలా..?) -
కాంగ్రెస్‌ను నమ్మితే.. శంకరగిరి మాన్యాలే
జడ్చర్ల: కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని 55 ఏళ్లు పాలించినా ఏనాడూ ప్రజా సమస్యలు పట్టించుకోలేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికలు వస్తున్నందున మాకొక అవకాశమివ్వండి అంటూ కాంగ్రెస్ సన్నాసులు నక్క వినయాలు ప్రదర్శించి మీ ముందుకు వస్తున్నారని చెప్పారు. వారిని పొరపాటున నమ్మితే మిమ్మల్ని శంకరగిరి మాన్యాలు పట్టిస్తారని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిందేమిటో.. అలాగే తాము చెడగొట్టింది ఏమిటో చెప్పాలని నిలదీశారు. జడ్చర్లలో రూ.33.03 కోట్లతో నిర్మించిన 560 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేటీఆర్ మాట్లాడారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, దళితబంధు వంటి పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు. నాటి కాంగ్రెస్ పాలనలో రెండు దఫాలుగా ఇచ్చే ఆరు గంటల కరెంట్‌తో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. ఎవరైనా చస్తే మేం అంత్యక్రియలకు పోతున్నాం బావి దగ్గర స్నానాలకు ఒక అరగంట పాటు కరెంట్ ఇవ్వండని విద్యుత్ సిబ్బందిని బతిమిలాడిన రోజులను ఎలా మరిచిపోతామన్నారు. నేడు 24 గంటలూ కరెంట్ ఇస్తున్న ఘనత తమదేనని స్పష్టంచేశారు. ‘నాడు తాగునీటికి గోస ఉండే.. 14 రోజులకోసారి తాగునీళ్లు వచ్చేది. తెలంగాణ రాక ముందు ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళ్లాలంటే తాగునీటి సమస్యలపై బిందెలు అడ్డుపెట్టి కుండలు మర్లేసి తంతరనే భయం ఉండేది. ఇప్పుడా పరిస్థితి ఎక్కడైనా ఉందా’అని అన్నారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధం రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని అంటున్నారని.. లెక్కలతో రండి బట్టలూడదీస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘జడ్చర్లలో మా లక్ష్మన్న, మహబూబ్‌నగర్‌లో శ్రీనన్నలు అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు దమ్ముంటే చర్చకు రావాలి. కోర్టు కేసులతో కాంగ్రెస్ సన్నాసులు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రయతి్నస్తున్నా.. వాయువేగంతో 90 శాతం పనులు పూర్తిచేశాం. ఆగస్టులో కర్వెన రిజర్వాయర్‌ను కృష్ణా జలాలతో నింపుతాం. ఉదండాపూర్నూ త్వరగా పూర్తిచేసి జడ్చర్ల నియోజకవర్గంలోని 1.44 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం’అని చెప్పారు. ‘ఒకాయన 800 కి.మీ. తిరిగిన అంటూ బోర్డులు పట్టుకుని తిరుగుతుండ్రు. నాడు మీరు అభివృద్ధి చేసి ఉంటే.. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ఉంటే.. ఇప్పుడు సన్నాసి యాత్రలు ఉండేవా’అని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కోరిక మేరకు జడ్చర్ల మున్సిపాలిటీని గ్రేడ్–1గా మారుస్తామని, పట్టణ అభివృద్ధికి రూ.30 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు జెడ్పీ సెంటర్/భూత్పూర్/అడ్డాకుల: మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్పూర్ మున్సిపాలిటీ, మూసాపేట, జిల్లా కేంద్రంతోపాటు జడ్చర్లలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా భూత్పూర్ మున్సిపాలిటీలో మినీ ట్యాంక్‌బండ్‌పై ఓపెన్‌జిమ్‌ను ప్రారంభించారు. అనంతరం మూసాపేట మండలం వేముల సమీపంలోని ఎస్జీడీ ఫార్మా వద్ద రూ.500 కోట్లతో కొత్తగా ఎస్జీడీ ఫార్మా కార్నింగ్ టెక్నాలజీ ఫ్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు చేరుకున్న కేటీఆర్ మెట్టుగడ్డలోని మహిళా ఐటీఐ కాలేజీ ఆవరణలో సెయింట్ ఫౌండేషన్, శాంతానారాయణగౌడ్ చారిటబుల్ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం జడ్చర్లలో డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. కాగా, జడ్చర్లలోని నేతాజీ చౌరస్తాలో కొందరు బీజేపీ కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయికి అడ్డుగా రావడంతో కాసేపు నిలిపివేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. -
రైతు దీక్షను విమర్శించడం అనైతికం
అనంతపురం అర్బన్: రైతులు, డ్వాక్రా మహిళల పక్షాన తణుకులో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చేపట్టిన రైతుదీక్షను విమర్శించేస్థాయి టీడీపీ రౌడీ మూకలకు లేదని వైఎస్సార్కాంగ్రెస్పార్టీ నాయకులు ఫైర్ అయ్యారు. స్థానిక రెండో రోడ్డులోని వైఎస్సార్కాంగ్రెస్పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యులు బి. ఎర్రిస్వామిరెడ్డి, నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి మాట్లాడారు. వైఎస్ జగన్‌పై ఉన్న ప్రజాదరణ ఓర్వలేక స్థాయి లేని నాయకులు దీక్షను విమర్శిస్తూ.. ఎక్కడ తమ పార్టీ మనుగడ కోల్పోతోందన్న భయంతో పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. ప్రజలను మోసం చేసి చంద్రబాబుపై 420 కేసు నమోదు చేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి పాలన చేపట్టినప్పుడు ప్రజలు ‘రామరాజ్యం చూడలేదు కానీ.. రాజన్న రాజ్యం చూశామ’ని కోట్లాది మంది ప్రజలు అన్నారన్నారు. ఆ మహానేతను విమర్శించే స్థాయి ఈ రౌడీ ముఖలకు ఉందా..? అంటూ ధ్వజమెత్తారు. ఎవరి పాలనలో ఏం అభివృద్ధి జరిగిందో బహిరంగ బ్యాలెట్‌కు సిద్ధమా..? అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబుకు ప్రభుత్వంపై ఆరు మాసాలకే ప్రజావ్యతిరేకత వచ్చిందన్నారు. దీనికి నిదర్శనం పశ్చిమగోదావరి జిల్లాలో చేపట్టిన రైతుదీక్షేనన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాలలో టీడీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారన్నారు. అక్కడి ప్రజలు వేలాదిగా రైతుకు దీక్షకు తరలివెళ్లడం గమనార్హం. ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలే జయరాంనాయక్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గిరిజనల సంక్షేమ కోసం గోరంట్ల మండలంలో భూములు పంచితే.. ఇప్పుడు ఆ భూములను వెనక్కిలాక్కుంటున్నారన్నారు. మహిళ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి. శ్రీదేవిరెడ్డి మాట్లాడుతూ ‘నారావారి మాటలు.. నీటి మూటలే’ అన్నట్లుగా ఆయన ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలాగానే మిగిలిపోయాన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కార్యదర్శి గౌస్‌మొద్దీన్, నల్లచెరువు సర్పంచ్ ఎం. రవికుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


