మీ వ్యక్తిత్వాన్ని చంపేసే మనుషులకు దూరంగా.. | Health Tips In Telugu, How To Protect Yourself From Toxic People And Preserve Your Peace | Sakshi
Sakshi News home page

Toxic Relationships: మీ వ్యక్తిత్వాన్ని చంపేసే మనుషులకు దూరంగా..

Apr 1 2026 7:10 AM | Updated on Apr 1 2026 11:23 AM

Health Tips: How to Handle a Toxic Relationship

ఒక మొక్కకి ఎంత నీరు పోసినా, దాని చుట్టూ కలుపు మొక్కలు ఉంటే అది ఎండిపోతుంది. అలాగే టాక్సిక్ మనుషుల మధ్య ఉంటే మీ ప్రగతి ఆగిపోతుంది. టాక్సిక్ మనుషులు అంటే కేవలం మనల్ని తిట్టే వారు కాదు. మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే వారు, మీ కలలను ఎగతాళి చేసేవారు, మీలోని నెగటివిటీని బయటకు తీసే ప్రతి ఒక్కరూ టాక్సిక్ వ్యక్తులే. వీరిని గుర్తించడం ఒక ఎత్తు అయితే, వారి నుండి దూరంగా జరగడం మరొక ఎత్తు.

టాక్సిక్ వ్యక్తులను గుర్తించడం ఎలా?
సైకాలజీ ప్రకారం టాక్సిక్ వ్యక్తుల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి.

Gaslighting: మీరు చెప్పేది అబద్ధం అని, మీ ఆలోచనలే తప్పు అని మిమ్మల్ని మీరు అనుమానించుకునేలా చేస్తారు.

Emotional Drain: వారితో కాసేపు మాట్లాడితే చాలు, మీ ఎనర్జీ అంతా అయిపోయినట్లు అనిపిస్తుంది.

Constant Criticism: మీరు ఏం చేసినా అందులో తప్పు వెతుకుతారు. మెచ్చుకోవడం వారికి అస్సలు తెలియదు.

The Victim Card: ఎప్పుడూ తామే బాధితులం అని ఏడుస్తూ, మీపై 'గిల్ట్' ని రుద్దుతారు.

మీ వ్యక్తిత్వంపై దీని ప్రభావం...
మీరు ఎంత పవర్‌ఫుల్ పర్సనాలిటీ బిల్డ్ చేసుకున్నా, టాక్సిక్ రిలేషన్స్ వల్ల మీ Decision Making పవర్ తగ్గిపోతుంది. మీలో Self-Doubt పెరుగుతుంది. మీరు మీ ఒరిజినాలిటీని కోల్పోయి, వారిని మెప్పించడానికి ప్రయత్నిస్తారు.

మోటివేషన్ మాయ vs రియల్ బౌండరీస్
మోటివేషన్ "అందరినీ ప్రేమించు, అందరినీ మార్చడానికి ప్రయత్నించు" అని చెప్తుంది. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.సైకాలజీ "నువ్వు అందరినీ మార్చలేవు. నీ ప్రశాంతత కోసం కొన్ని సంబంధాల నుండి తప్పుకోవడంలో తప్పులేదు" అని చెప్తుంది. దూరం జరగడం అంటే ద్వేషించడం కాదు, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం.

టాక్సిక్ ఫ్రీ లైఫ్
Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ సమస్య నుండి బయటపడే మార్గం.

Step 1: Break Attachment
"వారు నా పాత స్నేహితులు" లేదా "వారు నా బంధువులు" అనే ఎమోషనల్ అటాచ్‌మెంట్‌ని 'Break' చేయండి. మీ ఎదుగుదలకు అడ్డుపడే ఏ బంధమైనా అది భారమే. వారు బాధపడతారేమో అనే 'గిల్ట్' నుండి బయటపడండి. మీ జీవితానికి మీరే యజమాని.

Step 2: Build Healthy Boundaries
ప్రతి ఒక్కరికీ మీ జీవితంలోకి పూర్తి యాక్సెస్ ఇవ్వకండి. ఎవరితో ఎంతవరకు ఉండాలో ఒక 'లైన్' ని 'Build' చేయండి. "నో" చెప్పడం నేర్చుకోండి. మీ సమయాన్ని, మీ ఎనర్జీని గౌరవించే వారిని మాత్రమే దగ్గరకు రానివ్వండి.

Step 3: Healing & Growth
టాక్సిక్ వ్యక్తుల నుండి దూరమయ్యాక, ఆ ఖాళీని 'సెల్ఫ్-లవ్' తో నింపండి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీరు ఎప్పుడైతే ఉన్నత స్థాయికి చేరుకుంటారో, ఆటోమేటిక్‌గా మీ చుట్టూ పాజిటివ్ వ్యక్తులే మిగులుతారు. ఇదే 'Beyond' స్టేజ్.

మీ చుట్టూ ఉన్నది ఎవరు?
ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.
1.    మీ కాంటాక్ట్ లిస్ట్ లోని టాప్ 5 వ్యక్తులు మీ గురించి ఏం మాట్లాడుతారు?
2.    మీరు ఎవరికైనా భయపడి మీ అభిప్రాయాలను దాచుకుంటున్నారా?
3.    మిమ్మల్ని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తున్న ఆ ఒక్క వ్యక్తి ఎవరు?

మీ ప్రశాంతతే మీ లెగసీ!
బ్రో, ప్రపంచంలో ఏ విజయం కూడా మీ మనశ్శాంతి కంటే పెద్దది కాదు. టాక్సిక్ వ్యక్తుల నుండి దూరంగా జరగడం అనేది మీ బలహీనత కాదు, అది మీ 'బలం'. మీ పర్సనాలిటీ ఒక స్వచ్ఛమైన గాలి లాంటిది, దాన్ని కలుషితం చేసే వారిని అనుమతించకండి.

"You cannot heal in the same environment that made you sick."
సైకాలజిస్ట్ విశేష్ 
Genius Matrix Hub 
8019 000066
www.psyvisesh.com

(చదవండి: మౌనం మీ వ్యక్తిత్వాన్ని ఎలా పెంచుతుంది?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement