ఆన్‌లైన్ ప్రపంచంలో మీ ప్రవర్తన | Digital Etiquette: The Dos and Donts of Online | Sakshi
Sakshi News home page

Digital Etiquette: ఆన్‌లైన్ ప్రపంచంలో మీ ప్రవర్తన

Mar 26 2026 7:10 AM | Updated on Mar 26 2026 7:10 AM

Digital Etiquette: The Dos and Donts of Online

ఈ రోజుల్లో ఒక వ్యక్తిని ప్రత్యక్షంగా కలవకముందే, అతని ఆన్‌లైన్ ప్రొఫైల్ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నాం. మీరు లింక్డ్‌ఇన్ లో ఏం పోస్ట్ చేస్తున్నారు, వాట్సాప్ లో ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఈమెయిల్స్ ఎలా రాస్తున్నారు అనేదే మీ 'Digital Personality'.

ఈ డిజిటల్ ప్రపంచం ఒక గోడ లేని గది లాంటిది. ఇక్కడ మీరు చేసే ప్రతి చిన్న పని ఒక రికార్డ్‌గా మిగిలిపోతుంది. ఆన్‌లైన్‌లో మీరు ప్రదర్శించే ప్రవర్తన మీ ప్రొఫెషనల్ కెరీర్ ని నిర్మించగలదు లేదా దెబ్బతీయగలదు. ఒక పరిణతి చెందిన వ్యక్తిగా డిజిటల్ స్పేస్‌లో మీరు పాటించాల్సిన నియమాలు ఇక్కడ ఉన్నాయి.

The Internet Never Forgets...
చాలామంది సోషల్ మీడియాలో ఆవేశంగా కామెంట్స్ చేస్తుంటారు లేదా అనవసరమైన పోస్టులు పెడుతుంటారు. కానీ గుర్తుంచుకోండి మీరు డిలీట్ చేసినా, ఇంటర్నెట్ లో ఏదో ఒక మూల మీ డేటా ఉంటుంది (Digital Footprint). భవిష్యత్తులో మీరు ఒక పెద్ద పొజిషన్‌కి వెళ్ళినప్పుడు మీ పాత డిజిటల్ ప్రవర్తన మీకు అడ్డంకి కాకూడదు.

ప్రస్తుతం 70% కంటే ఎక్కువ కంపెనీలు అభ్యర్థులను ఎంపిక చేసే ముందు వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ని చెక్ చేస్తున్నాయి. మీ పోస్టులు మీ 'బాధ్యత'ను ప్రతిబింబించాలి.

Messaging & Emailing Etiquette
ఆన్‌లైన్ లో మనం కేవలం పదాల ద్వారానే కమ్యూనికేట్ చేస్తాం. అక్కడ మన బాడీ లాంగ్వేజ్ కనిపించదు, కాబట్టి పదాల ఎంపిక చాలా ముఖ్యం.

ఆఫీస్ గ్రూపుల్లో రాత్రి వేళల్లో వాట్సప్ మెసేజ్ చేయకపోవడం, అనవసరమైన ఫార్వర్డ్స్ పంపకపోవడం కనీస మర్యాద. ప్రతి చిన్న విషయానికి ఫోన్ కాల్ చేయకుండా, టెక్స్ట్ మెసేజ్ ద్వారా పర్మిషన్ అడగడం ఒక ప్రొఫెషనల్ పద్ధతి.

ఈమెయిల్స్ లో సబ్జెక్ట్ లైన్ స్పష్టంగా ఉండాలి. ఎదుటివారి సమయాన్ని గౌరవిస్తూ విషయాన్ని క్లుప్తంగా చెప్పాలి. 'Capital Letters' లో రాయడం అంటే ఆన్‌లైన్ భాషలో అరవడంతో సమానం, కాబట్టి దాన్ని నివారించండి.

మోటివేషన్ మాయ vs డిజిటల్ రియాలిటీ
మోటివేషన్ "నీ మనసులో ఉన్నది ధైర్యంగా సోషల్ మీడియాలో చెప్పు, భయపడకు" అని చెప్తుంది.

"నీ అభిప్రాయం చెప్పేటప్పుడు అది ఎవరిని నొప్పించకుండా, నీ బ్రాండ్ వాల్యూని తగ్గించకుండా ఉందో లేదో చూసుకో" అని సైకాలజీ చెప్తుంది. ఆన్‌లైన్ లో 'రియాక్ట్' అవ్వడం కంటే 'రెస్పాండ్' అవ్వడం ముఖ్యం. ఇదే సోషల్ ఇంటెలిజెన్స్.  

డిజిటల్ ప్రెజెన్స్ ని బిల్డ్ చేయండి
Genius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, మీ డిజిటల్ పర్సనాలిటీ ఇలా ఉండాలి.

Step 1: Break Digital Noise  

అపరిచితులతో ఆన్‌లైన్ వాదనలు (Online arguments), నెగటివ్ కామెంట్స్ చేయడం వంటి అలవాట్లను 'Break' చేయండి. మీ శక్తిని, సమయాన్ని వృథా చేసే డిజిటల్ పనులకు దూరంగా ఉండండి. మీ ప్రొఫైల్ లో ఉన్న నెగటివిటీని క్లీన్ చేయండి.

Step 2: Build Value Addition

మీరు ఒక విషయాన్ని పోస్ట్ చేస్తున్నారంటే, అది చదివేవారికి ఏదో ఒక రకమైన 'విలువ'ను ఇవ్వాలి. అది ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇన్‌స్పిరేషన్ కావచ్చు. మీరు ఏ రంగంలో నిపుణులో ఆ రంగానికి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ మీ 'అథారిటీ'ని 'Build' చేయండి.

Step 3: Digital Leadership

ఆన్‌లైన్ లో కూడా ఒక నాయకుడిలా ప్రవర్తించండి. ఇతరుల విజయాలను మెచ్చుకోండి, ఎవరైనా తప్పు చేస్తే పబ్లిక్ గా కాకుండా ప్రైవేట్ గా చెప్పండి. మీ డిజిటల్ ప్రెజెన్స్ చూసి నలుగురు స్ఫూర్తి పొందాలి. ఇదే 'Beyond' స్టేజ్.

డిజిటల్ ఇమేజ్ ఎలా ఉంది?

ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.

మీ పేరును గూగుల్ లో సెర్చ్ చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి? అది మీకు నచ్చుతుందా?

మీ సోషల్ మీడియా ఫీడ్ చూస్తే మీ గురించి ఒక కొత్త వ్యక్తికి ఏమనిపిస్తుంది?

ఆన్‌లైన్ లో మీరు ఇచ్చే కామెంట్స్ మీ సంస్కారాన్ని ప్రతిబింబిస్తున్నాయా?

మీ స్క్రీనే మీ అద్దం!
బ్రో, ఆన్‌లైన్ లో మీరు చేసే ప్రతి క్లిక్ మీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తోంది. డిజిటల్ మర్యాద అనేది ఒక స్కిల్ మాత్రమే కాదు, అది మీపై మీకు ఉన్న గౌరవం. అక్కడ మీరు ఎంత హుందాగా ఉంటే, నిజ జీవితంలో మీకు అంతటి గుర్తింపు లభిస్తుంది.

"Be the same person online as you are offline—respectful and authentic."

సైకాలజిస్ట్ విశేష్ 
Genius Matrix Hub 
8019 000066
www.psyvisesh.com

(చదవండి: The Professional Mask: ఆఫీసులో మీ వ్యక్తిత్వం ఎలా ఉండాలి?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement