మనుషులతో ఎలా కనెక్ట్ అవ్వాలి? | Health Tips: Building a Network Without Feeling Fake | Sakshi
Sakshi News home page

Networking without Fake Smiles: మనుషులతో ఎలా కనెక్ట్ అవ్వాలి?

Mar 31 2026 7:10 AM | Updated on Mar 31 2026 5:00 PM

Health Tips: Building a Network Without Feeling Fake

చాలామందికి నెట్‌వర్కింగ్ అంటేనే ఒక రకమైన విరక్తి. ఎందుకంటే అందులో కృత్రిమమైన నవ్వులు (Fake Smiles), అవసరం కోసం చేసే పొగడ్తలు ఉంటాయని భయపడతారు. కానీ, నిజమైన నెట్‌వర్కింగ్ అంటే మీ ముసుగును తీసివేసి, మీ సహజత్వంతో (Authenticity) ఎదుటివారిని ఆకట్టుకోవడం.

మనుషులు 'ఫేక్'ని కనిపెట్టడంలో చాలా దిట్ట. మీరు పళ్ళు ఇరవదీసి నవ్వినా, లోపల ఏదో ఆశిస్తున్నారని వారికి అర్థమైపోతుంది. నెట్‌వర్కింగ్ అనేది ఒక 'బిజినెస్ డీల్' కాదు, అది ఒక 'హ్యూమన్ కనెక్షన్'. మీరు మీలా ఉంటూనే ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేయవచ్చో చూద్దాం.
'
The Power of Being Real…
సైకాలజీలో 'Pratfall Effect' అనే కాన్సెప్ట్ ఉంది. దీని ప్రకారం, మనుషులు పర్ఫెక్ట్‌గా ఉండేవారి కంటే, చిన్న చిన్న లోపాలు ఉండి సహజంగా ఉండేవారిని ఎక్కువగా ఇష్టపడతారు.

అందువల్ల మీరు అంతా తెలిసినట్టు నటించనవసరం లేదు. "నాకు ఈ విషయం తెలియదు, మీరు వివరిస్తారా?" అని అడగడం కూడా ఒక అద్భుతమైన కనెక్టింగ్ టూల్. ఇది ఎదుటివారికి 'వాల్యూ' ఇస్తుంది.

Curiosity Over Presentation
నెట్‌వర్కింగ్ ఈవెంట్లలో చాలామంది "నేను నా గురించి ఏం చెప్పాలి?" అని టెన్షన్ పడతారు. కానీ అసలైన టెక్నిక్ ఏంటంటే, మీ గురించి చెప్పడం తగ్గించి, ఎదుటివారి గురించి అడగడం పెంచండి.

ఒక వ్యక్తిని కలిసినప్పుడు "మీరు ఏం చేస్తారు?" అనే రొటీన్ ప్రశ్న కంటే, "ప్రస్తుతం మీరు ఏ ప్రాజెక్ట్ గురించి ఎక్సైటెడ్ గా ఉన్నారు?" లేదా "మీ ప్రయాణం ఎలా మొదలైంది?" అని అడగండి.

మీరు వారిపై చూపే 'నిజమైన ఆసక్తి' (Genuine Interest) వెయ్యి నవ్వుల కంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది.

మోటివేషన్ మాయ vs సహజ సిద్ధాంతం
"అందరితో కలవాలి, అందరికీ కార్డులు ఇవ్వాలి, అందరినీ ఇంప్రెస్ చేయాలి" అని మోటివేషన్ స్పీకర్లు చెప్తారు. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇది మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది.

"వందమందిని కలవనక్కర్లేదు. ముగ్గురిని కలిసినా, వారితో లోతైన కనెక్షన్ ఏర్పరచుకో" అని సైకాలజీ చెప్తుంది. క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.

సహజమైన కనెక్షన్ బిల్డింగ్
Genius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, ముసుగులు లేని నెట్‌వర్కింగ్ ఇలా ఉంటుంది.

Step 1: ఇంప్రెస్ చేయాలనే తపన తగ్గించుకోండి
ఎదుటివారిని మెప్పించాలి లేదా వారిని బురిడీ కొట్టించాలి అనే ఆలోచనను 'Break' చేయండి. మీరు ఎవరికైనా ఏదైనా 'అమ్మడానికి' వెళ్లడం లేదు, ఒక 'సంబంధాన్ని' నిర్మించడానికి వెళ్తున్నారు. ఆ ఒత్తిడి పోతే మీ ముఖంలో సహజమైన ప్రశాంతత వస్తుంది.

Step 2: Build Common Ground
మీకు, అవతలి వ్యక్తికి మధ్య ఉన్న పోలికలను వెతకండి. అది ఒక హాబీ కావచ్చు, ఒక ఊరు కావచ్చు, లేదా ఒకే రకమైన సమస్య కావచ్చు. మనుషులు తమలాంటి వారితో కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడతారు. దీనికి నకిలీ నవ్వులు అవసరం లేదు, కేవలం Observation ఉంటే చాలు.

Step 3: Beyond (నిస్వార్థ సహాయం - Selfless Value)
కనెక్షన్ ఏర్పడిన తర్వాత, "నేను వారికి ఎలా సహాయపడగలను?" అని ఆలోచించండి. వారికి ఒక మంచి కాంటాక్ట్ ఇవ్వడం లేదా ఒక ఉపయోగపడే సమాచారాన్ని షేర్ చేయడం చేయండి. మీరు ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేసినప్పుడు, ఆ కనెక్షన్ జీవితకాలం నిలుస్తుంది. ఇదే 'Beyond' స్టేజ్.

మీ కనెక్షన్స్ ఎంత నిజం?
ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.
1.    మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వారిలో, ఎంతమందితో మీరు కేవలం అవసరం లేకుండా పలకరిస్తారు?
2.    మీరు కొత్తవారిని కలిసినప్పుడు మీ గురించి గొప్పలు చెప్పుకుంటున్నారా లేక వారి గురించి వింటున్నారా?
3.    మీరు మాట్లాడేటప్పుడు మీ నవ్వు మనస్ఫూర్తిగా వస్తోందా లేక అది ఒక 'డ్యూటీ' లా అనిపిస్తోందా?

సహజత్వమే మీ అసలైన బ్రాండ్!
బ్రో, ప్రపంచం నకిలీలతో నిండిపోయింది. అక్కడ మీరు మీలా 'ఒరిజినల్' గా ఉండటమే అతిపెద్ద ఆకర్షణ. ఫేక్ స్మైల్స్ అవసరం లేదు, మీ కళ్ళలో నిజాయితీ ఉంటే చాలు. మనుషులు మీ తెలివితేటల కంటే మీ వైబ్ తోనే ఎక్కువగా కనెక్ట్ అవుతారు.

"Be yourself; everyone else is already taken." 
-    Oscar Wild

 

 

సైకాలజిస్ట్ విశేష్ 
Genius Matrix Hub 
8019 000066
www.psyvisesh.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement