ప్రపంచం మెచ్చిన  బ్రేక్‌ఫాస్ట్‌! | Kellogg Brothers Taught America to Eat Breakfast | Sakshi
Sakshi News home page

ప్రపంచం మెచ్చిన  బ్రేక్‌ఫాస్ట్‌!

May 17 2026 6:26 AM | Updated on May 17 2026 6:26 AM

Kellogg Brothers Taught America to Eat Breakfast

చిన్నారులూ! ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తినే కార్న్‌ఫ్లేక్స్‌ అంటే మీకు ఎంతో ఇష్టం కదూ.. రుచిగా, కరకరలాడుతూ ఉండే వీటి తయారీ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది తెలుసా.. ఇది చదివేయండి. మీకే తెలుస్తుంది. ఆ కథేంటో...

చాలా కాలం క్రితం అంటే సుమారు 130 సంవత్సరాల క్రితం, అమెరికాలో జాన్‌ కెల్లాగ్, విల్‌ కెల్లాగ్‌  అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారిద్దరూ ఒక హాస్పిటల్‌లో పనిచేస్తూ, అక్కడి రోగుల కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తయారు చేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుండేవారు. అలా ఒకరోజు వారు రోగుల కోసం గోధుమలతో ఒక వంటకం చేయాలనుకున్నారు. అందుకోసం గోధుమలను ఉడకబెట్టారు. కానీ, వేరే ఏదో పనిలో పడి ఆ ఉడకబెట్టిన గోధుమలను అలాగే వదిలేసి మర్చిపోయారు. 

మరుసటి రోజు వచ్చి చూసేసరికి, ఆ గోధుమలు కాస్తా ఎండిపోయి, గట్టిగా మారిపోయాయి. అలా ఎండిపోయిన వాటిని వృథా చేయడం ఇష్టం లేక.. రోలర్‌ మిషన్‌ల ద్వారా నొక్కిచూశారు. అప్పుడు అవి ఫ్లేక్స్‌లా విడిపోయాయి. వాటిని కాస్త వేడి చేయగా, అవి చాలా క్రిస్పీగా మారాయి. అలా తయారైన వాటిని హాస్పిటల్‌లోని రోగులకు ఇస్తే, వారు చాలా ఇష్టంగా తిన్నారు. ఆ తర్వాత, తమ్ముడు విల్‌ కెల్లాగ్‌కు గోధుమలకు బదులుగా అదేవిధంగా మొక్కజొన్నలతో తయారు చేయాలనే ఒక ఆలోచన వచ్చింది. అలా చేసినప్పుడు అవి మరింత రుచిగా, కరకరలాడుతూ వచ్చాయి. అలా తయారైనవే ఈరోజు మనం ఎంతో ఇష్టంగా తినే కార్న్‌ ఫ్లేక్స్‌.
 

Advertisement
 
Advertisement
Advertisement