ఐస్‌క్రీం షాపే పెళ్లి వేదికగా..ఒక్కటైన జంట! | Couple Decided To Marry At Their Favourite Ice Cream Shop | Sakshi
Sakshi News home page

ఐస్‌క్రీం షాపే పెళ్లి వేదికగా..ఒక్కటైన జంట!

May 10 2026 4:01 PM | Updated on May 10 2026 5:08 PM

Couple Decided To Marry At Their Favourite Ice Cream Shop

ఇటీవల కాలంలో లగ్జరీ కళ్యాణ మండపాలు, పెద్ద పెద్ద హోటళ్లు, రిసార్ట్‌, పచ్చని పొలాలు వంటి అనే ఎన్నో కొంగొత్త ట్రెండీ వెడ్డింగ్‌ ఫంక్షన్‌ హాల్‌లు ప్రత్యక్షమవుతున్నాయి. అంతెందుకు కొందరు రాయల్‌ తరహాలో ప్రఖ్యాత రాజుల కోటల్లో పెళ్లిచేసుకోవడం కూడా చూశాం. కానీ ఈ జంట ఆవేమి కాదని ఐస్‌క్రీం షాప్‌లో పెళ్లి చేసుకున్నారు. ఎందుకిలా చేసుకున్నారో, దాని వెనుకున్న ఆసక్తికర కథేంటో చూద్దామా..!.

పోర్ట్‌ల్యాండ్‌కి చెందిన స్పోర్ట్‌ మెడిసిన్‌ డాక్టర్‌ మిషెల్‌ చిన్నప్పటి నుంచి తన స్నేహితులతో కలిసి ఆ దుకాణానికి వెళ్లేది. మహమ్మారి సమయంలో ఇండియానా యూనివర్సిటీలో రెసిడెన్సీ చేస్తున్నప్పుడు తరుచుగా అక్కడకే వచ్చి ఐస్‌క్రీమ్‌ ఆస్వాదించేది. అలాగే ఈ పోర్టుల్యాండ్‌కు తిరిగి రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఈ ఐస్‌క్రీం షా కూడా అని చెప్పుకొచ్చింది. 

నిజానికి అలెక్స్‌తో ఫస్ట​ డేట్‌కి వెళ్లిందట మిషెల్‌. అయితే తాను న్యూయార్క్‌ వెళ్లిపోతాననే ఉద్దేశ్యంతో లైట్‌ తీసుకుందట. విధి మరోలా స్క్రిప్ట్‌ రాయడంతో మళ్లీ తిరిగి పోర్ట్‌ల్యాండడే వచ్చింది మిషెల్‌. ఎందుకుంటే అక్కడే ఉద్యోగం రావడంతో రాక తప్పలేదు. అలా జనవరి 2024న మంచు తుఫాను సమయంలో ఇద్దరు అనుకోకుండా ఇదే ఐస్‌క్రీం షాపుకి ఇరువురు రావడం కలుసుకోవడం జరిగిందట. 

తొలిసారి కలిసినప్పుడు అర్బెక్వినా ఆలివ్ ఆయిల్‌ ఐస్‌క్రీమ్‌ టేస్ట్‌ చేశారట. ఆ తర్వాత అలెక్స్‌ ఆ ఐస్‌క్రీం షాపులోనే ప్రపోజ్‌ చేశాడట. అలాగే సదరు ఐస్‌క్రీ షాపు ఓ ప్రత్యేకమైన రోజున పలు జంటలను ఈ షాపుతో ఉన్న అనుబంధాన్ని షేర్‌ చేసుకోమంటే మిషెల్‌, అలెక్స్‌లు తమ లవ్‌స్టోరీ కథను పంచుకున్నారట. 

దాంతో సదరు ఐస్‌క్రీం షాపు ఓనర్‌ తామే వివాహం ఘనంగా జరిపిస్తామని ఓ డేట్‌ ఫిక్స్‌ చేసుకోమని చెప్పడంతో తమ ఆనందానికి అవధుల లేకుండా పోయిందని చెప్పుకొచ్చాడు అలెక్స్‌. అలా ఆ జంట ప్రసిద్ధ స్థానిక సాల్ట్ & స్ట్రా అనే ఐస్‌క్రీం షాపులో అత్యంత వైభవోపేతంగా పెళ్లి చేసుకున్నారు. అంతేగాదండోయ్‌ వధువరుల చేతిలోని పూలబోకేలు సైతం అచ్చం ఐస్‌క్రీం కోన్‌ మాదిరిగా డిజైన్‌ చేయడం విశేషం.

 

(చదవండి: అన్యోన్య దాంపత్యం అంటే ఇదే కదా..! బాధను సైతం..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement