భారతదేశంలో నదులు అంటే ముందు గంగా, గోదావరి, కృష్ణా, బ్రహ్మపుత్ర లాంటి మహానదుల పేర్లే గుర్తొస్తాయి. కానీ మన దేశంలో ఉన్న అత్యంత చిన్న నది ఏంటో తెలుసా? ఈ ప్రశ్నకు చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. భౌగోళిక నిపుణులు, ట్రావెల్ గైడ్స్, కొన్ని జియోగ్రఫీ రిఫరెన్సుల ప్రకారం ఈ అత్యంత చిన్న నదుల్లో ఒకటిగా ఎక్కువగా వినిపించే పేరు ఆర్వారీ నది.
ఆర్వారీ నది ఎక్కడుంది?
రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లాలో ప్రవహించే ఈ నది సుమారు 45 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుందని చెబుతారు. చివరకు ఇది సాహిబీ నదీ వ్యవస్థలో కలుస్తుంది. చిన్నదైనా ఈ నది పేరు మాత్రం జియోగ్రఫీ డిస్కషన్స్‌లో చాలాసార్లు వినిపిస్తుంది.అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇండియాలో ‘అఫీషియల్ షార్టెస్ట్ రివర్’ అంటూ ఫిక్స్‌డ్ నేషనల్ రికార్డు ఏమీ లేదు. కొందరు ఇంకొన్ని చిన్న నదుల పేర్లు కూడా ప్రస్తావిస్తారు. కానీ ఆర్వారీ నదిని ఈ జాబితాలో ముందుగా చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ నదికి స్పష్టమైన సోర్స్ టు ఎండ్ అంటే నది చివర అంతం.
మాయం అయిన నది.. మళ్లీ ప్రవహించిన కథ
ఒకప్పుడు ఈ నది పూర్తిగా ఎండిపోయి దాదాపు మాయం అయిందట. నేల చిట్లిపోయి, నీటి జాడ కూడా కనిపించని పరిస్థితి వచ్చిందని చెబుతారు. కానీ అక్కడి స్థానిక గ్రామస్థులు, నదీ సంరక్షణ సంఘాలు, ప్రకృతి ప్రేమికులు కలిసి నీటి సంరక్షణ చర్యలు చేపట్టారు. చెక్‌డ్యామ్‌లు, సంప్రదాయ వాటర్ హార్వెస్టింగ్ పద్ధతులతో ఈ నదికి మళ్లీ ప్రాణం పోశారు. అందుకే పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడినప్పుడు ఆర్వారీ నది పునరుజ్జీవన కథను చాలా మంది ఉదాహరణగా చెబుతుంటారు.
నిజానికి మన దేశంలో కేవలం వర్షాకాలంలోనే ప్రవహించే చిన్న వాగులు చాలా ఉంటాయి. కానీ వాటిని అధికారికంగా నదులుగా పరిగణించరు. ఆర్వారీ మాత్రం చిన్న నది అయినా, దాని వెనక ఉన్న మానవ ప్రయత్నం మాత్రం చాలా పెద్దది. ఈ చిన్న నది మనకు చెప్పే విషయం ఒక్కటే ప్రకృతిని మనం కంటికి రెప్పలా కాపాడుకుంటే ప్రకృతి కూడా మనల్ని అంతే ప్రేమగా కాపాడుకుంటుంది.
(చదవండి: ఎలక్ట్రిక్ యూనిసైకిల్ రైడ్‌కి ట్రాఫిక్ పోలీసులే ఫిదా! చివరికి..)


