నిద్ర నా ప్రాణం | Kayadu Lohar shares her Life journey | Sakshi
Sakshi News home page

నిద్ర నా ప్రాణం

May 17 2026 12:31 AM | Updated on May 17 2026 12:31 AM

Kayadu Lohar shares her Life journey

చూడగానే, ‘వావ్‌’ అనిపించే అందం, మాట్లాడగానే, ‘హా.. హా..’ అని నవ్వించే అల్లరి నటి కయాదు లోహార్‌ సొంతం. ఇలా ఒక్కో క్యారెక్టర్, ఒక్కో స్టయిల్‌తో ఎప్పుడూ ఫుల్‌ ఎనర్జీ అండ్‌ ఫుల్‌ ఫన్‌ ప్యాకేజీలా మెరిసే కయాదు అల్లరి కోణాన్ని, ఫన్నీ జ్ఞాపకాలను ఆమె మాటల్లోనే విందాం..

నా పేరు కష్టాలు
నా పేరు ’కయాదు’ అని పిలవడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. షూటింగ్‌ సెట్‌లో కొందరైతే నన్ను ‘కాయ్‌–దూ’, ‘క్యా–దూ’ అని పిలిచేవారు. ఒకసారి ఒకరైతే పొరపాటున ‘కావాలా?’ అని పిలిచారు! నేను వెంటనే ‘ఏం కావాలి?’ అని అడిగాను. ఇప్పుడు అందరికీ నా పేరు నోరు తిరుగుతోంది, అందుకు సంతోషం!

గొడవ పడకుండా ఉండలేను
నేను పుణెలోని ఒక మధ్యతరగతి వ్యాపార కుటుంబం నుంచి వచ్చాను. నాన్న బిజినెస్‌ చేస్తారు, అమ్మ గృహిణి. నాకు సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోయినా, ‘నీకు నచ్చిన రంగంలో నిరూపించుకో’ అని నాన్న ఇచ్చిన ప్రోత్సాహమే నన్ను ఈ స్థాయికి తెచ్చింది. ఇక మా తమ్ముడు నా అతిపెద్ద విమర్శకుడు, వాడితో గొడవ పడకుండా నాకు రోజే గడవదు.

తెలుగు డైలాగ్స్‌.. ఒక పెద్ద సాహసం!
కన్నడ సినిమా ‘ముగిల్‌ పేటె’తో మొదలై, తెలుగులో ‘అల్లూరి’ సినిమాతో మీ ముందుకు వచ్చాను. మొదట్లో తెలుగు నేర్చుకోవడం కష్టంగా ఉండేది. ఒకసారి సీరియస్‌ సీన్ లో కన్‌ఫ్యూజ్‌ అయి ‘దోశ కావాలా?’ అన్నట్టు ఏదో అనేశాను. సెట్‌లో అందరూ పడి పడి నవ్వారు. అప్పటి నుండి నేను డైలాగ్‌ పేపర్‌ కనిపిస్తే చాలు. ఎగ్జామ్‌కి ప్రిపేర్‌ అయ్యే స్టూడెంట్‌లా భయపడిపోతుంటాను!

నా నిద్ర.. నా సామ్రాజ్యం!
నాకు నిద్ర అంటే ప్రాణం. ఎవరైనా నన్ను నిద్రలో ఉన్నప్పుడు లేపితే, నాకు విపరీతమైన కోపం వస్తుంది. అందుకే సెట్‌లో అందరూ నన్ను నిద్రలేపేటప్పుడు చాలా జాగ్రత్తగా, భయం భయంగా ఉంటారు.

డైట్‌ అంతా భోజనం ముందు వరకే!
నేను డైట్‌ చేస్తాను.. కానీ అది కేవలం భోజనం వడ్డించే వరకే! ముఖ్యంగా పప్పు నెయ్యి కాంబినేషన్‌ చూస్తే ఆగలేను. ఒక్కోసారి నా ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ చూసి ‘కయాదు.. రేపు జిమ్‌లో నీకు చుక్కలే’ అని మెసేజ్‌ పెడుతుంటారు!

పుష్ప స్టెప్పులకి పడిపోయాను
అల్లు అర్జున్‌ గారి డ్యాన్స్  చూస్తుంటే నా కాళ్లు కూడా తెలియకుండానే స్టెప్పులు వేస్తుంటాయి. కానీ ఆయన పక్కన డ్యాన్స్  చేయాల్సి వస్తే.. నేను బహుశా టెన్షన్ తో స్టేజ్‌ మీద పడిపోతానేమో! నిజం చెప్పాలంటే, ‘పుష్ప’ స్టెప్పులు ట్రై చేస్తూ ఇంట్లో రెండు మూడుసార్లు కింద పడ్డాను కూడా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement