స్కూలు బస్సుకి పసుపు రంగే ఎందుకు? | Yellow school buses are highly visible, detect faster than other colors | Sakshi
Sakshi News home page

school bus: పసుపు రంగే ఎందుకు?

May 18 2026 6:08 AM | Updated on May 18 2026 7:39 PM

Yellow school buses are highly visible, detect faster than other colors

ఫ్రెండ్స్‌.. మనం రోజూ స్కూలుకి వెళ్లే బస్సు పసుపు రంగులోనే ఉంటుంది. ఎందుకలా ఉంటుందో మీరెపుడైనా ఆలోచించారా? ఎందుకంటారు? ఎందుకంటే పసుపు రంగు ఎంత దూరం నుంచైనా ఆకర్షిస్తుంది. దానివల్ల ప్రమాదాలు జరుగకుండా ఉంటాయి.

టాక్సీలు, స్కులు బస్సులకు, రసాయనాలను సూచించే ఫలకాలకు ఈ రంగును వాడుతుంటారు. ప్రమాదాన్ని సూచించే సందర్భాలకి ఎరుపు రంగుని వాడితే, జాగ్రత్త పాటించాల్సిన సూచనల కోసం పసుపుని వాడుతారన్నమాట. అలాగే ట్రాఫిక్‌ సిగ్నల్‌లో ఈ రంగు లైట్‌ వెలిగితే.. నెమ్మదిగా వెళ్లాలని అర్థం. 

ఔనా?
హార్న్‌బిల్‌ అనే పక్షి తన పిల్లల్ని ఎవరూ చూడకుండా, తాకకుండా వుండాలని వాటి నివాసం కోసం చాలా సురక్షితమైన ప్రదేశం ఏర్పాటు చేస్తుంది. ఏదైనా ఒక చెట్టుతొర్రలో వుంచి, ఆ తొర్రను వుట్టి లేదా బెరడుతో కప్పేస్తుంది. అయితే గాలి, వెలుతురు కోసం చిన్న రంధ్రం ఒకటి వుంచుతుంది. పిల్లలకు ఆ రంధ్రంలోంచి వుుక్కుతో ఆహారాన్ని అందిస్తుంది. అలా పిల్లలు పెద్దవయ్యేదాకా ఆ తల్లికి ఈ కష్టం తప్పదు వురి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement