దీర్ఘాయుర్దాయ దేశాలు | Indias life expectancy dropped to 61 years | Sakshi
Sakshi News home page

దీర్ఘాయుర్దాయ దేశాలు

May 17 2026 12:25 AM | Updated on May 17 2026 12:25 AM

Indias life expectancy dropped to 61 years

ఆధునిక జీవితంలో ఆరోగ్యమే ఐశ్వర్యం. ఆరోగ్యం బాగుంటేనే దీర్ఘాయుర్దాయం ఉంటుంది. వార్ధక్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవే అయినా, కొన్ని దేశాల్లో మాత్రం ఏడుపదుల వయసు దాటే వరకు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతున్నారు. ఆ వయసు తర్వాత చిన్నా చితకా సమస్యలు ఉన్నా, దీర్ఘాయుష్కులుగా మనుగడ సాగించగలుగుతున్నారు.

ఆరోగ్యకరమైన జీవనశైలి, తగిన వ్యాయామం, మెరుగైన వైద్య సౌకర్యాల కారణంగా ఆయుర్దాయంలోను, ఆరోగ్యకరమైన జీవన ప్రమాణంలోను (హెల్తీ లైఫ్‌ ఎక్స్‌పెక్టన్సీ) ముందంజలో ఉంటున్న దేశాల గురించి గణాంకాల్లో తెలుసుకుందాం.

భారతదేశంలో ఆరోగ్యకరమైన జీవనప్రమాణం సగటున 61 ఏళ్ల వరకు ఉంటోంది. సగటు ఆయుర్దాయం 70 ఏళ్ల వరకు ఉంటోంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే, ఇది చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. మన దేశంలో నగరాలలో ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు ఇప్పటికీ లేవు. అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం వంటి కారణాలు ఆయుర్దాయాన్ని హరించేస్తున్నాయి.

కరవు కాటకాలు, ఆధునిక వైద్య సౌకర్యాల లోటు, తరచు ఘర్షణలు వంటి కారణాల వల్ల ఆఫ్రికన్‌ దేశాలలో ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలు, సగటు ఆయుర్దాయం ఇప్పటికీ తక్కువగానే ఉంటున్నాయి.

వైద్య ఆరోగ్య రంగాల్లో ప్రపంచం ముందంజ వేస్తున్నా, ఇప్పటికీ కొన్ని దేశాలు ఆరోగ్యకరమైన జీవన ప్రమాణంలోను, ఆయుర్దాయంలోను ఇంకా వెనుకబడి ఉన్నాయి. అత్యల్పాయుర్దాయ దేశాలన్నీ ఆఫ్రికా ఖండంలోనే ఉండటం గమనార్హం. వీటి వివరాలు కూడా గణాంకాల్లో తెలుసుకుందాం...

Advertisement
 
Advertisement
Advertisement