ఆవకాయదే అగ్రస్థానం! | mango pickle aka aam ka aachar took the top slot | Sakshi
Sakshi News home page

ఆవకాయదే అగ్రస్థానం!

May 10 2026 4:55 PM | Updated on May 10 2026 4:55 PM

mango pickle aka aam ka aachar took the top slot

వేసవి అంటే ఊరగాయల సీజన్‌ కూడా! మామిడికాయలతో తయారు చేసే ఆవకాయ, నిమ్మకాయ ఊరగాయ, మిర్చి ఊరగాయ– ఇలా ఎన్ని రకాలు ఉన్నా, ఊరగాయల మార్కెట్‌లో అగ్రస్థానం మామిడి ఆవకాయకే దక్కుతుంది. మన దేశంలో తయారయ్యే ఊరగాయల్లో దాదాపు మూడోవంతు వాటా ఆవకాయదే! ఉత్పాదన ప్రకారం ఊరగాయల వివరాలు గణాంకాల్లో చూద్దాం...

దేశవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న రకరకాల ఊరగాయల ఉత్పాదనలో దాదాపు 70% కుటీర పరిశ్రమల్లా ఇళ్ల వద్ద తయారు చేసిన ఊరగాయలే ఉంటాయి. ఊరగాయల మార్కెట్‌లో బ్రాండెడ్‌ ఉత్పత్తుల వాటా సుమారు 30% మాత్రమే! ఊరగాయల ఉత్పాదనలో రాష్ట్రాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నాయి. రాష్ట్రాల వారీగా ఊరగాయల ఉత్పాదనలో మొదటి పది స్థానాల్లో ఉన్న రాష్ట్రాల వివరాలు ఇవీ:

చేపలు, రొయ్యలు, చికెన్, మటన్‌ ఊరగాయల ఉత్పత్తి కేరళలలోను, ఈశాన్య రాష్ట్రాల్లోను అత్యధికంగా ఉంటోంది. ఈశాన్య రాష్ట్రాల్లోను, తూర్పు రాష్ట్రాల్లోను వెదురు మొలకలు, తామరతూళ్ల ఊరగాయలు, కశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో యాపిల్‌ ఊరగాయ వంటివి ప్రత్యేకంగా తయారు చేస్తారు. 

(చదవండి: కడుపు ఉబ్బరం దేనికి సంకేతమో తెలుసా..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement