కడుపు ఉబ్బరం దేనికి సంకేతమో తెలుసా..! | Experts Said Most people treat bloating as a digestive inconvenience | Sakshi
Sakshi News home page

కడుపు ఉబ్బరం దేనికి సంకేతమో తెలుసా..!

May 10 2026 4:37 PM | Updated on May 10 2026 4:37 PM

Experts Said Most people treat bloating as a digestive inconvenience

చాలామంది కొన్ని రకాల ఆహారాలు తిన్న వెంటనే కడుపు ఉబ్బరంతో ఇబ్బంది పడుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో, దేనికి సంకేతమో ఆలోచించారా అని ప్ర‍శ్నిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటే సులభంగా ఈ సమస్యను అధిగమించొచ్చని చెబుతున్నారు. మరి అదెలాగో ఆయన మాటల్లోనే చూద్దామా..!.

ఆహారం సరిగ్గా విచ్ఛిన్నం కాకుండా ప్రేగులలోని బ్యాక్టీరియా దానిని పులియబెట్టినప్పుడు కడుపు ఉబ్బరం వస్తుంది. ఈ బ్యాక్టీరియా చర్య వలనే గ్యాస్ ఏర్పడుతుంది. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగేది కాదు. మనం ఏం తీసుకున్నాం, అది ఎంత భాగా జీర్ణమైంది అన్న దానిపైనే ఇదంతా ఆధారపడి ఉంటుందని కూడా నొక్కి చెప్పారు. ఉదాహరణకు బీన్స్ తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటే, పప్పుధాన్యాలలో ఉండే సంక్లిష్ట చక్కెరలను విచ్ఛిన్నం చేయడానికి మీ శరీరంలో తగినంత ఆల్ఫా-గాలక్టోసిడేస్ ఎంజైమ్ లేదని అర్థం. 

అదే పాల ఉత్పత్తులు తిన్న తర్వాత ఇలా ఉంటే..లాక్టేస్ ఉత్పత్తి చాలా తక్కువగా ఉందని అర్థం. అలా కాకుండా గోధుమలు తిన్న తర్వాత ఐతే గ్లూటెన్ జీర్ణక్రియకు ఆటంకం కలిగించేంతగా చిన్నప్రేగుల్లో వాపు ఉందని అర్థం. ఇలా ఆయా ఆహారాలు తిన్న వెంటనే ఈ సమస్య ఉత్పన్నమవుతుందంటే..శరీరంలో ప్రోటీన్‌ను సరిగ్గా విచ్ఛిన్నం చేయడానికి కడుపులోని ఆమ్లం చాలా తక్కువగా ఉందని అర్థం. 

ఇలాంటి సమస్య ఉన్నవాళ్లు అల్లం తీసుకుంటే అది జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రోత్సహించి, కడుపు త్వరగా ఖాళీ అవ్వడానికి సహాయపడుతుందన్నారు. భోజనానికి ముందు తీసుకునే ఆపిల్ సైడర్ వెనిగర్, కడుపులో తగినంత ఆమ్ల ఉత్పత్తి లేని వారిలో ఆమ్ల స్థాయిలకు మద్దతు ఇస్తుందని చెప్పారు. పప్పుధాన్యాలను బాగా నానబెట్టి, ఉడికించడం వల్ల, శరీరంలోకి ప్రవేశించక ముందే పులియబెట్టడానికి కారణమయ్యే సంక్లిష్ట చక్కెరలు తగ్గుతాయని అంటున్నారు

అంతేగాదు కడుపు ఉబ్బరం అనేది ఒక సందేశం, ఒక అనారోగ్య పరిస్థితి కాదు. దానిని సరిగ్గా గ్రహిస్తే, జీర్ణక్రియలో సరిగ్గా ఏమి లోపిస్తుందో అది మీకు తెలియజేస్తుంది.

డా. ఆదర్శ గౌడ
ప్రధాన కార్యనిర్వహణాధికారి (సీఈఓ)
అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతి ఆయోగ్)
ఐసిఎఆర్–జాతీయ పాడి పరిశోధనా సంస్థ, బెంగళూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement