ఎవరీ లారెన్‌ వాసర్‌..? ఆ వ్యాధే ఆమెను సన్సేషన్‌గా మార్చింది.. | Lauren Wasser Stuns At Met Gala 2026 In Gold Prosthetics, The Inspiring Story Behind The Golden Leg Model, Read Full Story | Sakshi
Sakshi News home page

ఎవరీ లారెన్‌ వాసర్‌..? ఆ వ్యాధే ఆమెను సన్సేషన్‌గా మార్చింది..

May 13 2026 12:06 PM | Updated on May 13 2026 12:55 PM

Lauren Wasser: The Girl with Golden Legs Goes Viral

మెట్‌గాలా 2026లో ఎందరో ట్రెండ్‌ సెట్టింగ్‌, రికార్డ్‌ మేకింగ్‌ లుక్స్‌ని అందించారు. చాలామంది వివిధ రకాల ఫ్యాషన్‌ వేర్‌లతో సందడి చేశారు. ఎందరో సెలబ్రిటీలు, ప్రముఖులు ధరించిన యాక్సెసరీలు, కళాత్మక డిజైనర్‌ వేర్‌లు చర్చనీయాంశంగా మారాయి. వారిలో ఒక మహిళ మాత్రం అందర్నీ ఆకర్షించేలా సన్సేషన్‌గా మారింది. ఈ అమ్మాయి లుక్‌ని చూడగానే టాలీవుడ్‌ మూవీ మురారీలోని "బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో" అనే పాట ఠక్కున గుర్తుస్తోంది. అయితే ఆమె కథ తెలిస్తే మాత్ర కన్నీళ్లు జలజల వచ్చేస్తాయ్‌. ఆ బాధను దిగమింగి అజేయంగా నిలబడి ఎదగాలన్న ఆమె తపన చూస్తే స్థైర్యం అంటే ఇది కదా అనిపిస్తుంది. చిన్నచిన్న సమస్యలకే సతమతమై ప్రాణాలకు తీసుకునే యవతకు ఆమె కథ ఓ స్ఫూర్తి.

ఆ ధీర మహిళే అమెరికన్‌ మోడల్‌ లారెన్‌ వాసర్‌. ఆమె మే4న న్యూయార్క్‌ నగరంలోని మెట్‌ గాలా మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌లో బంగారు రంగు ప్రబల్ గురుంగ్ సూట్ ధరించి వచ్చింది. ఇందులో పెద్ద సన్సేషన్‌ ఏముంది అనుకోకండి. ఆమె ఈ వేడుకలో నిజమైన బంగారు కృత్రిమ కాళ్లతో వచ్చింది. అందరు ఈ వేడుకలో ఆర్టిఫిషయల్‌ యాక్సెసరీలతో రెడ్‌కార్పెట్‌పైకి రాగా ఆమె మాత్రం నిజమైన "బంగారు కాళ్ల"తో వచ్చి అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. పైగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి కూడా. అంతేగాదు దీని కారణంగానే లారెన్‌కు "బంగారు కాళ్ల అమ్మాయి" ముద్దు పేరు కూడా వచ్చింది.

లారెన్ వాసర్ ఎవరు?
లారెన్‌ వాసర్‌ అమెరికాలో ప్రసిద్ధిగాంచిన మోడల్‌. 38 ఏళ్ల లారెన్‌ వోగ్‌, గ్లామర్‌ అండ్‌ హార్పర్‌ బజార్‌ వంటి ఫ్యాషన్‌ పత్రికల ముఖచిత్రంగా ఫోజులిచ్చింది కూడా. అంతేగాదు 2017లో ఫోర్బ్స్‌ అండర్‌ 30 పురస్కార గ్రహీతగా కూడా ఎంపికైంది అలాగే 2023లో గ్లామర్ జర్మనీ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా నిలిచారామె. 2023లో 'ది డైరీ ఆఫ్ ఎ సీఈఓ' పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ..లారెన్‌ తన కథను పంచుకోవడంతో ఆమె గురించి ప్రపంచానికి తెలిసింది. 

సడెన్‌గా ఒక రోజు నిద్రలోనే కోమాలోకి వెళ్లి మృత్యువు అంచులదాక వెళ్లింది. సకాలంలో ఆమె కుటుంబ సభ్యులు చూడకపోతే లారెన్‌ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయుండేవి. ఏం జరిగిందో తెలియదు. లారెన్‌ గదిలోకి వచ్చేప్పటికీ అపస్మారక స్థితలో బెడ్‌పై పడి ఉంది. వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా...అక్కడ ఆమె బతికే అవకాశాలు చాల తక్కువని తేల్చేశారు వైద్యులు. పాదాలు నల్లగా మారిపోవడం వంటి ఆకస్మిక మార్పులన్నీ లారెన్స్‌ శరీరంలో చూస్తుండగానే చోటుచేసుకోవడం మొదలైంది. ఆమె పాదాలు నల్లగా అయిపోవడం ప్రారంభించింది. 

కానీ ఆమె తల్లిదండ్రుల తమ కూతర్ని ఏదోలా బతికించమని వైద్యులని వేడుకోవడంతో డాక్టర్లు తమ సాయశక్తులా కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ నేపథ్యంలోనే ఆమె ప్రాణం కాపాడేందుకే మొదట నీలం రంగులోకి మారిపోతున్న కుడికాలుని తొలగించారు. ఆమెకు టాక్సిక్ షాక్ సిండ్రోమ్‌(టీఎస్‌ఎస్‌)గా పిలిచే వ్యాధి బారిన పడ్డట్లు వెల్లడించారు వైద్యులు. ఇది ఒక నిర్ధిష్టమైన బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే విషపదార్థాల వల్ల కలిగే అరుదైన ప్రాణాంతక వ్యాధి. 

ఆ తర్వాత ఆమె శరీరంలోని విష పదార్థాలను తొలగించడానికి కొన్ని రకాల ద్రవాలను పంపించారు వైద్యులు. దాంతో జుట్టు రాలిపోవడం, బరువు పెరగడం వంటి సమస్యలు ఎదుర్కొంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఎడమ కాలుని కూడా తొలగించారు వైద్యులు. దాంతో సుదీర్ఘంగా ఎనిమిది నెలల పాలు వీల్‌చైర్‌కి పరిమితమైపోయిందది. జీవితం ముగిసిపోయింది ఇంకేమి లేదనుకున్న నైరాశ్యంలో ఉన్న లారెన్‌కు 14 ఏళ్ల తమ్ముడిని చూడగానే కొత్త ఆశ రేకెత్తింది. కనీసం వాడి బాగోగులు చూసుకోవడం కోసమైన బతకాలని నిర్ణయించుకుని తన సమస్యను అంగీకరించడం మొదలుపెట్టింది. అలా మోడల్‌లో నెమ్మది నెమ్మదిగా రాణిస్తూ..దివ్యాంగుల్లో స్ఫూర్తిని రగులుస్తోందామె. ఇంతకీ లారెన్‌కి సోకిన  టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే..

టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటే?
టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (టీఎస్‌ఎస్‌) అంటే టాంపోన్ వాడకంతో సంబంధం కలిగి వ్యాధి. ఇక్కడ టాంపోన్‌ అంటే టాంపోన్ (Tampon) అనేది ఋతుస్రావం సమయంలో (Periods) వెలువడే రక్తాన్ని పీల్చుకోవడానికి యోనిలోకి చొప్పించే ఒక చిన్న, పత్తి లేదా ఇతర శోషక పదార్థాలతో చేసిన స్త్రీ పరిశుభ్రత ఉత్పత్తి. ఇది ప్యాడ్‌లకు భిన్నంగా, ఇది శరీరం లోపల ఉంటుంది. సాధారణంగా నాలుగు నుంచి ఎనిమిది గంటలకు మించి ఉంచకూడదు. 

లేదంటే దీనిలో ఉండే స్టెఫిలోకాకస్ ఆరియస్ బాక్టీరియా రక్తప్రవాహంలో విషపదార్థాలను విడుదల చేసి టాక్సిక్ షాక్ సిండ్రోమ్‌ వ్యాధికి దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనికారణంగా తీవ్రమైన అవయవ నష్టం లేదా మరణానికి దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

 

ఈ సిండ్రోమ్ లక్షణాలు:

  • తక్కువ రక్తపోటు

  • తల తిరగడం, మగతగా ఉండటం లేదా స్పృహ కోల్పోవడం

  • నీళ్ల విరేచనాలు

  • అకస్మాత్తుగా అధిక జ్వరం, చలి, ఒళ్ళు నొప్పులు మరియు ఇతర ఫ్లూ వంటి లక్షణాలు
    వికారం లేదా వాంతులు

  • పాదాల అరికాళ్ళు లేదా చేతుల అరచేతులపై చర్మం పొట్టులా ఊడిపోవడం
    కళ్ళు, గొంతు ఎర్రబడటం

  • తీవ్రమైన ఎండదెబ్బలాంటి దద్దుర్లు లేదా చర్మంపై ఎర్రటి చుక్కలు

ఆ ఘటనతో రాబిన్ డేనియల్సన్ చట్టం
ఆ వ్యాధి తన జీవితాన్ని మార్చేయడంతో లారెన్‌ రాబిన్ డేనియల్సన్ అనే ఋతుస్రావ సంరక్షణ ఉత్పత్తుల భద్రతా చట్టాన్ని తీసుకొచ్చేలా పాటుపడింది. పైగా దానికి మద్దతుదారిగా మారింది. ఇది ఋతుస్రావ ఉత్పత్తులలో తరచుగా కనిపించే రసాయనాలు, సింథటిక్ ఫైబర్‌ల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలపై పరిశోధన చేయమని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH)ను ఆదేశించే లక్ష్యంతో ప్రతిపాదించబడిన ఒక US బిల్లు.

(చదవండి: అమెరికా మ్యూజియంలో భారత మహిళా శాస్త్రవేత్త చీర..! ఎవరామె?)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement