59 ఏళ్ల వయసులోనూ అంతే అందంగా మాధురి దీక్షిత్‌.. | Beauty Tips: Madhuri Dixits Secret To Glowing Skin At 59 | Sakshi
Sakshi News home page

Madhuri Dixit: మాధురి దీక్షిత్‌ బ్యూటీ సీక్రెట్‌..క్లెన్సర్, టోనర్, సన్‌స్క్రీన్ నుంచి..

May 15 2026 2:11 PM | Updated on May 15 2026 2:14 PM

Beauty Tips: Madhuri Dixits Secret To Glowing Skin At 59

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ మాధురి దీక్షిత్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో 1980-90ల్లో బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. దాదాపు 70కి పైగా చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తన డ్యాన్స్‌తో పాటు న‌ట‌న‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అలా ‘బాలీవుడ్‌ డ్యాన్సింగ్‌ క్వీన్‌’గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మకి ఈ రోజుతో 59 ఏళ్లు నిండుతాయి. ఇప్పటికీ అంతే అందంగా యువ హీరోయిన్లకు తీసిపోని గ్లామర్‌ ఆమె సొంతం. ఈ సందర్భంగా ఆమె మెరిసే అందం కోసం, ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఏం చేస్తుంటుంది, ఎలాంటి కేర్‌ తీసుకుంటుంది వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా.!.

ఈ అందాల తార మాధురి దీక్షిత్‌ మాత్రం ఇప్పటికీ మెరిసేచర్మం, ఆరోగ్యకరమైన జుట్టుతో ఆకట్టుకుంటూనే ఉంటారామె. అందుకోసం ఏం చేస్తుంటుందో  ఆమెనే స్వయంగా వెల్లండించారు. 

ఆరోగ్యకరమైన చర్మం కోసం..
మాధురీ దీక్షిత్ అందం చర్మం లోపలి నుంచే మొదలవుతుందని చెబుతున్నారామె. అందుకోసం, ఆరోగ్యకరమైన ఆహారం, హైడ్రేటెడ్‌గా ఉండటం అత్యంత ముఖ్యమని చెబుతున్నారు. అలాగే చర్మ సంరక్షణ అంటే ముఖానికి ఏం పూస్తున్నాం అనేది కాదని, శరీరానికి తేమను అందించేలా పుష్కలంగా నీరు తాగాలని అంటున్నారు.

మెరిసే చర్మం కోసం..

  • మాధురీ దీక్షిత్ తన రోజును ముఖంపై మురికిని తొలగించి, చర్మాన్ని తాజాగా ఉంచుకోవడానికి ఒక మంచి క్లెన్సర్‌తో ప్రారంభిస్తుంది.

  • ఆ తర్వాత టోనర్‌ను ఉపయోగిస్తుంది. రోజ్ వాటర్ ఆమెకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమైనది. అందువల్ల దాన్నే ఆమె టోనర్‌గా ఉపయోగిస్తుంటారామె.

  • తర్వాత విటమిన్ సీ సీరం వస్తుంది, దీనిని ఆమె తన చర్మ సంరక్షణ దినచర్యలో భాగంగా క్రమం తప్పకుండా ఉపయోగిస్తుంది.

  • చర్మ రకాన్ని బట్టి మాయిశ్చరైజర్‌ని ఉపయోగించాలని చెబుతుంది. జిడ్డు చర్మం అయితే వాటర్‌ బేస్ట్‌ మాయిశ్చరైజర్‌, పొడి చర్మం అయితే చిక్కటి క్రీమీ మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలని అన్నారామె.

  • ఆమె తన చర్మాన్ని రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్‌తో తన ఉదయపు దినచర్యను ముగిస్తుంది.

  • అలాగే మేకప్‌తో నిద్రపోవడం పెద్ద తప్పు అని మాధురీ దీక్షిత్ నొక్కి చెబుతున్నారు. 

  • ఆమె సాధారణంగా క్లెన్సింగ్ బామ్‌తో మేకప్‌ను తొలగిస్తారట. ఒక్కోసారి సున్నితమైన క్లెన్సర్‌తో ముఖాన్ని మళ్లీ కడుక్కోవడానికి ముందు వైప్స్‌తో మైసెల్లార్ వాటర్‌ను కూడా ఉపయోగిస్తానని అన్నారు.

  • అలాగే రాత్రి సమయంలో కూడా టోనర్‌, విటమిన్‌ సీ సీరమ్‌ని అప్లై చేస్తానని అంటోంది. రోజుకు రెండుసార్లు అప్లై చేస్తానని చెబుతోంది.

ఇక రాత్రంతా చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి రాత్రిపూట రొటీన్ మాయిశ్చరైజర్, అండర్-ఐ క్రీమ్, లిప్ బామ్‌ తప్పనిసరి అని అంటోంది.

జుట్టు సంరక్షణ కోసం..
మృదువైన, మెరిసే జుట్టు కోసం తాను ఉపయోగించే ఒక సాధారణ ఇంట్లో తయారుచేసిన హెయిర్ మాస్క్‌ను కూడా మాధురి పంచుకుంది. ఈ మాస్క్‌లో మెత్తగా చేసిన అరటిపండు, కొబ్బరి నూనె, తేనె ఉంటాయి. 

ఇక్కడ అరటి పండ్లు జుట్టుకు లోతైన పోషణను ఇవ్వగా, కొబ్బరి నూనె జుట్టు చిట్లడాన్ని తగ్గించి, మెరుపుని ఇస్తుంది. ఇక తేనె కుదుళ్లను మృదువుగా చేసి వొత్తుగా పెరిగేలా చేస్తుందట.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement