మెరుగైన ఆరోగ్యం కోసం వంట నూనెలో చిన్న మార్పు | Health Tips: A Simple Change in Cooking Oil is Supporting Better Health | Sakshi
Sakshi News home page

మెరుగైన ఆరోగ్యం కోసం వంట నూనెలో చిన్న మార్పు

May 12 2026 2:11 PM | Updated on May 12 2026 2:22 PM

Health Tips: A Simple Change in Cooking Oil is Supporting Better Health

ప్రస్తుతం అందరిలో ఆరోగ్య స్పృహ చికిత్స నుంచి నివారణ వైపు మారుతోంది. చాలా ఏళ్లుగా ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తిన తర్వాత గానీ చికిత్స గురించి ఆలోచించేవారు కాదు.  కానీ ఇప్పుడు దీర్ఘకాలిక ఆరోగ్యం అనేది రోజువారీ అలవాట్లపై ఆధారపడి ఉంటుందనే  సంగతి గుర్తిస్తున్నారు. ఆ దిశగా అవగాహన పెంచుకుంటున్నారు.. ఈ మార్పులో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇది రోజువారీ జీవితంలో అత్యంత స్థిరమైన అంశాలలో ఒకటి. 

భారతీయ గృహాలలో, వంట చేయడం అనేది కేవలం పోషణకు సంబంధించినది మాత్రమే కాదు. ఒకరి పట్ల చూపే శ్రద్ధ, సంప్రదాయానికి సంబంధించినది. రోజూ ఉపయోగించే అన్ని పదార్థాలలో వంట నూనెకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది.  మొత్తం ఆరోగ్యంపై దాని ప్రభావం ఎలా ఉంటుందో అవగాహన పెంచుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో గుండె జబ్బులు, మధుమేహం వంటి జీవనశైలి సంబంధిత పరిస్థితులు సర్వసాధారణం అవుతున్నందున, ఉపయోగించే నూనెలో కొవ్వుల నాణ్యతపై దృష్టి సారిస్తున్నారు. 

ఆరోగ్యదాయకమైన వంట నూనెలో తక్కువ సంతృప్త కొవ్వులతో పాటు, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (PUFA, MUFA) మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్‌ను సమతుల్య నిష్పత్తిలో ఉండాలని నొక్కి చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవన్నీ రైస్ బ్రాన్ ఆయిల్‌లో సమృద్ధిగా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. రోజువారి వంట అవసరాలకు అత్యుత్తమైనది తేల్చి చెప్పారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement