మాటంటే మనిషి తీరే! | CBSE board warnings to school children talking language | Sakshi
Sakshi News home page

మాటంటే మనిషి తీరే!

May 12 2026 5:52 AM | Updated on May 12 2026 5:52 AM

CBSE board warnings to school children talking language

పిల్లలు మన ఎదురుగా మాట్లాడే మాటలు వేరు. ఫ్రెండ్స్‌తో మాట్లాడే మాటలు వేరు. వారు ఏయే మాటలు వింటున్నారో ఏయే మాటలు మాట్లాడుతున్నారో గమనించారా? ఇటీవల సి.బి.ఎస్‌.ఇ.బోర్డు కూడా స్కూల్లో పిల్లలు బూతు మాట్లాడటాన్ని కంట్రోలు చేయమంది. 

ఈ సెలవుల్లో మన పిల్లల మాటను  సరిచేద్దామా?
పిల్లల నోట ‘బీప్‌’ మాటలు ‘ఫ్యాషన్‌’గా మారిపోయాయి. రీల్స్‌లో, గేమ్స్‌లో, ఫ్రెండ్స్‌ గ్రూప్‌లో– ఎక్కడ చూసినా అవే. పల్లెల్లో అయితే ‘నా మనవడు తిడితే భలే ముద్దొస్తాడు’ అని మురిసిపోయే తాత, ‘అబ్బో ఇంగ్లిష్‌ బూతులు కూడా నేర్చేసాడు’ అని గర్వపడే నాన్న... వీళ్లే మొదటి ముద్దాయిలు. ఎప్పుడైనా సరే మాటే మనిషి. నోటిని అదుపులో పెట్టుకోలేకపోతే జీవితాన్ని అదుపులో పెట్టుకోవడం కష్టం. ఈ సెలవులు ‘టూర్‌’కి కాదు ‘ట్యూనింగ్‌’కి వాడండి. పిల్లాడి ‘మైండ్‌సెట్‌’ ట్యూనింగ్‌. ‘మాట’ ట్యూనింగ్‌.

బీప్‌ మాటలు మాట్లాడితే ఏమవుతుంది?
చెడ్డ మాటలు అలవాటైతే పిల్లల వ్యక్తిత్వం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. బూతు అనేది కేవలం తిట్టు కాదు, అదొక ఆలోచనా ధోరణి. అలా మాట్లాడే పిల్లలు ఎదుటివాళ్లను గౌరవించడం మానేస్తారు. తిట్లతో మాట్లాడే పిల్లలతో మంచి పిల్లలు స్నేహం చేయడానికి ఇష్టపడరు, దానివల్ల వీళ్లు ఒంటరి అయిపోతారు.  చాలామంది పిల్లలకు తిట్లు తప్ప మంచి మాటలే రావడం లేదు. దానివల్ల వాళ్లు తమ భావాలను సరిగ్గా వ్యక్తపరచలేక కోపం, చిరాకు పెంచుకుంటున్నారు.

ఎందుకునేర్చుకుంటున్నారు?
పిల్లలు ఈ చెడ్డమాటలు ఎందుకు నేర్చుకుంటున్నారు అంటే దానికి కారణం ఓటీటీ వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు. కథకు అవసరం లేకపోయినా ఇరికిస్తున్నారు. దాన్నే పిల్లలు ఫాలో అవుతున్నారు. రెండోది ఫ్రెండ్స్‌ మధ్య పీర్‌ ప్రెషర్‌. ఫ్రెండ్స్‌ అందరూ అంటున్నారు కదా నేను కూడా అంటేనే కూల్‌ అనే ఫీలింగ్‌. మూడోది ఇంట్లో వాతావరణం. పెద్దలు కోపంలో తిడుతుంటే విని పిల్లలు నేర్చుకుంటారు. మరి ఎలా మాన్పించాలి?

‘సబ్‌స్టిట్యూట్‌’ చెప్పాలి
అదేదో సినిమాలో ‘మైదాపిండి’ అనేది తిట్టుగా వాడతాడు హీరో. చెడ్డమాటకు బదులు ఇలా కూడా వాడొచ్చు. ఏ చెడ్డ అర్థం లేని ‘జ΄్ఫా’ లాంటి సౌండ్స్‌ కూడా వాడొచ్చని చెప్పోచ్చు. ఇలాంటి టెక్నిక్‌ వాడిన సినిమా జంధ్యాల ‘హైహై నాయకా’ను వీలైతే చూపించాలి. పెద్దవాళ్లు, గొప్పవాళ్లు ఎలా మాట్లాడతారో ఉదాహరణ ఇవ్వాలి. బాగా కోపం వచ్చినప్పుడు ఎవరికి వారు ఒక మాట అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు ‘ఫినిష్‌’ అనే మాట పిల్లాడు తన తిట్టుగా పెట్టుకున్నాడనుకోండి. వాడు ‘ఫినిష్‌’ అన్నాడంటే బాగా కోపం వచ్చినట్టు. అందుకు చెడ్డమాటే మాట్లాడాల్సిన పని లేదు.
మన పిల్లలు మాట్లాడే ప్రతి మాటా వాళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని పేరెంట్స్‌గా మనం గుర్తుంచుకోవాలి. మాట తీరు మనిషి స్థాయి చెబుతుంది. ఈ వేసవిలో ఈ మాటను గుర్తుపెట్టుకుని పిల్లల భవిష్యత్తుకు బాట వేద్దాం.

తిట్టొద్దు
పిల్లాడు చెడ్డమాట మాట్లాడితే ‘నోర్ముయ్‌’ అని అరవొద్దు. అలా చేస్తే మీ ముందు ఆపేసి వెనక పది రెట్లు మాట్లాడతాడు. దాని బదులుగా ‘ఆ మాట అర్థం తెలుసారా?’ అని కూల్‌గా అడగాలి. 90 శాతం పిల్లలకి అర్థం తెలీదు. ట్రెండ్‌ కోసం వాడతారు. అర్థం చెప్తే వాడే సిగ్గుపడతారు. సెలవుల్లో రోజుకో ముప్పై నిమిషాలు పిల్లాడి ‘గ్యాంగ్‌’తో కూర్చోవాలి. సరదాగా మాట్లాడాలి. వాళ్ల భాష ఏంటో తెలుసుకుంటూ మెల్లగా అందరికీ నచ్చజెప్పాలి. ఇది అందరూ మారాల్సిన విషయం.  

సెటైర్‌ నేర్పాలి
‘మా ఫ్రెండ్స్‌ అందరూ మాట్లాడతారు డాడీ’ అంటే ‘సరేలే’ అని వదిలేయకూడదు. ‘ముందు ఇంట్లో మానెయ్‌. మెల్లగా బయట కూడా మానేయ్‌’ అని హద్దు గీస్తేనే విలువ తెలుస్తుంది. ఇంట్లో ప్రతి ‘బీప్‌’ మాటకి ‘ఫైన్‌’ పెట్టాలి. ఒక తప్పు మాటకు 10 రూపాయలు. ఆ డబ్బు వాడి పిగ్గీ బ్యాంక్‌ నుండి తీసి, ఎవరికైనా దానం చేయాలని చెప్పాలి. తిట్టాలంటే వ్యంగ్యంతో వెటకారంతో కూడా తిట్టొచ్చు అని చెప్పాలి.  పిల్లాడు మంచి మాట మాట్లాడినప్పుడు భలే మాట్లాడావు అని మెచ్చుకోవాలి. మీ మెప్పే వాళ్లకు పెద్ద రివార్డ్‌. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement