ఇదేం వినికిడి సమస్య..? కేవలం పురుషుల గొంతు మాత్రమే.. | This China Woman Literally Couldnt Hear Men And It Wasnt By Choice | Sakshi
Sakshi News home page

ఇదేం వినికిడి సమస్య..? కేవలం పురుషుల గొంతు మాత్రమే..

May 8 2026 4:53 PM | Updated on May 10 2026 10:40 AM

This China Woman Literally Couldnt Hear Men And It Wasnt By Choice

సాధారణ చెవుడు, బ్రహ్మ చెవుడు వంటివి వాటి గురించి విన్నాం. కానీ కేవలం పురుషుల మాటలు మాత్రం చెవికి వినపడని అరుదైన వైద్య పరిస్థితి గురించి విన్నారా..!?. ఔను అలాంటి వింత అనారోగ్య పరిస్థితితో బాధపడుతోంది ఈ మహిళ. పాపం తన ప్రియుడి మాటలు తనకు వినిపించడం లేదని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తోందామె. ఇదేం చెవుడు రా బాబు అనిపిస్తోంది కదూ. మరి ఆ కథా కమామీషు ఏంటో చూసేద్దామా..!.

చైనాలోని జియామెన్‌లో ఒక మహిళ అక్షరాలా పురుషుల మాటలు వినలేదట. ఆమెకు మగవాళ్లంటే నచ్చక ఇలానేమో అనుకోకండి. చైనాలోని జియమోమెన్‌లో నివశించే మహిళ తన ప్రియుడు మాటలు వినపించడం లేదని తెలుసుకుంటుంది. అన్ని పెద్ద పెద్ద శబ్దాలు వినగలిగినా..తన లవర్‌ మాటలే తనకు ఎందుకు వినిపించడం లేదని వైద్యులను ఆశ్రయిస్తే అసలు విషయం బయటపడింది. ఆమె రివర్స్‌ స్లోప్‌ హియరింగ్‌ లాస్‌తో బాధపడుత్నుట్లు గుర్తించారు. 

ఈ అరుదైన వ్యాధి కారణంగానే ఆమె మగవాళ్ల గొంతుని వినలేదట. అంటే తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోవడంగా చెప్పొచ్చు. ధ్వని వర్ణపలంలో చాలా వరకు పురుషుల గొంతులు కచ్చితంగా తక్కువ ఫ్రీక్వెన్సీలోనే ఉంటాయట. కానీ ఈ బాధిత మహిళ అధిక స్థాయి శబ్దాలను, గొంతులను స్పష్టంగా వినగలుగుతుంది కానీ తక్కువ శ్రేణి లేదా ఓ మోస్తారు మీడియం శబ్దంలో వచ్చే మాటలు అస్సలు వినలేదని తేల్చి చెప్పారు వైద్యులు. 

ఆ హియరింగ్‌ లాస్‌కి ఆ పేరు ఎలా వచ్చిందంటే..
రోగి వినికిడిని మ్యాప్ చేయడానికి వైద్యులు ఉపయోగించే ఆడియోగ్రామ్ అనే చార్ట్‌పై ఈ వ్యాధి ఏర్పరిచే ఆకారం నుంచే దానికి ఆ పేరొచ్చిందంట. చాలా వరకు వినికిడి లోపం చార్ట్‌పై క్రిందకి వాలి ఉంటుందని, ఇది అధిక ఫ్రీక్వెన్సీల నష్టాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. కానీ ఇక్కడ ఆ మహిళ విషయంలో మాత్రం..అందుకు విరుద్ధంగా ఉంటుందని వివరించారు వైద్యులు. 

ఇలా కేవలం పురుషుల గొంతులకే పరిమితం కాదు, తక్కువ స్థాయిలో మాట్లాడే మహిళల స్వరాలను సైతం వినలేకపోవచ్చని కూడా అన్నారు. అదే సమయంలో అధిక స్థాయిలో మాట్లాడే పురుషుల మాటలు వినపడే అవకాశం ఉందని కూడా చెప్పారు. అంతేగాదు తక్కువ పౌనఃపున్య శబ్దాలు మానవ మాటలకు మించి విస్తరించి ఉంటాయని కూడా చెప్పారు. 

ఈ వ్యాధిని అంత తేలిగ్గా గుర్తించలేం..
ఈ పరిస్థితిని అంత సులభంగా ఎవ్వరూ గుర్తించలేరని అంటున్నారు వైద్యులు. ఎందుకంటే చెవులు చిల్లులుపడే శబ్దాలను వినపడకపోవడాన్ని సులభంగా గుర్తించగలిగినంత ఈజీ కాదని చెప్పుకొచ్చారు. పాపం కొందరు ఈ అరుదైన వైద్య పరిస్థితి గురించి తెలియక ఏళ్లతరబడి గడిపేస్తుంటారని కూడా అన్నారు. 

మెనియర్స్ వ్యాధి, వైరల్ ఇన్ఫెక్షన్లు, మూత్రపిండాల వైఫల్యం, బ్రెయిన్‌ సంబంధిత సమస్యల వల్ల ఈ పరిస్థితి కారణం కావొచ్చని అన్నారు. అలాంటి బాధితులకు కొంత వరకు వినికిడి పరికరాలు కాస్త ఉపశమనం అందిస్తాయని అన్నారు. అలాగే ఆ మహిళ ప్రియుడికి దీన్ని వ్యక్తిగతంగా తీసుకుని ఇబ్బంది పెట్టడం వంటివి చేయకూడదని వైద్యులు సూచించారు కూడా. 

(చదవండి: బెల్స్‌ పాల్సీ వ్యాధి బారిన టెకీ..! కట్‌చేస్తే..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement