బెల్స్‌ పాల్సీ వ్యాధి బారిన టెకీ..! కట్‌చేస్తే.. | Indian techie builds AI app after sudden Bells palsy diagnosis | Sakshi
Sakshi News home page

బెల్స్‌ పాల్సీ వ్యాధి బారిన టెకీ..! కట్‌చేస్తే..

May 8 2026 2:52 PM | Updated on May 8 2026 3:29 PM

Indian techie builds AI app after sudden Bells palsy diagnosis

ఒక్కోసారి ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడుతుంటాం. అయితే ఆ సయమంలో మనం సానుకూల దృక్పథంతో స్పందిస్తే అద్భుతాలు చేయొచ్చని ఈ టెకీ నిరూపించాడు. కొందరు ఏ వ్యాధి అయినా వచ్చింది అనగానే దబాలున కుంగిపోతుంటారు. అలా కాకుండా నాకే ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అనే నైరాశ్యం కంటే..తనలాంటి వాళ్లుకు ఉపశమనం ఏంటి అనే ఆలోచన తళుక్కుమంటే..కచ్చితంగా హీరోగా, ప్రత్యేకమైన వ్యక్తిగా నిలుస్తాం అనేందుకు ఈ యువ టెకీనే ఉదాహరణ. 

అసలేం జరిగిందంటే..పీసెస్ AIలో సీనియర్ డెవలపర్ అడ్వకేట్‌గా పనిచేస్తున్న అలీ ముస్తఫా సింగపూర్‌ ఎంతో ఆనందంగా లైఫ్‌ని లీడ్‌  చేస్తున్నారు. ఆ క్రమంలో అనుకోకుండా ముఖ పక్షవాతానికి కారణమయ్యే బెల్స్‌ పాల్సీ అనే వ్యాధి బారినపడ్డారు. దాంతో అతడు ముఖం కుడివైపు మొత్తం కదపలేని పరిస్థితి ఎదురైంది. బొంబాయికి తిరిగి వచ్చిన వెంటనే ఈ పరిస్థితి ఎదుర్కొంది. దాంతో హుటాహుటినా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ముఖంలోని ఒక వైపు కండరాలలో అకస్మాత్తుగా బలహీనతను కలిగించే బెల్స్ పాల్సీ అనే వ్యాధి బారినపడ్డట్లు వైద్యులు గుర్తించారు. ఈ పరిస్థితి కొన్ని నెలల్లోనే మెరుగుపడుతుందని చెప్పారు వైద్యులు. 

అందుకోసం కండరాల బలం కోసం ముఖ వ్యాయామాలు, ఫిజికల్‌ థెరపీ అవసరం అని సూచించారు కూడా. అయితే అక్కడితో ఆగిపోలేదు అలీ.  ఈ సమస్యకు తన సాంకేతిక సామర్థ్యాన్ని జోడించి ఏఐ ఫేస్‌ ట్రాకింగ్‌ మిర్రర్‌ యాప్‌ను రూపొందించారు. ఇది ముఖ​ వ్యాయామాల మార్గనిర్దేశం తోపాటు పరిస్థితి ఎంతవరకు మెరుగ్గా ఉందనేది ట్రాక్‌ చేస్తుంది. తాను ఈ యాప్‌ను  OpenAI ఏజెంట్‌ కోడెక్స్‌ తోపాటు ఆంత్రోపిక్‌ క్లాడ్‌ని ఉపయోగించినట్లు తెలిపారు. 

యాప్‌ ఎలా పనిచేస్తుందో వివరిస్తూ..ఒక వీడియోని కూడా పంచుకున్నారు. ఆ వీడియోలో అతని ముఖ వ్యాయామాలను విశ్లేషించి ఫిజియోథెరపిస్ట్‌కు పంపుతుంది. అంతేగాదు ప్రతి వ్యాయామాన్ని రికార్డ్ చేయడానికి, అలాగే ఫిజియో వ్యాయామాలను సమీక్షించి ఫీడ్‌బ్యాక్ అందించడానికి వీలుగా ఒక సమగ్ర నివేదికను కూడా అందిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే..వ్యాయామం చేసిన ప్రతిసారీ, యాప్ సెషన్ వ్యవధిని రికార్డ్ చేస్తుంది, అలాగే ముఖ కదలికలు ఎంత వరకు మెరుగ్గా మారిందో అంచనా వేస్తుంది. 

నెటిజన్లు అతని చొరవును ప్రశంసించడమే గాక, కొన్ని ఆఫర్లు కూడా అందించారు. ఇక ఓపెన్‌ఏఐ ఎగ్జిక్యూటివ్‌ వైభవ్‌ శ్రీవాస్తవ్‌ ఆలీని మరిన్ని ప్రయోగాలు చేయడానికి వీలుగా ChatGPT సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తానని ఆఫర్ చేశారు. అలాగే ఇలాంటి మరెన్నో వినూత్న ఆవిష్కరణలు చేయాలంటూ ప్రోత్సహించారు కూడా. 

 

(చదవండి: పెళ్లికి ముందు ఆ వైద్య పరీక్ష తప్పనిసరి..! లేదంటే..)
 

Advertisement
 
Advertisement
Advertisement