విజయ్‌కి ఛాన్స్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం కీలక వ్యాఖ్యలు | Tamil Nadu government formation delay P Chidambaram cites constitutional convention | Sakshi
Sakshi News home page

విజయ్‌కి ఛాన్స్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం కీలక వ్యాఖ్యలు

May 8 2026 1:12 PM | Updated on May 8 2026 2:45 PM

Tamil Nadu government formation delay P Chidambaram cites constitutional convention

న్యూఢిల్లీ: తమిళనాడులో అనూహ్యం సాగుతున్న  రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీ చిదంబరం స్పందించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీని ఆహ్వానించాలని తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ని కోరారు. అసెంబ్లీలో 108 స్థానాలు గెలుచుకుని, టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

విజయ్‌కు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించినప్పటికీ మ్యాజిక్‌ ఫిగర్‌ పూర్తి కాని నేపథ్యంలో వాతావరణం వేడెక్కింది.  మరోవైపు నటుడు  విజయ్‌ తమిళనాడు సీఎం కావడం ఖాయం అనుకుంటున్న తరుణంలో గవర్నర్‌ నిర్ణయాలు వివాదంగా మారాయి. మొదట ప్రభుత్ ఏర్పాటుకు ఆహ్వానించి, ఆ తరువాత శరవేగంగామారుతున్న గవర్నర్‌ నిర్ణయాలను ఇప్పటికే పలువురు నేతలు, రాజకీయ నిపుణులు తప్పుబట్టారు. బీజేపీ డైరెక్షన్‌లోనే గవర్నర్ పనిచేస్తున్నారని, రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియను అడ్డుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల పూర్తి వివరాలను సమర్పించాలని గవర్నర్‌ కోరడంపై  టీవీకే నాయకులు కూడా మండిపడు తున్నారు.

తాజాగా ఈ వివాదంపై స్పందించిన  చిదంబరం  కీలకవ్యాఖ్యలు చేశారు.  108 స్థానాలు గెలుచుకున్న టీవీకే అత్యంత పెద్ద పార్టీగా అవతరించింది, పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం, ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రానప్పుడు, అతిపెద్ద పార్టీ నాయకుడిని (విజయ్) తొలుత ఆహ్వానించడం గవర్నర్ బాధ్యత అని చిదంబరం పేర్కొన్నారు. అంతేకాదు మెజారిటీని నిరూపించుకోవాల్సింది  లోక్‌ భవన్‌లో కాదు, అసెంబ్లీ వేదికగా అని చిదంబరం స్పష్టం చేశారు. దీనిపై  ఎస్.ఆర్. బొమ్మై కేసులో 1994 సుప్రీంకోర్టు తీర్పును కూడా ఆయన ఉదహరించారు. సంఖ్యాబలం ఆధారంగా మెజారిటీ నిరూపించుకునే అవకాశం విజయ్‌కు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా తమిళ రాజకీయ పక్షాలు ఈ నిబంధనను నొక్కి చెప్పడాన్ని ఆయన అభినందించారు.

ఇదీ చదవండి : వరుడు అనూహ్య మరణం, పెద్దల షాకింగ్‌ నిర్ణయం

కాగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన కనీస మెజారిటీ మార్కుకు టీవీకే కూటమి స్వల్ప దూరంలో ఉంది. కాంగ్రెస్‌ మద్దతోతో  టీవీకే బలం ఇపుడు (టీవీకే-108, కాంగ్రెస్-5) 113 చేరింది.  ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కంటే ఈ కూటమి ఇంకా 5 స్థానాల కావాల్సి ఉంది. 

ఇదీ చదవండి: హంటా వైరస్‌ కలకలం : బాధితుల్లో ఇద్దరు భారతీయులు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement