పెళ్లికి ముందు ఆ వైద్య పరీక్ష తప్పనిసరి..! లేదంటే.. | Health Tips: Thalassemia: Symptoms Causes And Treatment | Sakshi
Sakshi News home page

పెళ్లికి ముందు ఆ వైద్య పరీక్ష తప్పనిసరి..! లేదంటే..

May 8 2026 12:57 PM | Updated on May 8 2026 12:59 PM

Health Tips: Thalassemia: Symptoms Causes And Treatment

కొన్ని వ్యాధులు పెళ్లికి ముందు యవ జంటలు ఈ వైద్య పరీక్షలు చేయించుకుంటే పిల్లలకు ప్రాణాంత వ్యాధులు బారినపడరు. అలాంటి వ్యాధుల్లో ఒకటే ఈ ప్రాణాంతక తలసేమియా వ్యాధి. ఈ వ్యాధి కారణంగా ఎందరో బాధితులు అను నిత్యం నరకం చూస్తుంటారు. ఎందుకంటే రేపు రోజు ఎలా ఉంటుందో తెలియని స్థితి. పైగా ప్రతి నెల రక్తం ఎక్కించుకోవాల్సిన దుస్థితి. ఇవాళ అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం ఈ సందర్భంగా ఈ వ్యాధి ఎందువల్ల వస్తుంది? నివారణ ఏంటి వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

తలసేమియా అంటే..
తలసేమియా (Thalassemia) అనేది జన్యుపరమైన రక్తహీనత వ్యాధి, ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది. దీనివల్ల ఎర్ర రక్త కణాలు సరిగ్గా ఏర్పడక, బాధితులు ప్రతి 2-4 వారాలకు ఒకసారి రక్తం ఎక్కించుకోవాల్సి వస్తుంది. 

వేసవి సెలవుల్లో రక్త సేకరణ శిబిరాలు తగ్గడంతో రక్త నిల్వల కొరత ఏర్పడుతోంది. తలసేమియా మహమ్మారి చిన్నారులకు నరకం చూపిస్తోంది. ప్రభుత్వం ఈ వ్యాధికి ఉచిత చికిత్స అందుతున్నా, నిరంతర రక్త అవసరం, నిల్వల కొరతతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు.

నివారణ ఎలాగంటే..

పెళ్లికి ముందు జంటలు 'హీమోగ్లోబిన్ ఎలెక్ట్రోఫోరేసిస్' పరీక్ష చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు.

సమస్య ఉన్నవారు రక్తమార్పిడితో పాటు, ఐరన్ ఓవర్లోడ్ (Iron overload) తగ్గించడానికి అవసరమైన మందులు వాడాలి.

తలసేమియా మేజర్ ఉన్నప్పటికీ, సరైన చికిత్స, పట్టుదలతో తిరుచ్చికి చెందిన పరమేశ్వరి వంటి వారు ఉన్నత చదువులు చదువుతూ ఇతరులకు ప్రేరణగా నిలుస్తున్నారు. ఈ వ్యాధి గురించి మరింత అవగాహన పెంపొందించుకోవడానికి ఈ కింది లింక్‌పై క్లిక్‌ చేయండి.

 (చదవండి: 'ఉప్పు' ఇంత ప్రాణాంతకమా..? పరిశోధనల్లో షాకింగ్‌ విషయాలు)

 

Advertisement
 
Advertisement
Advertisement