పీఛే చల్‌! ఇలా నడిచి చూశారా? | Health Tips: Retro Walking: What It Is And How To Do It, Per Physical | Sakshi
Sakshi News home page

పీఛే చల్‌! ఇలా నడిచి చూశారా?

May 10 2026 11:27 AM | Updated on May 10 2026 11:38 AM

Health Tips: Retro Walking: What It Is And How To Do It, Per Physical

వాకింగ్‌ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే. కానీ అదే వాకింగ్‌ను వెనక్కి చేస్తే డబుల్‌ ఆరోగ్యం లభిస్తుందంటే నమ్మగలరా? నిజమే! ఫిట్‌నెస్‌ ప్రపంచంలో ఇప్పుడు కొత్త ట్రెండ్‌ – ‘రెట్రో వాకింగ్‌’ బాగా పాపులర్‌ అవుతోంది. నిపుణుల ప్రకారం, ఇది సాధారణ వాకింగ్‌ కంటే మరింత ప్రయోజనాలు ఇచ్చే వ్యాయామం. ఇలా వెనక్కి నడిస్తే మోకాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ముందుకు నడిచేటప్పుడు ఎక్కువగా పని చేయని కాళ్ల కండరాలు కూడా వెనక్కి నడిచేటప్పుడు యాక్షన్‌లోకి దిగుతాయి. 

సాధారణ వేగంతో నడిచినా దాదాపు ‘నలభై శాతం ఎక్కువ క్యాలరీలు’ కరిగిపోతాయి. అంటే తక్కువ టైమ్‌లో ఎక్కువ పని చేసినట్టే! ఇంకా మెదడు సంగతి చెప్పాలంటే, వెనక్కి నడవడం కొత్త పని కాబట్టి అది ఫుల్‌ అలర్ట్‌లోకి వెళ్లి బ్యాలెన్స్, ఫోకస్, జ్ఞాపకశక్తి అన్నింటినీ మరింత పదును పెడుతుంది. 

కొందరికి వెన్నునొప్పి, కాళ్లు బిగపట్టడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే ఒక విషయం మాత్రం తప్పక గుర్తుంచుకోండి. మొదట రెండు నుంచి మూడు నిమిషాలు నెమ్మదిగా, ఖాళీ ప్రదేశంలో మాత్రమే ప్రయత్నించండి. లేదంటే వ్యాయామం కంటే ముందు యాక్సిడెంట్‌ జరిగే ప్రమాదం ఉంటుంది! 
∙ 

Advertisement
 
Advertisement
Advertisement