పిల్ల‌ల కథ: ఓర్పుకు ఫలితం | Kids Story: Patience pays off | Sakshi
Sakshi News home page

పిల్ల‌ల కథ: ఓర్పుకు ఫలితం

May 17 2026 12:00 AM | Updated on May 17 2026 12:00 AM

Kids Story: Patience pays off

AI representation image

అనగనగా ఒక ఊరిలో రాము అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. వాడికి ఎప్పుడూ తొందర. ఏ పని చేసినా అరకొరగానే చేసేవాడు. ఒకసారి వాడి తాతయ్య వాళ్ల ఇంటి పెరట్లో మామిడి చెట్టు నాటమని ఒక మొక్క ఇచ్చాడు. రాము గబగబా చిన్న గుంత తీసి, మొక్కను అలా పడేసి, మట్టి కప్పి నీళ్లు పోయకుండానే ఆడుకోవడానికి వెళ్లిపోయాడు. పక్కింటి లచ్చి మాత్రం తన మొక్క కోసం మోకాళ్ల లోతు గుంత తీసింది. పేడ ఎరువు వేసింది. రోజూ రెండు పూటలా నీళ్లు ΄ోసింది. పిట్టలు కొట్టకుండా చుట్టూ కంచె కూడా వేసింది.

మూడు నెలలు గడిచాయి. వానాకాలం వచ్చింది. రాము నాటిన మొక్క ఎప్పుడో వాడిపోయింది. లచ్చి మొక్క మాత్రం లేత ఆకులతో, బలంగా పెరుగుతోంది.

రాముకి కోపం వచ్చింది. ‘తాతయ్యా, నువ్వు నాకు చెడ్డ మొక్క ఇచ్చావు. లచ్చికి మంచిది ఇచ్చావు‘ అని ఏడ్చాడు. తాతయ్య నవ్వి, ఇద్దరినీ తీసుకెళ్లి రెండు గుంతలు తవ్వించాడు. రాము గుంతలో రాయి తగిలింది, వేరు పాకడానికి చోటు లేదు. మట్టి కూడా గట్టిగా ఉంది. లచ్చి గుంతలో మట్టి మెత్తగా, తడిగా ఉంది. అప్పుడు తాతయ్య చెప్పాడు, ‘మొక్క ఒకటే నాయనా. నువ్వు చేసిన పని, లచ్చి చేసిన పని వేరు. నీ తొందరపాటు వల్ల మొక్క చచ్చింది’.

ఐదేళ్లు గడిచాయి. లచ్చి చెట్టు పెద్దదై, కాయలు కాసింది. ఆ ఊరి పిల్లలంతా దాని నీడలో ఆడుకునేవారు, పండ్లు తినేవారు. రాము సిగ్గుపడి, లచ్చిని అడిగి ఎలా నాటాలో నేర్చుకున్నాడు. మళ్లీ ఒక మొక్క తెచ్చి ఈసారి ఓపికగా నాటాడు. మూడేళ్లకే ఆ చెట్టు కూడా కాయడం మొదలుపెట్టింది. అప్పుడు రాము అందరితో అన్నాడు, ‘తొందర పనికి మొక్క కూడా మొలవదు. ఓపిక పట్టి, జాగ్రత్తగా చేస్తే రాయిలో కూడా చెట్టు పుడుతుంది’.

నీతి: ఏ పని చేసినా పూర్తిగా తెలుసుకొని, ఓపికతో చేయాలి. అప్పుడే మంచి ఫలితం వస్తుంది.

చ‌ద‌వండి: పొరపాటున కూడా బంగారం కొనొద్దు.. ఎందుకో తెలుసా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement