పాలలో ఆ నేల రుచి ఉంటుంది! | Sagubadi: woman-farmer changed career and got involved in agriculture | Sakshi
Sakshi News home page

పాలలో ఆ నేల రుచి ఉంటుంది!

May 8 2026 3:25 PM | Updated on May 8 2026 3:29 PM

 Sagubadi: woman-farmer changed career and got involved in agriculture

పచ్చిక బయళ్లు పరిరక్షించబడే చోట అత్యంత ఆరోగ్యదాయకమైన పాల ఉత్పత్తులను సమాజానికి అందించవచ్చని అంటున్నారు జార్జియా దేశానికి చెందిన మహిళా రైతు నీనా. ఊరికి దగ్గర్లో ఉండే పచ్చిక బయళ్లను పరిరక్షించుకుంటూ ఉండబట్టే తమ జీవనం ఒదిదొడుకుల్లేకుండా సజావుగా సాగుతోందని ఆమె అంటున్నారు. ఒకప్పుడు పచ్చిక బయళ్లలోకి వెళ్లటం, పాడి పరిశ్రమ పనులు చేపట్టటం మహిళలకు సంబంధం లేని విషయంగా ఉండేదట. అయితే, పట్నం నుంచి స్వగ్రామానికి తిరిగొచ్చిన ఆమె పట్టుదలతో కొద్ది సంవత్సరాలుగా ‘పచ్చిక బయళ్ల ఆధారిత డెయిరీ రైతు’గా నిలదొక్కుకున్నారు. తనలాంటి చిన్న మహిళా పాడి రైతుల నుంచి పాలు కొనటం ద్వారా వారికి స్థిరంగా సొంత ఆదాయం వచ్చేలా చేస్తున్నారామె. అంతేకాదు, మరుగునపడిన ‘డో’ అనే ఒక పాతకాలపు ప్రత్యేక జార్జియన్‌ పాల ఉత్పత్తిని తిరిగి అందుబాటులోకి తేవటం నీనా చేసిన మరో మంచి పని!

జార్జియా దేశంలోని కాస్పి సామూహిక పచ్చిక బయళ్లలో మహిళా రైతు నీనో నుగ్జరాష్విలి కృషి ప్రత్యేకమైనది. ఆమె భర్త తమ పాడి పశువులను మేత కోసం తోలుకు΄ోతుండగా, ఆమె తమ పశువుల పాలను అనేక రకాల సురక్షితమైన, అధిక–నాణ్యత గల పాల ఉత్పత్తులుగా మార్చే పనిలో నిమగ్నమవుతుంటుంది. ఆమె స్వయంగా పశువులను మేపడం అరుదుగా చేస్తుంటుంది. అందుబాటులో ఉన్న ఆ పచ్చిక బయళ్లే వారి జీవనాధారంగా నిలిచాయి. 

‘సహజమైన పచ్చిక బయళ్లలో దొరికే మేతే మాకు సర్వస్వం. తక్కువ ఖర్చుతో పాలను ఉత్పత్తి చెయ్యటానికి పచ్చిక బయళ్లు మాకు ఆధారం. ఈ సహజమైన పచ్చిక వల్ల పాలకు పూర్తిగా భిన్నమైన నాణ్యత వస్తుంది. దొడ్డిలో పశువులను కట్టేసి మేపే పద్ధతిలో పెరిగే పశువుల పాల రుచి, విశాలమైన పచ్చిక బయళ్లలో తిరుగాడుతూ పెరిగే పశువుల పాల రుచికి, నాణ్యతకు సాటి రాదు..’ అంటారు నీనో. ‘ఒకప్పుడు మహిళలు పచ్చిక బయళ్లకు వెళ్లలేరని లేదా పశువులను మేపలేరని నమ్మేవారు, కానీ ఈ రోజుల్లో మహిళలు అవన్నీ చేస్తున్నారు..’ అని చీజ్‌ తయారీ పనులు చేస్తూనే ఆమె చెప్పారు.

చాలా సంవత్సరాల క్రితం నీనో తన గ్రామాన్ని విడిచిపెట్టి జార్జియాలోని పర్వత ప్రాంతమైన త్సాల్కా మునిసిపాలిటీకి వెళ్లి.. స్థానికుల దగ్గర జున్ను తయారీ కళను నేర్చుకుంది. జార్జియన్‌ సుల్గుని, ఇమెరులి, ఇతర సాధారణ రకాల జున్నులను తయారుచేసే రహస్యాలను నేర్చుకుంది.

ఆమె కుటుంబం ఆరు సంవత్సరాల క్రితం తన గ్రామానికి తిరిగి వచ్చి రెండు ఆవులను పెంచుకుంటూ పాలు అమ్మకుండా, ఆ పాలతోజున్ను, వెన్న, ‘డో’ అనే ఒక అరుదైన పురాతన (పాలను పులియబెట్టి తయారు చేస్తారు) పాల ఉత్పత్తిని తయారు చేయటం ప్రారంభించింది. ప్రస్తుతం ‘డో’ జార్జియాలో దాదాపుగా కనుమరుగైపోయింది. 

‘డో’కి ఘాటైన రుచి, గొప్ప చరిత్ర ఉన్నాయని ఆమె వివరిస్తుంది. అది మా మార్కెట్‌లో కనిపించటమే లేదు. నేను దాన్ని నెమ్మదిగా మార్కెట్లోకి తిరిగి తీసుకురావాలనుకున్నాను అన్నారామె. ‘డో’ తయారీకి  ఎక్కువ శ్రమపడాలి. సరైన యంత్ర పరికరాలు సమకూర్చుకోలేకుండా ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టం. 

‘డో’ను పునరుద్ధరించడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాల గురించి వార్త వ్యాపించడంతో, మార్కెట్‌ స్పందించింది. దాదాపుగా మర్చిపోయిన ఈ ఉత్పత్తికి చప్పున అధిక డిమాండ్‌ ఏర్పడింది. అయితే, పాలను ‘డో’గా ఉత్పత్తి చేయడానికి, ప్రాసెస్‌ చేయడానికి అవసరమైన పరికరాలు నీనో వద్ద ఇంకా లేవు. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ఆర్థిక తోడ్పాటుతో ఆమె పాశ్చరైజర్‌ తదితర యంత్ర పరికరాలను సమకూర్చుకోగలిగింది. అంతేకాకుండా, శిక్షణ కూడా పొందింది.

నీనో సమాజంలో, గ్రామీణ మనుగడకు సామూహిక పశువుల మేత భూములు అత్యవసరం. అయితే, భూమి లభ్యతపై ఆందోళన పెరుగుతోంది. కేవలం రెండు లేదా మూడు ఆవులు ఉన్న కుటుంబాలు దాదాపు పూర్తిగా బహిరంగ పచ్చిక బయళ్లపైనే ఆధారపడి ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో, భూముల అమ్మకాలు, భూమి క్షీణత, పచ్చిక బయళ్లలోకి ప్రవేశించే అవకాశాల్లేక΄ోవటం కారణంగా అనేక గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని ్ర΄ాంతాలలో పచ్చిక బయళ్లు ఇప్పటికే పూర్తిగా కనుమరుగయ్యాయి. కొంతమంది రైతులు తమ పశువులను అమ్ముకోవలసి వచ్చింది.

పచ్చిక బయళ్ళు కేవలం పాల ఉత్పత్తికి తోడ్పడే వ్యవస్థలు మాత్రమే కాదు. అంతకంటే ఎంతో ఎక్కువ. జీవవైవిధ్యాన్ని, సాంస్కృతిక సంప్రదాయాలను, ఆహార వారసత్వాన్ని పచ్చిక బయళ్లు నిలబెడతాయి. ‘సహజంగా పెరిగిన గడ్డిని ఆరుబయట తిరుగుతూ పశువులు మేయడం వల్ల వచ్చే పాలలో ఆ నేల రుచి ఉంటుంది. 

అది మనల్ని మన పర్యావరణానికి, మన చరిత్రకు అనుసంధానిస్తుంది..’ అని ఆమె అన్నారు. ఎఫ్‌ఏఓ శిక్షణా తరగతుల్లో చేరిన కొద్దికాలానికే, నీనో మ్యాచింగ్‌ గ్రాంట్‌ను కూడా ΄పొందింది. దీనితో ఆమె పాశ్చరైజర్, మిల్క్‌ కూలర్, మిల్క్‌ ఎనలైజర్‌ వంటి ఆధునిక పరికరాలను కొని ఉపయోగించగలుగుతోంది. ఆమె వంటి 11 వేల మంది జార్జియా మహిళా రైతులకు ఈ ఏడాది మ్యాచింగ్‌ గ్రాంట్, శిక్షణను ఇచ్చింది.  

ఈ సంవత్సరం వారిదే!
2026ని ఐక్యరాజ్యసమితిలోని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) నీనా వంటి పచ్చిక బయళ్లపై ఆధారపడి పశువులను పెంచుకొని జీవనోపాధి పొందే రైతులపై దృష్టిని కేంద్రీకరించేందుకు ‘అంతర్జాతీయ పచ్చిక బయళ్ళు– పశుపోషకుల సంవత్సరం’గా, ‘అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం’గా కూడా జరుపుతోంది. పశుపోషకులు, మత్స్యకారుల నుండి ప్రాసెసర్లు, వ్యాపారులు, గ్రామీణ పారిశ్రామికవేత్తల వరకు ఉన్న మహిళా రైతుల కృషికి జేజేలు పలకటమంటే.. ఆరుగాలం కష్టించి చాకిరీ చేస్తూ సమాజానికి తిండిపెట్టే రైతమ్మలకు జేజేలు పలకటమే.

భూమిలో సగం పచ్చిక బయళ్లే!
భూమిపై సగం భూభాగంలో విస్తరించి ఉన్న పచ్చిక బయళ్ళు కోట్లాది మంది పశు΄ోషకులు, పశువుల పెంపకందారుల జీవనోపాధికి ఆధారంగా నిలిచాయి. వారు తమ సంచారశీలత, సాంప్రదాయ జ్ఞానం, జీవవైవిధ్యం, సహజ వనరులను పరిరక్షించే సుస్థిర పద్ధతుల ద్వారా పచ్చిక బయళ్లను పశువులు మేపుకోవటానికి ఉపయోగించుకుంటూనే సంరక్షిస్తున్నారు. చాలా మంది మహిళా రైతులకు పశుపోషణ అనేది వారి సంస్కృతి, జీవనోపాధి, సామాజిక భద్రతకు అతి ముఖ్యమైన పనిగా ఉంది. 

(చదవండి: Savidya: ఉచిత డిజిటల్‌ సహకార కోర్సులు)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement