క్షణం క్షణం ఉత్కంఠ నడుమ స్నేహపూర్వక బ్రేక్‌ఫాస్ట్‌..! | What Vijay, Allies Were Served At Big Lok Bhavan Meet | Sakshi
Sakshi News home page

క్షణం క్షణం ఉత్కంఠ నడుమ స్నేహపూర్వక బ్రేక్‌ఫాస్ట్‌..!

May 10 2026 10:22 AM | Updated on May 10 2026 10:33 AM

What Vijay, Allies Were Served At Big Lok Bhavan Meet

తమిళనాడు రాజకీయాలు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాని తలపించాయి. ఎట్టకేలకు ఆ ట్విస్ట్‌ల మధ్య చివరికి విజయ్‌ విజిల్‌ గట్టిగా మోగింది. రోజుల తరబడి సాగిన రాజకీయ ప్రతిష్టంభన తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ వి అర్లేకర్‌తో జరిగి వరుస సమావేశాల అనంతరం మొత్తం 120 ఎమ్మెల్యేల మద్దతు లేఖలతో లోక్ భవన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి..అధికారిక ఆహ్వానాన్ని స్వీకరించి బయటకు వచ్చారు. ఇంత భారీ ఉత్కంఠ నడుమ గవర్నర్‌ నివాసం లోపల సహృద్భావ పూర్వక స్నేహ వాతావరణం ఉండటం విశేషం. 

ఆ నివాసం లోప కూటమికి సంబంధించి..సంఖ్యాబల లెక్కలు, రాజ్యంగపరమైన చర్చల తోపాటు చక్కటి రుచికరమైన అల్పాహార విందు, కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్‌ వంటి సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..లోక్‌భవన్‌ జరిగిన సమావేశం సందర్భంగా విజయ్‌, ఆయన మిత్రపక్ష నాయకులకు తమిళనాడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు కె. సెల్వపెరుంతగై కూడా ఉన్నారు. అక్కడ వడ, హల్వా, కాఫీ వడ్డించారు. 

గత కొన్ని రోజులగా ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియపై తీవ్రమైన అనిశ్చితి ఉన్నప్పటికీ లోపల వాతావరణం మాత్రం ఎంతో స్నేహపూర్వకం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. కాగా, అధికారిక చర్చలు ముగిసిన తర్వాత కూడా, విజయ్ లోక్ భవన్ లోపలే దాదాపు ఒక గంట పాటు గడిపినట్లు సమాచారం. గవర్నర్‌ నుంచి అధికారిక నియమాక పత్రాన్ని స్వయంగా స్వీకరించిన తర్వాత ఆయన  ఆ ప్రాంగణం నుంచి బయలుదేరారని ఆ వర్గాలు తెలిపాయి. పైగా గత నాలుగు రోజుల్లో గవర్నర్‌తో విజయ్ జరిపిన నాల్గొవ సమావేశం ఇది. 

అంతేగాదు ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ ఖరారైన తర్వాత, సమావేశంలో కొన్ని సరదా సందర్భాలు కూడా చోటుచేసుకున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారం, కూటమిలోని కొందరు నాయకులు తమ కుటుంబ సభ్యులకు వీడియో కాల్స్ చేసి, తమ పిల్లలతో కాసేపు మాట్లాడమని విజయ్‌ని కోరారు. ఏదీఏమైతేనేం రీల్స్‌ హీరో కాస్తా రియల్‌ హీరోలా తమిళనాడు ముఖ్యమంత్రిగా నేడు(ఆదివారం మే 10, 2026) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేవలం రెండేళ్ల క్రితం స్థాపించబడి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించే స్థాయికి చేరుకున్న 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీకి ఈ పరిణామం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుంది.

(చదవండి: సంచలనాల టీవీకే విజయ్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదే! ర్యాలీలో సైతం..)
 

Advertisement
 
Advertisement
Advertisement