67 కిలోల నుంచి 53 కిలోలకు..! కానీ జంక్‌ఫుడ్‌కు నో చెప్పక్కర్లేదట.. | Fitness Influencer Shares 8 habits that helped me go from 67kgs to 53kg | Sakshi
Sakshi News home page

WeightLoss Tips: 67 కిలోల నుంచి 53 కిలోలకు..! కానీ జంక్‌ఫుడ్‌కు నో చెప్పక్కర్లేదట..

May 11 2026 11:41 AM | Updated on May 11 2026 4:52 PM

Fitness Influencer Shares 8 habits that helped me go from 67kgs to 53kg

బరువు తగ్గడం అనేది ఆరోగ్య స్పృహతో కూడిన ట్రెండ్‌గా మారింది. యువత కాదు పెద్దలు సైతం స్మార్ట్‌, హెల్దీగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. చేతనైనంతలో కొద్దిపాటి వ్యాయామాలు, మితంగా భోజనం, చక్కటి జీవనశైలిని పాటించేందుకు మక్కువ చూపిస్తున్నారు. అంతేగాదు బరువు తగ్గడం భారం కాదు అనారోగ్యం బారిన నుంచే కాపాడుకునే రక్షణచర్యగా భావిస్తున్నారు. ఆ క్రమంలో చాలామంది మనకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ కోవలోకి తాజాగా ఒక ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ చేరిపోయారు. ఆమె కేవలం 12 కిలోలను బరువుని చాలా తేలికపాటి అలవాట్లతో తగ్గించుకుని శెభాష్‌ అనిపించుకున్నారు. కష్టంగా కాకుండా చిన్నచిన్నగా సాధ్యమై వాటినే ఎంచుకుని, పాటిస్తే బరువు తగ్గడం చాలా ఈజీ అని అంటున్నారామె. మరి అవేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా.!.

తక్షణ పరిష్కారాలపై ఆధారపడకుండా, సమతుల్య దినచర్యలు, ఆలోచనాత్మకమైన ఆహారం, శక్తి శిక్షణ, తగినంత నీరు తాగడం, నాణ్యమైన నిద్రపై దృష్టి పెట్టడమే బరువు తగ్గడానికి ఆదర్శవంతమైన మార్గం. అంతేగాదు కొలెస్ట్రాల్‌ని రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే సాధారణ అలవాట్లతోనే తగ్గించుకోవచ్చని అంటోంది ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ సృష్టి కృష్ణన్‌. దీర్ఘకాలం హాయిగా చేయగలిగే చిన్నపాటి జీవనశైలి మార్పులతో 14 కిలోలకు పైగా తగ్గారామె.

జంక్ ఫుడ్‌కు నో చెప్పకండి..
వాట్‌ ఇదేంటి అనకండి. మనకు తినాలనిపించే వాటిని వద్దని కంట్రోల్‌ చేయడం వల్ల తెలియకుండానే అతిగా లాగించేస్తాం అంటోంది. అదే దాన్నే అణిచివేసే బదులు..జంక్‌ ఫుడ్‌ తినాలనిపించిన వెంటనే ఫటాఫట్‌ తినేయండి. ఆ తర్వాత అందుకు తగ్గట్టు వర్కౌట్లు, లేదా కేలరీ తగ్గించుకునే ప్రయత్నం చేయండని అంటోందామె.

ప్రతిరోజు నడక..
ప్రతిరోజూ నడవడం వల్ల కొవ్వు కరుగుతుంది, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. పదివేల అడుగులు నడవాలని పెద్ద లక్ష్యాలు ఏమి అవసరం లేదు. కొన్ని రోజులు రెండు వేల అడుగులకుపైగా నడచేందుకు ప్రయత్నించండి చాలు. అది కూడా ఇష్టపూర్వకంగా చేయండని అంటోంది.

రాత్రిపూట కార్బోహైడ్రేట్లు వద్దు..
రాత్రి భోజనంలో అన్నం, రోటీకి బదులుగా గుడ్లు, పనీర్, పప్పు, చికెన్‌ తినమని ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌ సిఫార్సు చేస్తోంది. ఇలా చేయడం వల్ల ఉదయం చాలా హాయిగా మేల్కోగలుగుతారు.

నెమ్మదిగా తినండి
నెమ్మదిగా తినడం వల్ల మీ ప్రేగులు కడుపు నిండిన సంకేతాలను మెదడుకి అందిస్తాయి. తినడానికి  20-30 నిమిషాలు తీసుకోవడం ద్వారా జీవక్రియను సహజంగా మెరుగుపరుచుకోవచ్చు, ఆకలిని తగ్గించుకోవచ్చు. 

భోజనానికి ముందు నీళ్లు తాగండి..
భోజనానికి సుమారు 30 నిమిషాల ముందు నీళ్ళు తాగడం వల్ల, కడుపు నిండిన భావన పెరిగి, కేలరీల వినియోగం తగ్గి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఈ అలవాటు కడుపు నిండిన అనుభూతిని కలిగించి అతిగా తినడాన్ని నివారిస్తుంది.

తరుచుగా బరువు చెక్‌చేయొద్దు..
ప్రతిరోజూ బరువు చూసుకోవడం అనేది మిమ్మల్ని మరింత నిరాశపరుస్తుంటుంది. వారానికి ఒకసార లేదా అప్పుడప్పుడు చేస్తే మనసు ఉల్లాసంగా, హెల్దీగా ఉంటుంది.

వేళకు నిద్రపోవడం..
సరిగ్గా నిద్రపోకపోతే తినాలనే కోరికలు ఎక్కువ అవుతాయి. ఏడు గంటల నిద్ర అన్నింటిని మార్చేస్తుందని అంటోంది.

చీట్‌ మీల్‌ గురించి భయపడొద్దు..
కొందరు తినాలనిపించినవి తొనేసి మళ్లీ మొదటి నుంచి ప్రారంభిద్దాం అనే మైండ్‌సెట్‌తో ఉంటుంటారు. ముందు ఆ ధోరణిని తీసేయండి. తప్పులేదు. ఒక్కోసారి జిహ్వచాపల్యం నియంత్రించడం కష్టమవ్వచ్చు. అందుకని నచ్చినవి హాయిగా తినండి. 

కానీ తినే ముదు కాస్త మితం అనుకోండి, ఒక వేళ్ల ఫుల్‌గా లాగించినా..అందుకు తగ్గట్టుగా ఆరోజు కేలరీలు తగ్గించే పనిపట్టండని అంటోందామె. ఈ చక్కటి జీవనశైలి మార్పులు ఆరోగ్య లక్ష్యాలను అంచలంచెలుగా అందుకోవడానికి చక్కగా హెల్ప్‌ అవుతాయని అంటోంది. 

 

గమనిక: ఇదికేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 
 

Advertisement
 
Advertisement
Advertisement