సమ్మర్‌ ట్రిప్స్‌లో ఈ కిట్‌ తప్పనిసరి! | Planning A Summer Trip Follow These Travel Tips | Sakshi
Sakshi News home page

సమ్మర్‌ ట్రిప్స్‌లో ఈ కిట్‌ తప్పనిసరి!

May 11 2026 4:45 PM | Updated on May 11 2026 5:04 PM

Planning A Summer Trip Follow These Travel Tips

సమ్మర్‌ వెకేషన్స్‌ అంటే మన తెలుగు వాళ్లకు వెంటనే గుర్తుకు వచ్చేవి హిల్‌ స్టేషన్స్‌, జలపాతాలు, బీచ్‌ ట్రిప్స్, ఆలయాలు. కానీ ఎండలు ఎక్కువగా ఉన్న సీజన్‌ కాబట్టి చిన్ననాటి ఏమరపాటు అయినా మొత్తం ట్రిప్‌ను స్పాయిల్‌ చేసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా లాంగ్‌ డ్రైవ్స్, ట్రెక్కింగ్, ఫ్యామిలీ టూర్స్, పిల్లలతో ప్రయాణిస్తున్నప్పుడు ఎమర్జెన్సీ కిట్‌ అనేది తప్పనిసరి!

చాలా మంది బట్టలు, చార్జర్స్, కెమెరా ప్యాక్‌ చేస్తారు కానీ ఎమర్జెన్సీకి పనికొచ్చే వస్తువులు మర్చిపోతారు. కానీ మన జర్నీలో ఈ కిట్‌ ఒక సూపర్‌ హీరోలా అవసర సమయంలో ఆదుకుంటుంది అని చాలా మందికి తెలియదు. ప్రయాణంలో అనుకోని సమస్యలు వచ్చినప్పుడు ఉపయోగపడేందుకు మీ వద్ద ఈ కిట్‌ మెయింటేన్‌ చేయడం మరవకండి.

ఎమర్జెన్సీ కిట్‌లో ఏముండాలి?
ఈ ఎమర్జెన్సీ కిట్‌లో తప్పకుండా స్పేర్‌గా ఒక వాటర్‌ బాటిల్, కొన్ని ఓఆర్‌ఎస్‌ ΄్యాకెట్స్‌ ఉండాలి. ఎందుకంటే ఎండాకాలంలో డీహైడ్రేషన్‌ అనేది చాలా పెద్ద సమస్య. అందుకే రీయూజబుల్‌ బాటిల్‌తో ΄ాటు ఓఆర్‌ఎస్‌ ΄్యాకెట్స్‌ క్యారీ చేయండి.

బేసిక్‌ మెడిసిన్స్‌.. తలనొప్పి ట్యాబ్లెట్స్, ఫీవర్‌ మెడిసిన్, మోషన్‌ సిక్‌నెస్‌ ట్యాబ్లెట్స్, ఆసిడిటీ రెగ్యులేటర్‌ ట్యాబ్లెట్స్, బ్యాండ్‌ ఎయిడ్స్, యాంటిసెప్టిక్‌ క్రీమ్‌ తప్పకుండా ఉండాలి. పిల్లలతో వెళ్లేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం. ఇవన్నీ తీసుకున్నాక అవసరమైతే దగ్గర్లోని వైద్యుడిని సంప్రదించడం మరవకండి!

సన్‌స్క్రీన్, క్యాప్‌... మన తెలుగు రాష్ట్రాల్లో మే నెలలో ఎండల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్‌పీఎఫ్‌ సన్‌స్క్రీన్, సన్‌గ్లాసెస్, క్యాప్‌ లేకపోతే వేడికి చర్మం డ్యామేజ్‌ అయ్యే అవకాశం ఉంది. పవర్‌ బ్యాంక్‌ అండ్‌ టార్చ్‌ ... కొండప్రాంతాలు లేదా అటవీ ప్రాంతాలకు వెళ్తే చార్జింగ్‌ పేయింట్స్‌ లభించకపోవచ్చు. పవర్‌ బ్యాంక్, చిన్న టార్చ్‌ లైట్‌ చాలా ఉపయోగపడతాయి. 

మరీ ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఈ సమస్యలు సాధారణమే.వెట్‌ వైప్స్, శానిటైజర్‌... రోడ్‌ ట్రిప్స్‌లో హైజీన్‌ మెయింటేన్‌ చేయడానికి వెట్‌ వైప్స్‌ చాలా ఉపయోగపడతాయి. శానిటైజర్‌ మీ బ్యాగ్‌లో తప్పకుండా ఉండేలా చూసుకోండి.చిరుతిళ్లు ... బిస్కిట్స్, డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్‌ బార్స్‌ లాంటి స్నాక్స్‌ క్యారీ చేయడం మరవకండి. 

పిల్లలు ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ప్లాన్‌ చేయాల్సి ఉంటుంది. ఎండాకాలం రోడ్‌ ట్రిప్‌ అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమం. ఉదయం త్వరగా బయల్దేరి ఎండ పెరిగేలోపు ప్రయాణించండి. తరువాత సాయంత్రం సమయంలో ప్రయాణాన్ని కొనసాగించండి. ఇలా చేస్తే మీ ప్రయాణం మరింత కంఫర్టబుల్‌గా సాగుతుంది.  

(చదవండి: చిన్న నది.. పేద్ద కథ!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement