ప్రపంచాన్ని వణికించిన 10 భూకంపాలు | Sakshi
Sakshi News home page

ప్రపంచాన్ని వణికించిన 10 భూకంపాలు

Published Wed, Sep 13 2023 11:30 AM

Top 10 Worst Earthquakes in the World - Sakshi

భూకంపం.. నివారించడం సాధ్యం కాని పెనువిపత్తు. దీనికి జాగ్రత్త, అప్రమత్తత ఒక్కటే పరిష్కారం. ముందస్తుగా సన్నద్ధం కావడం వల్ల భూకంపాలు వంటి విపత్తుల వల్ల కలిగే వినాశనం నుంచి కొంత వరకు కాపాడుకోవచ్చు. ఆఫ్రికాలోని మొరాకోలో సెప్టెంబర్ 8వ తేదీ రాత్రి సంభవించిన విధ్వంసకర భూకంపం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. 

ఈ భూకంపం కారణంగా రెండు వేల మందికి పైగా ప్రజలు మరణించినట్లు నిర్ధారించారు. మొరాకో కంటే ముందుగా ప్రపంచంలోని అనేక దేశాలలో భూకంపాలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఇప్పుడు మనం ప్రపంచంలో సంభవించిన పది భారీ భూకంపాల గురించి తెలుసుకుందాం.

1. ప్రిన్స్ విలియం సౌండ్, అలాస్కా
1964, మార్చి 28న అమెరికాలోని అలాస్కాలో సంభవించిన భూకంప తీవ్రత 9.2గా అంచనా వేశారు. ఆ సమయంలో కెనడా సహా పరిసర ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు వచ్చాయి. ఆ సమయంలో భూమి సుమారు మూడు నిమిషాల పాటు కంపించింది. 250 మందికిపైగా ‍ప్రజలు మరణించగా, వేల మంది గల్లతయ్యారు. 

2. వాల్డివియా, చిలీ
1960, మే 22న చిలీలో సంభవించిన భూకంపం 1655 మందిని సమాధి చేసింది. సుమారు మూడు వేల మంది క్షతగాత్రులయ్యారు. భూకంపం కారణంగా దాదాపు రెండు లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. విపత్తు కారణంగా చిలీ సుమారు 550 అమెరికా మిలియన్‌ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. భూకంప తీవ్రత 9.5గా నమోదైంది.

3. గుజరాత్, భుజ్
2001లో భారతదేశంలోని గుజరాత్‌లోని భుజ్‌లో సంభవించిన భూకంప తీవ్రత 7.7గా అంచనా వేశారు. ఈ భూకంపం కారణంగా నగరం మొత్తం శిథిలాల కుప్పగా మారిపోయింది. కచ్, భుజ్‌లలో ముప్పై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భూకంపం కారణంగా 1.5 లక్షల మందికి పైగా ప్రజలు నష్టపోయారు.

4. పాకిస్తాన్, క్వెట్టా
2005, అక్టోబర్ 8న పాకిస్తాన్‌లోని క్వెట్టాలో సంభవించిన భూకంపంలొ 75 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 80 వేల మంది గాయపడ్డారు. ఈ భూకంప తీవ్రత 7.6గా నమోదైంది.

5. ఇండోనేషియా, సుమత్రా
2012 ఏప్రిల్ 11న ఇండోనేషియాలోని సుమత్రాలో సంభవించిన భూకంప తీవ్రత 8.6గా నమోదైంది. ఈ భూకంపం భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఈ భూకంపంలో 2,27,898 మంది మరణించారు.

6. జపాన్, ఫుకుషిమా
2011 మార్చి 11న జపాన్‌లోని ఫుకుషిమాలో సంభవించిన భూకంపంలొ 18 వేల మందికి పైగా మరణించారు. ఆ సమయంలో జపాన్ విపత్తులను ఎదుర్కొంటోంది. భూకంపం వచ్చిన వెంటనే జపాన్‌లో సునామీ సంభవించింది, ఇది కొన్ని మిలియన్ల ప్రజలను ప్రభావితం చేసింది.

7. ఫ్రాన్స్, హైతీ
2019 జనవరి 13న ఫ్రాన్స్‌లోని హైతీలో సంభవించిన భూకంప తీవ్రత 7.0గా నమోదయ్యింది. ఈ భూకంపంలో దాదాపు 3 లక్షల 16 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో భూకంపం కారణంగా 80 వేల భవనాలు ధ్వంసమయ్యాయి.

8. నేపాల్
2015, ఏప్రిల్ 25న సంభవించిన భూకంపం ఎనిమిది వేల మంది ప్రాణాలను బలిగొంది. భూకంప తీవ్రత 8.1గా నమోదయ్యింది. ఈ భూకంప ప్రకంపనలు భారతదేశం, దాని పొరుగు దేశాలలో కూడా కనిపించాయి.

9. దక్షిణ అమెరికా, చిలీ
1060 మే 22న చిలీలో బలమైన భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత 9.5గా నమోదైంది. ఇది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన భూకంపంగా పరిగణిస్తారు. ఈ ఘటనలో సుమారు ఎనిమిది లక్షల మంది మరణించారు.

10. దక్షిణ ఆఫ్రికా, మొరాకో
2023, సెప్టెంబరు 8న ఆఫ్రికాలోని మొరాకోలో సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని సమాచారం. అయితే ఈ గణాంకాలు ఇంకా పూర్తిగా స్పష్టం కాలేదు. 


ఇది కూడా చదవండి: తొలినాళ్లలో మనిషి ఏనుగులను తినేవాడా?

Advertisement
 
Advertisement