విమానాలు కుప్పకూలి ఏడుగురు మృతి | Seven Deceased Two Planes Collide In Alaska | Sakshi
Sakshi News home page

రెండు విమానాలు కుప్పకూలి ఏడుగురు మృతి

Published Sat, Aug 1 2020 9:55 AM | Last Updated on Sat, Aug 1 2020 10:39 AM

Seven Deceased Two Planes Collide In Alaska - Sakshi

అలస్కా: అమెరికాలోని అలస్కాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు విమానాలు ఢీకొని కుప్పకూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. అలాస్కాకు సమీపంగా కెనాయ్‌ ద్వీపకల్పంలోని సోల్డోట్నా నగరంలో ఉన్న విమానాశ్రయం వద్ద రెండు విమానాలు ఢీకొన్నట్లు అధికారులు తెలిపారు. వివరాలు.. అలస్కా ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేట్‌ రిపబ్లిక్‌ సభ్యుడు గ్యారీ నాప్‌ ఒక విమానంలో ఒంటరిగా ప్రయాణిస్తున్నారు. మరో విమానంలో దక్షిణ కెరొలిన నుంచి నలుగురు పర్యాటకులు, కాన్సాస్‌ నుంచి ఒక పర్యాటక గైడ్‌, సోల్డోట్నా నుంచి ఒక పైలప్‌ ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు.

రెండు విమానాలు సోల్డోట్నా నగరంలోని విమానాశ్రయం వద్ద ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ప్రమాదానికి గురైన విమానాల్లో ఒకటి హవిలాండ్‌ డీహెచ్‌సీ-2గా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిష్ట్రేషన్‌(ఎఫ్‌ఏఏ) గుర్తించింది. అదే విధంగా ఈ ప్రమాదంపై ఎఫ్‌ఏఏ, జాతీయా రవాణా భద్రతా బోర్డు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఘటనలో మృతి చెందిన గ్యారీ నాప్‌(67) రిపబ్లికన్‌, స్టేట్‌ హౌజ్‌లో సభ్యుడుగా కొనసాగుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement