Earthquake Of 7.2 Magnitude Near US Alaska, Tsunami Warning Issued - Sakshi
Sakshi News home page

Earthquake In US Alaska: 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Jul 16 2023 2:14 PM | Updated on Jul 16 2023 3:23 PM

Earthquake Near US Alaska Tsunami Warning Issued - Sakshi

అలస్కాను భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రత నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. దీంతో యూఎస్‌లోని పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. భూకంప తీవ్రత భూమిలోపల 9.3 కిలోమీటర్ల మేర సంభవించినట్లు పేర్కొన్నారు. 

అలస్కా  ద‍్వీపకల్పంతో సహా అలూటియన్ దీవులు, కుక్ ఇన్‌లెట్‌ ప్రాంతాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు. కాగా.. ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం ఇప్పుడే అంచనా వేయలేమని వెల్లడించారు. అలస్కా ప్రాంతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో భాగంగా ఉంది. తరచూ భూకంపాలకు నిలయంగా మారుతోంది. 

అలస్కాలో చివరిసారిగా అ‍త్యధికంగా 1964లో 9.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. అలస్కా ద్వీపకల్పం, యూఎస్ పశ్చిమ తీరం, హవాలీని సునామీ అతలాకుతలం చేసింది. 250 మందికి పైగా ప్రాణనష్టం జరిగింది.    

ఇదీ చదవండి: America PPP Fraud: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్‌కే షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement