Alaska F-35 jet crash: గింగిరాలు తిరుగుతూ కుప్పకూలిన ఫైటర్‌ జెట్‌ | US Air Force F-35 fighter jet crashed in Alaska runway | Sakshi
Sakshi News home page

గింగిరాలు తిరుగుతూ కుప్పకూలిన ఫైటర్‌ జెట్‌

Aug 28 2025 6:12 PM | Updated on Aug 28 2025 6:50 PM

US Air Force F-35 fighter jet crashed in Alaska runway

వాషింగ్టన్‌: అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. అమెరికా ఎయిర్‌పోర్స్‌ ఎఫ్‌-35 కూలింది. ఈదుర్ఘటనకు ముందు ఫైటర్‌ జెట్‌లో తలెత్తిన సాంకేతిక  కారణంగా ప్రమాదం తప్పించుకునేందుకు పైలెట్‌ తీవ్రంగా ప్రయత్నించారు. సుమారు 50 నిమిషాల పాటు గాల్లోనే చక్కెర్లు కొడుతూ ప్రమాదం నుంచి తప్పించునేందుకు టెక్నికల్‌ టీంతో కాన్ఫరెన్స్‌ కాల్‌ మాట్లాడారు.

అయినప్పటికీ సమస్య మరింత జఠిలం కావడంతో గింగిరాలు తిరుగుతూ దూసుకొచ్చిన పైటర్‌ జెట్‌ అలస్కా రన్‌వేపై కూలింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  
 


సీఎన్‌ఎన్‌ ప్రకారం.. జెట్‌ ముక్కు భాగం, మెయిన్‌ ల్యాండింగ్ గేర్‌ల హైడ్రాలిక్ లైన్లలో మంచు ఏర్పడింది. ఫలితంగా గేర్ల పనితీరు మందగించింది. టేకాఫ్ అయిన తర్వాత, సాధారణంగా ల్యాండింగ్ గేర్ (అంటే చక్రాలు) విమానలోకి రిట్రాక్ట్ చేస్తారు.. అంటే లోపలికి మడతపెట్టి దాచేస్తారు. ఇది విమానాన్ని గాలి ప్రవాహానికి తక్కువ ప్రతిఘటన కలిగించేలా చేస్తుంది. కానీ ఈ సందర్భంలో, పైలట్ ల్యాండింగ్ గేర్‌ను లోపలికి మడతపెట్టే ప్రయత్నం చేశాడు కానీ అది పనిచేయలేదు. ఫలితంగా ఈ ప్రమాదం సంభవించింది. 

మరోవైపు ఫైటర్‌ జెట్‌లో సాంకేతిక లోపం పరిష్కరించేందుకు అమెరికా ప్రభుత్వ డిఫెన్స్, ఏరోస్పేస్ కంపెనీ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్‌కు చెందిన చెందిన ఐదుగురు ఇంజినీర్లతో ఫ్లైట్‌లోనే వీడియో కాల్ చేసి, గంటకు పైగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశాడు. అనంతరం,రెండు సార్లు ల్యాండింగ్ ప్రయత్నాలు చేసినా ముక్కు గేర్ సరిగా సెట్ కాలేదు. ల్యాండింగ్ గేర్ పూర్తిగా ఫ్రీజ్ కావడంతో, పైలట్ విమానం నుంచి సురక్షితంగా దూకేశాడు.

ప్రమాదంపై జరిగిన విచారణలో ముక్కుభాగం కుడి ప్రధాన ల్యాండింగ్ గేర్‌ల హైడ్రాలిక్ ఫ్లూయిడ్‌లో మూడో వంతు నీరు ఉన్నట్లు తేలింది. ఇది హైడ్రాలిక్‌లో సమస్యకు దారి తీసింది. ఇదే బేస్‌లో తొమ్మిది రోజుల ముందు మరో విమానంలో ఇదే సమస్య తలెత్తింది. కానీ ఆ జెట్‌ సురక్షితంగా ల్యాండ్ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement