మాస్కో: ముగ్గురు సభ్యులతో కూడిన అమెరికా–రష్యా వ్యోమగాముల బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తమ ప్రయాణం మొదలెట్టి విజయవంతంగా పూర్తిచేసింది. షెడ్యూల్‌లో భాగంగా ఐఎస్‌ఎస్‌కు గురువారం నాసా వ్యోమగామి క్రిస్ విలియమ్స్, రష్యా క్రూమేట్స్ సెర్గీ మికాయెవ్, సెర్గీ కుద్‌స్వెర్చ్‌కోవ్ చేరుకున్నారు.
అంతకుముందు కజక్‌స్థాన్‌లోని బైకనూర్ ప్రయోగకేంద్రం నుంచి వ్యోమగాములతో కూడిన సోయూజ్ ఎంఎస్–28 వ్యోమనౌకను సోయూజ్ బూస్టర్ రాకెట్ స్థానిక కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 2.27 గంటలకు నింగిలోకి పంపించింది. ఐఎస్‌ఎస్‌లో ఈ ముగ్గురు ఎనిమిది నెలలపాటు గడపనున్నారు.


