ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది విద్యార్థుల మృతి | few Feared Dead In Assams Kaziranga As Traveller Vehicle Rams Into Container Truck | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది విద్యార్థుల మృతి

Nov 13 2026 4:45 PM | Updated on Nov 13 2026 4:51 PM

 few Feared Dead In Assams Kaziranga As Traveller Vehicle Rams Into Container Truck

అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలాఘాట్ జిల్లాలోని రంగాజన్ వద్ద జాతీయ రహదారి 27పై ప్రయాణికులతో వెళ్తున్న వాహనాన్ని కంటైనర్ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

కర్ణాటక రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉన్న కంటైనర్ ట్రక్కు ప్రయాణికుల వాహనాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదానికి గురైన ప్రయాణికుల వాహనంలో ఎక్కువ మంది కళాశాల విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కోహోరా ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 20 ఏళ్ల అతుల్ బోరా, 20 ఏళ్ల అరుణ్ కుమార్ ఉన్నట్లు గుర్తించారు. వీరిద్దరూ అదే ప్రాంతానికి చెందినవారని అధికారులు వెల్లడించారు.

ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతుల సంఖ్యపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. గాయపడిన వారికి అందుతున్న వైద్య సహాయం, ప్రమాదానికి గల కారణాలపై అధికారుల నుంచి తదుపరి సమాచారం వెలువడాల్సి ఉంది.

ఇదీ చదవండి: చంద్రబాబు సొంత జిల్లాలో విద్యార్థులు రోడ్డెక్కారు: కల్పలతారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement