Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Mla Kasu Mahesh Reddy Comments On Tdp Leaders Rigging
టీడీపీ రిగ్గింగ్‌.. పూర్తి వీడియో బయటపెట్టాలి: కాసు మహేష్‌రెడ్డి

సాక్షి, నరసరావుపేట: మాచర్లలో చాలా చోట్ల టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరని.. దీనిపై ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. పిన్నెల్లి తప్పు చేశారని టీడీపీ ప్రచారం చేస్తోంది. మొత్తం వీడియో బయటపెడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. ఒక్కటే వీడియో ఎందుకు రిలీజ్‌ చేశారు. రిగ్గింగ్‌ జరిగిందని చెప్తుంటే.. ఎందుకు వీడియో రిలీజ్‌ చేయడం లేదు?’’ అంటూ కాసు మహేష్‌రెడ్డి ప్రశ్నించారు.‘‘మాచర్లలో ఎవరు దాడి చేశారో ప్రజలందరికి తెలియాలి. మాచర్లలో అల్లర్లకు కారణం ఎవరు? టీడీపీ కాదా?. బీసీలు, ఎస్టీలు వైఎస్సార్‌సీపీకి ఓటేశారనే కారణంతో దాడులు చేశారు. అందరికీ చట్టపరమైన శిక్ష పడేవరకు పోరాడతాం. రిగ్గింగ్‌ జరిగిందని మేము చెబుతున్నాం.. మీరు ఎందుకు వీడియో బయటపెట్టడం లేదు?. ఎన్నికల అధికారులు ఆరోజు ఏమైందనేది మొత్తం వీడియో బయటపెట్టాలి. ఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు 2, 3 గంటల వీడియో బయటపెట్టాలి. మమ్మల్ని హౌస్‌ అరెస్ట్‌ చేసి టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేశారు’’ అని కాసు మహేష్‌ చెప్పారు.‘‘దాడులకు సంబంధించి ఈసీ పూర్తి వీడియోలు బయటపెట్టాలి. ఏడు చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగిందని ఈసీనే చెబుతోంది. మాచర్ల వీడియోను మాత్రమే బయటపెట్టారు. మిగిలిన వీడియోలను ఎందుకు బయటపెట్టడం లేదు. ఈసీ విశ్వసనీయత కోల్పోతుంది. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం’’ అని కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు.

Prabhas Nag Ashwin Kalki 2898 AD Bujji Look Revealed
ప్రభాస్‌- నాగ్‌ అశ్విన్‌ 'కల్కి 2898 ఏడీ'.. బుజ్జి లుక్ చూశారా?

యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్- నాగ్‌ అశ్విన్ ‍కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్‌‌ ‌ చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ సినిమాను వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌ , కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ను మేకర్స్ రివీల్‌ చేయనున్నారు.ఈ సినిమాలోని బుజ్జి పేరుతో ఉన్న కారును ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన భారీ ఈవెంట్‌లో బుజ్జి లుక్‌ను రివీల్‌ చేశారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభాస్‌ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సినిమాను జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Darlings... In life, you meet people for the first time only once. World, meet #Bujji...- https://t.co/8XhJordNtn#Kalki2898AD #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @BelikeBujji @saregamaglobal… pic.twitter.com/SvwwuXpzBa— Kalki 2898 AD (@Kalki2898AD) May 22, 2024

I think we were 20 runs short with the bat: Faf du Plessis:
అదే మా ఓటమిని శాసించింది.. లేదంటే విజయం మాదే: డుప్లెసిస్‌

ఐపీఎల్‌-2024లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కథ ముగిసింది. అహ్మదాబాద్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన ఎలిమేనిటర్‌లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి ఆర్సీబీ ఇంటిముఖం పట్టింది. వరుస మ్యాచ్‌ల్లో గెలిచి ఫ్లే ఆఫ్స్‌కు చేరిన బెంగళూరు.. ఎలిమినేటర్‌ రౌండ్‌ను దాటలేకపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్‌(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. విరాట్ కోహ్లి(33), మహిపాల్‌(32) పరుగులతో రాణించారు.అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. రాజస్తాన్‌ బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్‌(45) పరుగులతో అదరగొట్టగా.. రియాన్‌ పరాగ్‌(36), హెట్‌మైర్‌(26), పావెల్‌(16)పరుగులతో రాణించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్‌ అనంతరం ఆర్సీబీ కెప్టెన్‌ ఫాప్‌ డుప్లెసిస్‌ స్పందించాడు. బ్యాటింగ్‌లో మరింత మెరుగ్గా రాణించింటే ఫలితం మరో విధంగా ఉండేదని డుప్లెసిస్‌ తెలిపాడు."మేము తొలుత బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణించలేకపోయాం. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. అదనంగా 20 పరుగులు చేసి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. సాధరణంగా ఈ వికెట్‌పై 180 పరుగులు సాధిస్తే టార్గెట్‌ను డిఫెండ్‌ చేసుకోవచ్చు.ఎందుకంటే అహ్మదాబాద్‌ పిచ్‌ కాస్త స్లోగా ఉంది. మా బౌలర్లు అద్బుతంగా పోరాడారు. ఈ సీజన్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ ​మాకు పెద్దగా ఉపయోగపడలేదు. ఇక ఈ సీజన్‌లో మా జట్టు ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. పాయింట్ల పట్టకలో అట్టడుగు స్ధానం నుంచి ప్లే ఆఫ్స్‌కు రావడం నిజంగా గర్వించదగ్గ విషయం. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాం. కానీ దురదృష్టవశాత్తూ ఎలిమినేటర్ రౌండ్‌ను దాటలేకపో​యామని" పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో డుప్లెసిస్‌ పేర్కొన్నాడు.

Calcutta High Court Sensational Decision On Obc Reservations
మమత సర్కారుకు షాక్‌.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సర్కారుకు కలకత్తా హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం(మే22)న కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓబీసీ కోటాలోని పలు క్లాసులు చట్ట విరుద్ధమని పేర్కొంటూ కొట్టివేసింది. 2010 తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్‌లను రద్దు చేసింది.2012 పశ్చిమబెంగాల్‌ వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలో పేర్కొన్న 42 క్లాసులను కొట్టివేస్తున్నట్లు డివిజన్‌ బెంచ్‌ తెలిపింది. ఓబీసీ వర్గీకరణ చట్టవిరుద్ధంగా ఉందని స్పష్టంచేసింది.అయితే, ఈ తీర్పును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఇది కచ్చితంగా బీజేపీ కుట్రేనని ఆరోపించారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు ఎప్పటిలాగే అమలవుతాయన్నారు.

IPL 2024 Eliminator: Rajasthan Royals vs Royal challengers bangalore Live updates and Highlights
ఆర్సీబీ ఇంటికి.. ఎలిమేనిటర్‌లో రాజస్తాన్‌ ఘన విజయం

ఆర్సీబీ ఇంటికి.. ఎలిమేనిటర్‌లో రాజస్తాన్‌ ఘన విజయంఐపీఎల్‌-2024లో ఫైనల్‌ చేరేందుకు అడుగుదూరంలో రాజస్తాన్‌ రాయల్స్‌ నిలిచింది. అహ్మదాబాద్‌ వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన ఎలిమేనిటర్‌లో 4 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ ఘన విజయం సాధించింది. దీంతో క్వాలిఫయర్‌-2కు రాజస్తాన్‌ అర్హత సాధించగా.. ఆర్సీబీ ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్‌లో 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. రాజస్తాన్‌ బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్‌(45) పరుగులతో అదరగొట్టగా.. రియాన్‌ పరాగ్‌(36), హెట్‌మైర్‌(26), పావెల్‌(16)పరుగులతో రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్‌ రెండు వికెట్లు.. ఫెర్గూసన్‌, కరణ్‌ శర్మ, గ్రీన్‌ తలా వికెట్‌ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్‌(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. విరాట్ కోహ్లి(33), మహిపాల్‌(32) పరుగులతో రాణించారు. మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ వంటి కీల​క ఆటగాళ్లు నిరాశపరిచారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ రెండు, ట్రెంట్ బౌల్ట్,సందీప్ శర్మ, చాహల్ తలా వికెట్ సాధించారు. 13 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 111/313 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్‌ మూడు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. క్రీజులో రియాన్‌ పరాగ్‌(18), జురెల్‌(8) పరుగులతో ఉన్నారు.మూడో వికెట్‌ డౌన్‌..సంజూ శాంసన్‌ రూపంలో రాజస్తాన్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 17 పరుగులు చేసిన సంజూ.. కరణ్‌ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి జురెల్‌ వచ్చాడు. 11 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 98/3రెండో వికెట్‌ డౌన్‌..81 పరుగుల వద్ద రాజస్తాన్‌ రాయల్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 45 పరుగులు చేసిన యశస్వీ జైశ్వాల్‌.. గ్రీన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి పరాగ్‌ వచ్చాడు.దూకుడుగా ఆడుతున్న రాజ‌స్తాన్‌173 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజ‌స్తాన్ దూకుడుగా ఆడుతోంది. 8 ఓవ‌ర్లు ముగిసేస‌రికి వికెట్ న‌ష్టానికి 74 ప‌రుగులు చేసింది. క్రీజులో య‌శ‌స్వీ జైశ్వాల్‌(42), శాంస‌న్‌(11) ప‌రుగుల‌తో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన రాజ‌స్తాన్‌..173 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 20 ప‌రుగులు చేసిన కాడ్‌మోర్‌..ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 6 ఓవ‌ర్లు ముగిసేస‌రికి వికెట్ న‌ష్టానికి 47 ప‌రుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్‌(25), శాంస‌న్‌(1) ప‌రుగుల‌తో ఉన్నారు.రాణించిన ఆర్సీబీ బ్యాట‌ర్లు.. రాజ‌స్తాన్ టార్గెట్ ఎంతంటే?రాజస్తాన్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పర్వాలేదన్పించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్‌(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. విరాట్ కోహ్లి(33), మహిపాల్‌(32) పరుగులతో రాణించారు. మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ వంటి కీల​క ఆటగాళ్లు నిరాశపరిచారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ రెండు, ట్రెంట్ బౌల్ట్,సందీప్ శర్మ, చాహల్ తలా వికెట్ సాధించారు.ఐదో వికెట్ డౌన్‌.. పాటిదార్ ఔట్‌122 ప‌రుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 34 ప‌రుగులు చేసిన ర‌జిత్ పాటిదార్‌.. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి దినేష్ కార్తీక్ వ‌చ్చాడు.కష్టాల్లో ఆర్సీబీ.. మాక్స్‌వెల్‌ డకౌట్‌బెంగళూరు మరో వికెట్‌ కోల్పోయింది. 97 పరుగుల వద్ద వరుస బంతుల్లో కెమెరూన్‌ గ్రీన్(27), మాక్స్‌వెల్‌(0) డకౌటయ్యాడు. దీంతో ఆర్సీబీ 12.4 ఓవర్లలో 97/4 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ అవుట్బెంగళూరుకు షాక్ తగిలింది. విరాట్‌ కోహ్లీ (33) పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. యుజ్వేందర్‌ చాహల్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ 8 ఓవర్లకు 58/2 పరుగులతో ఉంది.పవర్‌ ప్లేలో తగ్గిన దూకుడుపవర్‌ ప్లే ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ(30), కెమెరూన్ గ్రీన్‌ (1) ఉన్నారు.తొలి వికెట్ డౌన్‌..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 17 ప‌రుగులు చేసిన ఫాప్ డుప్లెసిస్‌.. బౌల్ట్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 5 ఓవ‌ర్లు ముగిసేస‌రికి వికెట్ న‌ష్టానికి 37 ప‌రుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(18), గ్రీన్‌(0) ప‌రుగుల‌తో ఉన్నారు.నిల‌క‌డ‌గా ఆడుతున్న ఆర్సీబీ..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిల‌క‌డ‌గా ఆడుతోంది. 4 ఓవ‌ర్లు ముగిసేస‌రికి వికెట్ న‌ష్ట‌పోకుండా 34 ప‌రుగులు చేసింది. క్రీజులో ఫాప్ డుప్లెసిస్‌(18), విరాట్ కోహ్లి(16) ప‌రుగుల‌తో ఉన్నారు.ఐపీఎల్‌-2024లో ఎలిమినేట‌ర్ పోరుకు రంగం సిద్ద‌మైంది. అహ్మ‌దాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న ఎలిమినేట‌ర్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజ‌స్తాన్‌ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఎటువంటి మార్పులు లేకుండా బ‌రిలోకి దిగ‌గా.. రాజ‌స్తాన్ ఓ మార్పు చేసింది. హెట్‌మైర్ తుది జ‌ట్టులోకి వ‌చ్చాడు.రాజ‌స్తాన్ అత‌డిని ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా ఉప‌యోగించ‌నుంది.తుది జ‌ట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీప‌ర్‌), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, యశ్ దయాల్, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

ktr Comments At Warangal Graduate Mlc Campaign Meeting
తీన్మార్‌మల్లన్నపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్‌

సాక్షి,వరంగల్‌: మహిళల మెడలో తాళిబొట్టు కొట్టేసే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని కేటీఆర్‌ విమర్శించారు. వరంగల్‌లో బుధవారం(మే22) జరిగిన వరంగల్‌, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులు ఉప ఎన్నిక ప్రచార సభలో కేటీఆర్‌ మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలైనవి.మంగళవారం ఎంజీఎం ఆసుపత్రిలో 5గంటల విద్యుత్ నిలిపోయింది. రూ.2లక్షల రుణమాఫీ కాలేదు. రైతులకు రైతుబంధు రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. వరికి రూ. 500 బోనస్ దక్కలేదు. రాష్ట్రంలో మోసాల పరంపర సాగుతోంది. కాంగ్రెస్ నాయకులు పచ్చి మోసగాళ్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలంటే... పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాకేష్‌రెడ్డిని గెలిపించాలి.420 హామీలతో అధికారంలోకి వచ్చారు. కొత్త పరిశ్రమలను తీసుకువచ్చే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు. ఉన్న కంపెనీలను కాపాడుకునే సత్తా లేని నాయకులు కాంగ్రెస్ నాయకులు. తీన్మార్ మల్లన్న లాంటి నాయకులు గెలిస్తే చట్టసభలు బూతు మాటలకు వేదిక అవుతుంది’అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

AP Police Who Favour TDP Tension With SIT Report
సిట్‌ నివేదిక: టీడీపీకి కొమ్ముకాసిన అధికారుల్లో టెన్షన్‌

సిట్ ప్రాధమిక నివేదికపై కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు ఎలా ఉంటాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల వెనుక పోలీసు వైఫల్యాన్ని సిట్ బట్టబయలు చేసింది. విధి నిర్వహణలో కొందరు పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సిట్ తన ప్రాధమిక నివేదికలో పేర్కొంది. ఈ నేపధ్యంలో సిట్ నివేదిక ఆధారంగా పోలీసులపైనా కేసులు నమోదు చేసి విచారణ జరపాలని ఎన్నికల సంఘం ఆదేశించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నికల అనంతర ఘర్షణలపై సిట్ ప్రాధమిక నివేదిక.. ఇపుడు పోలీసుల మెడకు చుట్టుకోబోతోంది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్ రెండు రోజుల పాటు విచారణ జరిపి డీజీపీ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రాధమిక నివేదిక పంపారు. ఈ మూడు జిల్లాలలో 33 ప్రధాన సంఘటనలపై క్షేత్రస్ధాయిలో విచారణ జరిపారు. పల్నాడు జిల్లాలోని గురజాల, నరసారావుపేట, మాచర్ల నియోజకవర్గాలలో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక పోలీసు అధికారుల వైఫల్యాన్ని సిట్ గుర్తించింది. ముఖ్యంగా నరసారావుపేట, మాచర్ల నియోజకవర్గాలలోని 18 కేసులలో 474 మంది నిందితులుంటే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడాన్ని సిట్ తీవ్రంగా పరిగణించింది. ఇందులో 307 మంది నిందితులను గుర్తించాల్సి ఉందని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారుల స్టేట్ మెంట్ ని కూడా సిట్ సీరియస్ గా తీసుకుంది. ఇక తాడిపత్రిలో ఏకంగా పోలీసులు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి సీసీ కెమెరాలను ద్వంసం చేయడం వెనుక కారణాలను సిట్ విశ్లేసించింది. ఈ మూడు జిల్లాలలో జరిగిన 33 హింసాత్మక ఘటనల్లో దాదాపు 1370 మంది నిందితులుంటే కేవలం 124 మందినే అరెస్ట్ చేయడంపై పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని సిట్ అభిప్రాయపడింది. ఇదే సమయంలో పల్నాడు లాంటి జిల్లాలలో కొందరు పోలీసు అధికారులు టీడీపీ నేతల దగ్గర లంచాలు తీసుకుని తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాశారని.. కొన్ని చోట్ల పోలింగ్ బూత్ లలో ఓటర్లని రానివ్వకుండా టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని వైఎస్సార్సీపీ ఇప్పటికే ఈసీకి, డీజీపీ, సిట్ కు కూడా ఫిర్యాదులు చేసింది. పల్నాడు జిల్లాలోని మాచవరం మండలం కొత్తగణేషునిపాడులో ఎస్సీ, ఎస్టీలపై ఎన్నికల తర్వాత టీడీపీ నేతలు దాడులు చేయడంతో వారంతా ఊళ్లు వదిలి వెళ్లిపోయారు. ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో కూడా మైనార్టీలు టీడీపీ దాడులతో గ్రామం విడిచి కుటుంబాలతో సహా వెళ్లిపోయారు. ఇంత జరిగినా ఆయా గ్రామాలలో జరిగిన ఘటనలపై పోలీసులు పూర్తిస్ధాయిలో కేసులు నమోదు చేయలేదు. అరెస్ట్ లు కూడా చేయలేదు. పైగా టీడీపీ దాడులతో భీతిల్లి గ్రామాలు విడిచివెళ్లిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలైన ఆ బాదితులపైనే పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని సిట్ గుర్తించింది. మరోవైపు నరసారావుపేట టీడీపీ అభ్యర్ధి చదలవాడ అరవిందబాబు పోలింగ్ రోజు ఇతర ప్రాంతాల నుంచి గూండాలని రప్పించి వైఎస్సార్సీపీ అభ్యర్ధి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై దాడులు చేయడం, అక్కడున్న కార్లపై కర్రలు, రాళ్ల దాడిచేయడం, ఇంటిని ద్వంస చేసారు.అడ్డుకునే ప్రయత్నం చేసిన గోపిరెడ్డి మామ కంజుల కోటిరెడ్డిపైనా హత్యాయత్నానికి పాల్పడ్డారు.ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు టీడీపీ అభ్యర్ధి అరవిందబాబుని అరెస్ట్ చేయలేదు. పోలింగ్ తర్వాత పెట్రో బాంబులు, రాడ్లు, కర్రలు, గాజుసీసాలు వంటి మారణాయుదాలతో టీడీపీ నేతలు దొరికినా కూడా పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని పోలీసులని సిట్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.ఈ నేపధ్యంలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలలో పోలీసులు దర్యాప్తు సరిగ్గా చేయలేదని సిట్ ప్రాధమిక నివేదికలో పేర్కొంది. సీరియస్ ఘటనలలో సైతం కొందరు పోలీసులు తూతూ మంత్రంగా దర్యాప్తు చేసి బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేశారని...కోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్షన్లు నమోదు చేయాలని సిట్ ప్రాధమిక నివేదికలో పేర్కొంది.రాళ్లు, కర్రలు, పెట్రో బాంబులు వంటి వాటితో దాడుల జరగాలంటే ముందుగానే వాటిని సేకరించి ఉంటారని...ఇందుకోసం ముందస్తుగానే ప్రిపేర్ అయ్యారని..ప్రీ ప్లాన్ గానే ఈ దాడులు జరిగాయని సిట్ భావించింది. ఈ ఘటనలలో పోలీసుల వైఫల్యాలని సిట్ సీరియస్ గానే తీసుకున్నట్లు కన్పిస్తోంది.వైఎస్సార్‌సీపీ ఆరోపణలకి తగ్గట్లుగా పోలీసులు టీడీపీకి కొమ్ముకాయడాన్ని సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత జరిగిన ఘటనలపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్, పల్నాడు ఎస్పీ బిందుమాధవ్ తో పాటు సంఘటనలు జరిగిన మూడు జిల్లాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 12 మంది పోలీసులని సస్పెన్షన్ చేయడంతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇద్దరు ఎస్పీలతో పాటు 12 మంది పోలీసు అధికారులకు 15 రోజులలో సమాధానం ఇవ్వాలని నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో పాటు శాఖాపరంగానూ విచారణ ప్రారంభం కానుంది.మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘానికి సిట్ ప్రాధమిక నివేదిక చేరడంతో తదుపరి చర్యలు ఎలా ఉంటాయోనని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల రోజు.. ఆ తర్వాత ఘటన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే ఇప్పటకే ప్రాధమిక చర్యలు తీసుకోవడంతో సిట్ పూర్తి స్ధాయి నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయనే మరో వాదన కూడా ఉంది. రెండు రోజుల పాటు విచారణ జరిపి ప్రాథమిక నివేదిక ఇచ్చిన సిట్ ఇపుడు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది. సిట్ ఆదేశాల మేరకు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఇప్పటికే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆయా జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. ఈ నేపధ్యంలో ఇంకా అరెస్ట్ కాకుండా ఉన్న దాదాపు 1,200 మందికి పైగా నిందితులకు సంకెళ్లు వేసే పనిలో పోలీసులు పడ్డారు. నిందితుల అరెస్ట్ తో పాటు దర్యాప్తు కూడా వేగవంతంగా కొనసాగాల్సి ఉండటంతో ప్రస్తుతానికి ఈసి కూడా సిట్ పూర్తిస్ధాయి నివేదిక కోసం వేచిచూడవచ్చంటున్నారు.ఒకవేళ ప్రాధమిక నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకోవాలని భావిస్తే మాత్రం సస్పెండ్ అయిన ఇద్దరు ఎస్పీలు, 12 మంది పోలీసు అధికారులతో కొందరిపై కేసులు నమోదుకు ఆదేశించవచ్చంటున్నారు.కేసులు నిరూపణ జరిగితే సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం లేదా జైలు శిక్ష లేదంటే రిటైర్ తర్వాత పెన్షన్ రాని పరిస్ధితులు ఉంటాయని చెబుతున్నారు. అదే జరిగితే పోలీసులపై కేసు సంచలనంగా మారే అవకాశాలున్నాయి. మొత్తంగా టీడీపీకి కొమ్ముకాసిన పోలీసులకి ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో కంటిమీద కునుకు లేకుండా పోయింది.

Ap Elections 2024 May 22nd Political Updates Telugu
May 22nd: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 22nd AP Elections 2024 News Political Updates..7:23 PM, May 22nd, 2024టీడీపీ రిగ్గింగ్‌.. పూర్తి వీడియో బయటపెట్టాలి: కాసు మహేష్‌రెడ్డిమాచర్లలో చాలా చోట్ల టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేశారుపిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరని.. దీనిపై ఎంతవరకైనా పోరాటం చేస్తాంపిన్నెల్లి తప్పు చేశారని టీడీపీ ప్రచారం చేస్తోందిమొత్తం వీడియో బయటపెడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి.ఒక్కటే వీడియో ఎందుకు రిలీజ్‌ చేశారు?రిగ్గింగ్‌ జరిగిందని చెప్తుంటే... ఎందుకు వీడియో రిలీజ్‌ చేయడం లేదు?మాచర్లలో ఎవరు దాడి చేశారో ప్రజలందరికి తెలియాలిమాచర్లలో అల్లర్లకు కారణం ఎవరు? టీడీపీ కాదా?బీసీలు, ఎస్టీలు వైఎస్సార్‌సీపీకి ఓటేశారనే కారణంతో దాడులు చేశారుఅందరికీ చట్టపరమైన శిక్ష పడేవరకు పోరాడతాంరిగ్గింగ్‌ జరిగిందని మేము చెబుతున్నాం.. మీరు ఎందుకు వీడియో బయటపెట్టడం లేదు?ఎన్నికల అధికారులు ఆరోజు ఏమైందనేది మొత్తం వీడియో బయటపెట్టాలిఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు 2, 3 గంటల వీడియో బయటపెట్టాలిమమ్మల్ని హౌస్‌ అరెస్ట్‌ చేసి టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేశారుదాడులకు సంబంధించి ఈసీ పూర్తి వీడియోలు బయటపెట్టాలిఏడు చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగిందని ఈసీనే చెబుతోందిమాచర్ల వీడియోను మాత్రమే బయటపెట్టారుమిగిలిన వీడియోలను ఎందుకు బయటపెట్టడం లేదుఈసీ విశ్వసనీయత కోల్పోతుంది. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం 5:08 PM, May 22nd, 2024మాచర్ల నియోజకవర్గంలో అరాచకాలు చేసింది టీడీపీ నేతలేమాచర్లలో టీడీపీ నేతల రిగ్గింగ్‌ఒక్కొక్కటిగా బయటపడుతున్న వీడియోలువైఎస్సార్‌సీపీ మద్దతుదారులను ఓటు వేయనివ్వకుండా అడ్డుకున్న టీడీపీ మూకలురెంటచింతల మండలం పాల్వాయి గేటులోని 201, 202 పోలింగ్‌ బూత్‌లో టీడీపీ రిగ్గింగ్‌టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నా పట్టించుకోని ఎన్నికల అధికారులుఓటర్లను ఓటు వేయనివ్వని టీడీపీ నేతలుఓటర్లు బూత్‌ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాడులకు తెగబడ్డ టీడీపీ నేతలుటీడీపీ నేతల రిగ్గింగ్‌పై పోలీసులు, ఎన్నికల అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదులుఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు4:56 PM, May 22nd, 2024ఓటర్లకు టీడీపీ డబ్బులు పంపిణీపై ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుడబ్బుతో ఓట్లు కొనుగోలు చేసిన టీడీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదుఅంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గం టీడీపీ అభ్యర్థి ఓట్లను కొనుగోలు చేసేందుకు డబ్బులు పంచారుఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కి విరుద్ధంఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు2:00 PM, May 22nd, 2024ఈవీఎంల ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు రిమాండ్‌ఈవీఎం ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు కోర్టు రిమాండ్‌ విధించింది. నలుగురు టీడీపీ నేతలకు 14 రోజులు రిమాండ్‌ విధిస్తూ బుధవారం కోర్టు ఆదేశం.ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. తుమృకోటలోని 203, 204, 205, 206 పోలింగ్‌ బూత్‌ల్లోని ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. టీడీపీ నేతలు వెంకట సతీష్‌, కోటయ్య, సైదులు, మహేష్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే, మరో 50 మంది టీడీపీ కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు కొంతమంది టీడీపీ నేతలు, కార్యకర్తలు అరెస్ట్‌ భయంతో పరారయ్యారు. 1:30 PM, May 22nd, 2024సిట్ ప్రాధమిక నివేదికపై ఈసీ తదుపరి చర్యలేంటి?తప్పుచేసిన పోలీసులపై కేసులు నమోదవుతాయాఇప్పటికే ఇద్దరు ఎస్పీలు...12 మంది పోలీసు అధికారుల సస్పెన్షన్శాఖాపరమైన విచారణకు ఆదేశంసిట్ నివేదికలో బట్టబయలైన పోలీసుల వైఫల్యంకొందరు పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సిట్ నివేదికనిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై కేసుల నమోదుకు ఈసి ఆదేశించే అవకాశంసిట్ పూర్తిస్ధాయి నివేదిక వరకు ఈసి వేచిచూస్తుందా 1:00 PM, May 22nd, 2024ఈసీ ఇచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం: ముఖేష్ కుమార్ మీనావిజయవాడసీఈఓ ముఖేష్ కుమార్ మీనా కామెంట్స్‌ఈవీఎం ధ్వంసం కేసులో కోర్టులో మెమో దాఖలు చేశాంవీడియో బయటకు రాక ముందే కేసు విచారణ సాగుతుందిఎమ్మెల్యేను అరెస్ట్ చేసి ఈరోజు సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాంఈవీఎంలో డేటా భద్రంగానే ఉందిఓటు వేసిన వారి డేటా కంట్రోల్ యూనిట్‌లో భద్రంగానే ఉన్నాయిసిట్ నివేదిక ను ఎన్నికల కమిషన్ కి పంపాముఈసీ ఇచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం 12:00 PM, May 22nd, 2024ఓటమి దిశగా పవన్‌..!జడ్పీ చైర్మన్‌, ఎంపీ, ఎమ్మెల్యేగా కాకినాడ జిల్లాను అభివృద్ధి చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వంగా గీత.ఎప్పుడూ ప్రజల మధ్యే వంగా గీత. అందుబాటులో ఉండని పవన్‌. రాజకీయాల్లో, ప్రజాదరణలో వంగా గీతకు ఏమాత్రం సరితూగని పవన్‌. వంగా గీతకే పట్టం కట్టిన పిఠాపురం ప్రజలు. 11:30 AM, May 22nd, 2024ఓటమి అంచున్న పురంధేశ్వరి! ఎన్నికల్లో ఓటమి అంచున నిలుచున్న ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి. రాజమండ్రి గురించి ఏ మాత్రం తెలియకుండానే అక్కడి నుంచి పోటీ. ఇక, సీటు ఆశించి భంగపడిన సోము వీర్రాజుతో పురంధేశ్వరికి కుదరని సయోధ్య. 11:00 AM, May 22nd, 2024బాబు, పవన్‌ హైదరాబాద్‌కే పరిమితం..పవన్‌ కేవలం సినిమాలకే పరిమితమంటున్న సామాన్యులు. చంద్రబాబు, దత్తపుత్రుడు హైదరాబాద్‌కే పరిమితమంటున్న సామాన్య ప్రజలు. జూన్ 4న వైయస్‌ఆర్‌సీపీ జెండా సగర్వంగా ఎగురుతుంది.. చంద్రబాబు, దత్తపుత్రుడు హైదరాబాద్‌కే పరిమితం అవ్వడం ఖాయం.#YSRCPWinningBig#TDPJSPBJPCollapse#TDPLosing pic.twitter.com/RwItBFPTqb— YSR Congress Party (@YSRCParty) May 22, 2024 10:30 AM, May 22nd, 2024గన్నవరంలో పచ్చ బ్యాచ్‌ హల్‌చల్‌కృష్ణా జిల్లా..గన్నవరంలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌ఇద్దరు యువకులపై దాడి చేసిన టీడీపీ సానుభూతిపరులుఐదుగురు టీడీపీ వ్యక్తులున్నట్టు సమాచారంపచ్చ బ్యాచ్‌ దాడిలో యువకులకు తీవ్రగాయాలు బాధితుల ఫిర్యాదు విచారణ చేపట్టిన పోలీసులు. 8:30 AM, May 22nd, 2024ఎన్నికల కౌంటింగ్‌పై పోలీసుల ఫోకస్‌.. విజయవాడసార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియపై పోలీసులు ప్రత్యేక దృష్టిపోలింగ్ అనంతరం జరిగిన పరిమాల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుకౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల రక్షణ వలయం సిద్ధం చేస్తున్న పోలీసులుకలెక్టర్లు, రిటర్నింగ్‌ అధికారులు, మ్యాన్‌పవర్‌ మేనేజ్‌మెంట్‌, మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌, నోడల్‌ అధికారులు, ఎన్‌ఐసీ, ఎన్‌కోర్‌ టీమ్‌ అధికారులతో సమావేశాలుకౌంటింగ్‌ విధులకు హాజరయ్యే ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు, కౌన్సెలింగ్ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పగడ్బందీగా బారికేడింగ్‌ పనులుకౌంటింగ్ రోజున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలుఏపీ పోలీసులతో పాటు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్న సిఆర్పిఎఫ్, పారా మిలటరీ బలగాలు 7:20 AM, May 22nd, 2024గొడవలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధం: ఎమ్మెల్యే పిన్నెల్లిపల్నాడులో టీడీపీ గెలిచే పరిస్థితి లేదు. అందుకే అందర్నీ తప్పుదోవ పట్టించేలా టీడీపీ నేతలు గొడవలు చేశారు. పోలింగ్‌ రోజు నుంచి జరిగిన గొడవలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు నేను సిద్ధంఅనవసరంగా అసత్య ప్రచారం చేస్తున్నారు. పల్నాడులో వాళ్లు గెలిచే పరిస్థితి లేకపోవడంతో అందర్నీ తప్పుదోవ పట్టించేలా టీడీపీ వాళ్లు గొడవలు చేశారు. పోలింగ్ రోజు నుంచి జరిగిన గొడవలపై సిట్టింగ్ జడ్జితో విచారణకి నేను సిద్ధం.-ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి#YSRCPWinningBig#TDPLosing pic.twitter.com/cgi2SMXSmR— YSR Congress Party (@YSRCParty) May 21, 2024 7:00 AM, May 22nd, 2024ఓట్ల లెక్కింపు రోజు విధ్వంసానికి పచ్చ ముఠాల ప్లాన్‌పోలింగ్‌ రోజు హింసకు మించి భయోత్పాతం సృష్టించే పన్నాగంకుట్రలపై పోలీసు శాఖను అప్రమత్తం చేసిన నిఘావర్గాలురాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలుఆ 3 జిల్లాలపై ప్రత్యేకంగా కన్నుగూండాలను అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు.. అంతా టీడీపీ మూకలేస్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతరెడ్‌జోన్ల ఏర్పాటు.. నిషేధాజ్ఞలు విధింపు.. డ్రోన్‌ కెమెరాల వినియోగం నిషిద్ధం 6:55 AM, May 22nd, 2024సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధంజూలకంటి బ్రహ్మారెడ్డిది నీచ సంస్కృతిటీడీపీ అనుకూల గ్రామాల్లో మా ఏజెంట్లపై దాడిఆ గ్రామాల్లోనే అలజడి సృష్టించారుపారిపోయి నియోజకవర్గానికి దూరంగా ఉండేది బ్రహ్మారెడ్డినేను ఎక్కడికి పారిపోలేదు... ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే పోలీసుల సూచన మేరకు హైదరాబాద్‌ వచ్చా ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 6:45 AM, May 22nd, 2024పవన్‌ ఎక్కడ?పవన్‌ పర్యటనపైనా రాజకీయ వర్గాల్లో చర్చ14న ప్రధాని మోదీ నామినేషన్‌కు పవన్‌ హాజరుఅక్కడి నుంచి హైదరాబాద్‌ రాకఆ తర్వాత ఎవరికీ అందుబాటులో లేని పవన్‌రష్యా లేదా దుబాయ్‌ వెళ్లి ఉంటారంటున్న పార్టీ వర్గాలు 6:40 AM, May 22nd, 2024సోమిరెడ్డికి, టీడీపీ వాళ్లకు సవాల్‌ చేస్తున్నా: మంత్రి కాకాణిబ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా ?నెల్లూరు లో ఎక్కడికి రావాలో చెప్తే అక్కడికి వస్తాఎవరికి రేవ్ పార్టీకి వెళ్లే అలవాటు ఉందో తెలుస్తుందిఆధారాలు ఉంటే సోమిరెడ్డి పోలీసులకు ఇవ్వాలిబెంగళూరు రేవ్ పార్టీపైసీబీఐ దర్యాప్తుకు నేను సిద్ధంగా ఉన్నాబ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా.. ? పాస్ పోర్ట్ చూపించడానికి వస్తావా ?రేవ్ పార్టీలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉన్నారని సోషల్ మీడియాలో వస్తుంది..బెంగళూరు పోలీసులు ఎటువంటి కాల్ చేయలేదురేవ్ పార్టీ జరిగిన ఫార్మ్ హౌస్ గోపాల్ రెడ్డి ఎవరో నాకు తెలియదుపాసు పోర్ట్ నా దగ్గరే ఉందికుట్ర కోణం పై విచారణ చేయాలని పోలీసులను కోరానురోస్ ల్యాండ్ లాడ్జిలో చంద్రమోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికారుసోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లోఫర్బెంగళూరు రేవ్ పార్టీ విషయంలో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారునాకు సంబంధాలు ఉన్నా.. నాకు సంబధించిన వారు ఎవరు ఉన్నా చర్యలు తీసుకోవాలిఎవడో అనామకుడు నా స్టిక్కర్‌ను జిరాక్స్ తీసి వాడుకున్నారురేవ్ పార్టీలు, రేప్ పార్టీలు చేసే చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిదిసోమిరెడ్డి లేడీ డాక్టర్ ను ఇబ్బంది పెట్టిన కథనాలు గతంలో పత్రికల్లో వచ్చాయినాపై మూడోసారి కూడా సోమిరెడ్డి ఓడిపోతున్నారు.. ఆ ప్రెస్టేషన్ లో ఏదో మాట్లాడుతున్నారుయూత్ మినిస్టర్ గా ఉండి.. క్రికెట్ కిట్స్ అమ్ముకున్న చరిత్ర సోమిరెడ్డిదినా పాస్ పోర్ట్ నెల్లూరు లో ఉందికారు స్టిక్కర్ జిరాక్స్ చేసి నాపై కుట్ర చేసినట్లు అనుమానాలు ఉన్నాయి.. కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశా 6:30 AM, May 22nd, 2024ఎల్లో మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికెళ్లారు?: మంత్రి జోగి రమేష్‌దోచినడబ్బంతా దుబాయ్‌లో దాచడానికి వెళ్లారా?చంద్రబాబు కనిపించకుండా పోతే టీడీపీ అడ్రస్‌ గల్లంతుటీడీపీ నాయకులు నోటికి తాళాలు పడ్డాయి.కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారుఎస్పీలను, కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయిచంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా.. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయంచంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టించారువైఎస్సార్‌సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలిపల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే.

TDP Silence Over Chandrababu Foreign Tour
టీడీపీ సైలెన్స్‌.. దేనికి సంకేతం?

ఎన్టీఆర్‌, సాక్షి: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడ?. విదేశీ పర్యటన పేరుతో ఆయన ఎ‍క్కడికి వెళ్లారసలు?. ఎన్నికల ఫలితాల వేళ ఉన్నపళంగా ఎక్కడికి వెళ్లారు?. ఏపీ రాజకీయ వర్గాల్లో.. ఆఖరికి టీడీపీ శ్రేణుల్లోనూ దీనిపైనే చర్చ నడుస్తోంది.నారా చంద్రబాబు నాయుడు.. విదేశీ యాత్రకు విశ్రాంతి కోసం వెళ్లారు!. కాదు కాదు.. 74 ఏళ్ల చంద్రబాబు వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లారు. ఎన్నికల ఫలితాల ముందర కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకే ఆయన విదేశాలకు వెళ్లారు. ఇలా.. ఎవరికి తోచిన ప్రకటనలు వాళ్లు చేస్తున్నారే తప్ప ఆయన ఎక్కడికి వెళ్లారు అనేదానిపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఆఖరికి ఆయన పార్టీ కూడా!. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత విదేశీ పర్యటన కోసం హైదరాబాద్‌ నుంచి తొలుత దుబాయ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు అనేదానిపై గోప్యతను ప్రదర్శిస్తోంది తెలుగు దేశం పార్టీ. ఇక.. చంద్రబాబు ఏం చేసినా బాకా ఊదే ఎల్లో పత్రికలు సైతం ఆయన ఫారిన్‌ టూర్‌పై వేర్వేరు కథనాలు ఇవ్వడం గమనార్హం. చంద్రబాబు పర్యటనకు వెళ్లే ముందే ఆయన తనయుడు నారా లోకేష్‌ విదేశాలకు వెళ్లారు. ఆయన కూడా ఎక్కడికి వెళ్లారనేదానిపై స్పష్టత కొరవడింది. ఇక చంద్రబాబు విశ్రాంతి కోసం అమెరికా వెళ్తున్నారంటూ లీకులు ఇచ్చాయి టీడీపీ శ్రేణులు. అయితే.. చంద్రబాబు అసలు అమెరికాకే రాలేదంటూ టీడీపీ ఎన్నారై నేత కోమటి జయరాం ప్రకటన చేయడంతో ఒక్కసారిగా గాలి తీసేసినట్లయ్యింది.చెప్పాల్సిన అవసరం ఉందిఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష ప్రధాన నేతలుగా బాధ్యతాయుతమైన పదవుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి,నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. వాళ్లిద్దరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పార్టీలు ప్రకటనలు చేస్తుంటాయి. అలాగే ఏ పర్యటనలకు వెళ్లినా.. అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం ఆ పార్టీల బాధ్యత కూడా. అందుకే వైఎస్సార్‌సీపీ సీఎం జగన్‌ కుటుంబ సమేతంగా లండన్‌ పర్యటనకు వెళ్లగానే.. అక్కడ ల్యాండ్‌ అయిన దృశ్యాలను మీడియా, సోషల్‌ మీడియా మాధ్యమంగా విడుదల చేసింది. మరి ఇదే పని చంద్రబాబు విషయంలో టీడీపీ ఎందుకు చేయలేకపోతోంది. సాధారణంగానే చంద్రబాబు విదేశీ పర్యటనను ఏదో రాష్ట్రానికి ఉద్దరించే పనిగా చూపించే ఎల్లో మీడియా.. ఈసారి ఆ బిల్డప్‌లను ఎందుకు ఇవ్వలేకపోతోంది. ఈ లెక్కన.. చంద్రబాబు విదేశీ పర్యటనపై వైఎస్సార్‌సీపీ ఆరా తీయడంలో.. సారీ నిలదీయడంలో తప్పేముంది?.

Controversy Over Voter Turn Out Data Delay
పోలింగ్‌ శాతాల డేటా వివాదం..జవాబుల్లేని ప్రశ్నలనేకం..!

న్యూఢిల్లీ: దేశంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌(ఈవీఎం)ల విశ్వసనీయతపై చర్చ జరగడం సాధారణమే. అయితే ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పోలింగ్‌ శాతాలు ఆలస్యంగా ప్రకటించడంపైకి చర్చ మళ్లింది. దీనికి కారణం ఇప్పటి వరకు జరిగిన ఐదు విడతల పోలింగ్‌కు సంబంధించి ఫైనల్‌ ఓటర్‌ టర్నవుట్‌ డేటాలు ప్రకటించడానికి ఎన్నికల కమిషన్‌(ఈసీ) వారాల కొద్ది సమయం తీసుకోవడమే. డేటా ఆలస్యమవడంతో పాటు పోలింగ్‌రోజు రాత్రి ప్రటించిన పోలింగ్‌ శాతానికి సమయం తీసుకుని ప్రకటించన డేటాకు మధ్య భారీ వ్యత్యాసముండటంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోపక్క ఎన్‌జీవోలు ఈ విషయంలో కోర్టుల తలుపులు తడుతున్నాయి. పోలింగ్‌ శాతం డేటాల్లో భారీ వ్యత్యాసాలపై ఇప్పటికే అసోసియేట్‌ ఫోరం ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్(ఏడీఆర్‌) సుప్రీంకోర్టుకు వెళ్లింది.ఏడీఆర్‌ వేసిన పిటిషన్‌ను మే17న తొలుత విచారించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఓటర్‌ టర్నవుట్‌లు ప్రకటించడానికి ఆలస్యమెందుకవుతోంది, డేటాల్లో భారీ వ్యత్యాసమెందుకు ఉంటోందని ఈసీని ప్రశ్నించింది. మే 24న మళ్లీ ఈ కేసు విచారణకు వచ్చినపుడు సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.తొలి దశ పోలింగ్‌ శాతం డేటాకు ఏకంగా 11 రోజులు... అంకెల్లోనూ భారీ వ్యత్యాసం..లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 19న జరిగితే ఈసీ యాక్చువల్‌ పోలింగ్‌ పర్సెంటేజీ ప్రకటించడానికి ఏకంగా 11 రోజులు పట్టింది. ఇక డేటా విషయానికి వస్తే పోలింగ్‌ ముగిసిన రోజు డేటా 60 శాతం అని తెలపగా 11 రోజుల తర్వాత ఈడేటా ఏకంగా 6 పర్సెంటేజీ పాయింట్లు పెరిగి 66.14 శాతానికి చేరింది.దీనిపై ప్రతిపక్షాలతో పాటు ఎన్‌జీవోలు విస్మయం వ్యక్తం చేశాయి. పోలింగ్‌ శాతాల్లో ఇంత వ్యత్యాసమెందుకు వస్తోంది.. డేటా వెల్లడించడానికి ఎందుకంత సమయం తీసుకోవాల్సి వస్తోందని ఈసీకి ప్రశ్నల బాణాలు సంధిస్తున్నాయి. ఇదే తంతు సెకండ్‌ ఫేజ్‌ పోలింగ్‌కు మళ్లీ రిపీట్‌ అయింది. ఏప్రిల్‌ 26న సాయంత్రం పోలింగ్‌ శాతం 60.96 శాతం అని ప్రకటించగా అది కాస్తా ఏప్రిల్‌ 30న వాస్తవ డేటా ప్రకటించే సరికి 66.71శాతానికి పెరిగిపోయింది.నాలుగు దశల్లో 1.07 కోట్ల ఓట్ల తేడా..ఎన్నికల నాలుగు దశల పోలింగ్‌ శాతాల్లో ఈసీ ప్రకటించిన తొలి, తుది డేటాల వ్యత్యాసాన్ని ఓట్లలో పరిశీలిస్తే 1.07 కోట్ల ఓట్ల వ్యత్యాసం వచ్చింది. ఇప్పటివరకు పోలింగ్‌ పూర్తయిన 379 నియోజకవర్గాలకు ఈ ఓట్లను పంచితే ఒక్కో నియోజకవర్గానికి సగటున 28 వేల ఓట్ల తేడా వస్తున్నట్లు అంచనా. అన్నింటికంటే ఎక్కువగా మే 13న పోలింగ్‌ జరిగిన ఆంధ్రప్రదేశ్‌లో 17 లక్షల ఓట్ల తేడా వచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ తర్వాత మహారాష్ట్ర, అస్సాం, కేరళ ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. నియోజకవర్గాల వారిగా చూసినపుడు ఈసీ ప్రకటించిన పోలింగ్‌ శాతాల డేటాల్లో తేడా అభ్యర్థుల గెలుపోటములను ఈజీగా ప్రభావితం చేయగలదన్న వాదన వినిపిస్తోంది. 2019లో ఎలా ప్రకటించారు.. ఇప్పుడేమైంది..ఐదోవిడత పోలింగ్‌ సోమవారం(మే20)న జరిగింది. దీనికి సంబంధించి సోమవారం రాత్రి 11.30 గంటలకు ఓటర్‌ టర్నవుట్‌ 60.09గా ఎన్నికల కమిషన్‌(ఈసీ) ప్రకటించింది. ఫైనల్‌ పోలింగ్‌ శాతం డేటాను ఎన్నికల ఫలితాల తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. దీనిపై అనేక ప్రశ్నలు సందేహాలు తలెత్తుతున్నాయి. 2019 ఎన్నికల సమయంలో పోలింగ్‌ పూర్తయిన కొద్దిసేపటికే ఎన్నికల కమిషన్‌ నియోజకవర్గాల వారిగా, స్ట్రీ,పురుషుల వారిగా అన్ని రకాల డేటాను ప్రకటించిందని, ఇప్పుడెందుకు ఈసీకి అది సాధ్యమవడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.17సి ప్రామాణికం కాదా...సాధారణంగా పోలింగ్‌ ముగిసిన తర్వాత కొద్ది సేపటికే ప్రతి పోలింగ్‌ బూత్‌లో ఉన్న పార్టీల పోలింగ్‌ ఏజెంట్లకు ఆ బూత్‌లో పోలైన ఓట్ల వివరాలను 17సి ఫామ్‌లో ఎన్నికల అధికారులు అందిస్తారు. ఇది నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి పోలింగ్‌ బూత్‌లోనూ జరుగుతుంది. 17సి ఫామ్‌లతో అభ్యర్థులకు నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్ల వివరాలు తెలుస్తాయి. ఇంత క్లియర్‌గా 17సి ఉండగా ఫైనల్‌ డేటా విషయంలో సమస్య ఎక్కడ వస్తోందని కాంగ్రెస్‌ నేషనల్‌ చీఫ్‌ మల్లిఖార్జున్‌ ఖర్గే లేఖ ద్వారా ఎన్నికల సంఘాన్ని ఇప్పటికే ప్రశ్నించడం గమనార్హం.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement