అక్రమ వలసదారులకు ఇక నరకమే: ట్రంప్‌ | Will Sen Immigrants To Guantanamo Jail Says Donald Trump | Sakshi
Sakshi News home page

వెనక్కి పంపడం ఉండదు.. అక్రమ వలసదారులకు ఇక నరకమే: ట్రంప్‌

Jan 30 2025 10:51 AM | Updated on Jan 30 2025 11:46 AM

Will Sen Immigrants To Guantanamo Jail Says Donald Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. అమెరికాకు వచ్చే అక్రమ వలసదారుల్ని గ్రహాంతరవాసులతో పోలుస్తున్నారు. వాళ్లను తిరిగి స్వదేశాలకు పంపే విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటిదాకా.. వారం వ్యవధిలో 7,300 మందిని వెనక్కి పంపించేశారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారాయన.

అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపించే ప్రసక్తి లేదని ట్రంప్‌ మరోసారి పునరుద్ఘాటించారు. అక్రమ వలసదారులను ఫెడరల్‌ అధికారులు అదుపులోకి తీసుకుని తరలించేందుకు అవసరమైన ‘లేకెన్‌ రిలే’ చట్టం అక్కడి చట్టసభల ఆమోదం పొందిన తెలిసిందే. ఆ ఫైల్‌పై ట్రంప్‌ తొలి సంతకం చేశారు. అనంతరం ఆయన ఈ అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అమెరికా పౌరులకు ముప్పు కలిగించే క్రిమినల్స్‌ను విడిచిపెట్టం. దేశం నుంచి పంపించేస్తాం. అయితే కొందరు అత్యంత క్రూరులు ఉంటారు. వారిని స్వదేశాలకు పంపిస్తే మళ్లీ వచ్చే అవకాశం ఉంది. అందుకే వాళ్లను నరకంలాంటి గ్వాంటనామో జైలుకు తరలిస్తాం. సుమారు 30 వేల మంది కోసం అక్కడ బెడ్లు  సిద్ధం చేయించే ఆదేశాలు త్వరలోనే జారీ చేస్తా అని అన్నారాయన.

క్యూబాలోని గ్వాంటనామో బేలో ఉందీ జైలు. నావల్‌ స్టేషన్‌ గ్వాంటనామో బే(NSGB) పరిధిలో ఉందీ అమెరికా మిలిటరీ ప్రిజన్‌. భూమ్మీది నరకంగా ఈ జైలును అభివర్ణింటారు. ఉగ్రవాదుల బంధీఖానాగా దీనికి పేరుంది. సెప్టెంబర్‌ 11 దాడుల తర్వాత 2012లో అప్పటి అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ ఈ జైలును ప్రారంభించారు. 9/11 దాడుల్లో పాల్గొన్నవాళ్లను అమెరికా ఇక్కడ నిర్భంధించింది. ఇక్కడి ఖైదీలను మానసికంగా, శారీకంగా వేధింపులకు గురి చేస్తుంటారు. 

జనవరి 2025 నాటికి.. ఈ జైల్లో 48 దేశాలకు చెందిన 780 మందిని బంధీలుగా ఉంచారు. అయితే.. 756 మందిని వెనక్కి పంపించేశారు. కస్టడీలో 9 మంది చనిపోయారు. ఇంకా 15 మంది మాత్రమే అక్కడ ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement