ధీశాలి ఫెడల్‌ క్యాస్ట్రో: వైఎస్‌ జగన్‌ | YS Jagan Moahan Reddy expressed grief over the death of Fidel Castro | Sakshi
Sakshi News home page

ధీశాలి ఫెడల్‌ క్యాస్ట్రో: వైఎస్‌ జగన్‌

Nov 26 2016 3:59 PM | Updated on Jul 25 2018 4:09 PM

ధీశాలి ఫెడల్‌ క్యాస్ట్రో: వైఎస్‌ జగన్‌ - Sakshi

ధీశాలి ఫెడల్‌ క్యాస్ట్రో: వైఎస్‌ జగన్‌

క్యూబా మాజీ అధినేత ఫెడల్‌ క్యాస్ట్రోకు వైఎస్‌ జగన్‌ నివాళులు అర్పించారు.

హైదరాబాద్‌: అద్భుతమైన పోరాటస్ఫూర్తి, మొక్కవోని నిబద్ధతతో క్యూబాను నడిపించిన మహానేత ఫెడల్‌ క్యాస్ట్రో అని వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం(భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం) మరణించిన క్యూబా మాజీ అధినేత ఫెడల్‌ క్యాస్ట్రోకు వైఎస్‌ జగన్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు విడుదలచేసిన ఒక ప్రకటనలో క్యాస్ట్రో పోరాట పంథాను శ్లాఘించారు.

అమెరికాకు అతి సమీపంగా ఉంటూ, అగ్రరాజ్యానికి కించిత్‌ తల వంచని ధీశాలి క్యాస్ట్రో అని, చిన్నదేశమే అయినప్పటికీ ఎవ్వరికీ గులాము కాకుండా క్యూబా ప్రపంచంలో నిలబడిన తీరు అమోఘమని, తన పట్టుదల, నిబ్ధతతో క్యూబాను, క్యూబన్లను నడిపించిన మహానేత ఫెడల్‌ క్యాస్ట్రోఅని వైఎస్‌ జగన్‌ కీర్తించారు. 50 ఏళ్లపాటు క్యాస్ట్రో పాలనలో క్యూబా ఎన్నో విజయాలు సాధించిందని గుర్తుచేశారు. (విప్లవ యోధుడు ఫెడల్‌ క్యాస్ట్రో కన్నుమూత)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement