కోల్డ్‌క్రీమ్‌లో విషపు గుళికలు దాచి..

కోల్డ్‌క్రీమ్‌లో విషపు గుళికలు దాచి.. - Sakshi


దాదాపు ఐదు దశాబ్దాలు (1959 నుంచి 2008 దాకా). ఫిడెల్ క్యాస్ట్రోపై ఎన్నెన్ని కుట్రలు చేసినా.. ఎంత గింజుకున్నా అమెరికా ఏమీ చేయలేకపోరుుంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది. ప్రపంచ గతి మారింది. 10 మంది అమెరికా అధ్యక్షులూ మారారు. కానీ క్యాస్ట్రో ఎదురు నిలిచాడు. అగ్రరాజ్యం కుట్రలకూ, కుతంత్రాలకు ఎదురునిలిచాడు.

 

 ఫిడెల్ క్యాస్ట్రో ప్రేయసి మారిటా లోరెంజ్. ఆమె గర్భం దాల్చినపుడు అమెరికాకు వెళ్లింది. అక్కడ సీఐఏ ఏజెంట్లు ఆమెను సంప్రదించి.. అమెరికా కోసం క్యాస్ట్రోను నిర్మూలించాల్సిందేనని ఆమెను ఒప్పించారు. కోల్డ్‌క్రీమ్‌లో విషపు గుళికలను దాచి పంపారు. వాటిని ఆమె రహస్యంగా క్యాస్ట్రో గదిలోకి తీసుకెళ్లి అతను తీసుకునే డ్రింక్‌లో కలపాలి. ఈ కుట్ర గురించి తెలిసిన క్యాస్ట్రో... లోరెంజ్‌ను చూసి ‘నన్ను చంపడానికి వచ్చావా?’ అంటూ గన్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. గట్టిగా సిగార్‌ను పీల్చి వదిలి షూట్ చేయమన్నట్లుగా చూశాడు. అంతే ఆమె గన్‌లోంచి బుల్లెట్‌లను తీసేసి.. కన్నీళ్లతో క్యాస్ట్రోపై వాలిపోరుుంది. ‘ఫిడెల్‌కు తెలుసు నేనతన్ని కాల్చలేనని.. ఎందుకంటే నేనతన్ని ప్రేమించాను. ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను. అతనూ అంతే..’ అని లోరెంజ్ స్వయంగా ఈ ఘటనను తర్వాతి కాలంలో వెల్లడించింది.



 శంఖంలో బాంబు...

 క్యాస్ట్రోకు స్కూబా డైవింగ్ అంటే ఎంతో ఇష్టం. కాబట్టి డైవ్ చేసినపుడు సముద్ర గర్భంలో ఆకర్షణీయమైన శంఖం పెడితే... దాని దగ్గరకు వెళతాడని, పేలి చనిపోతాడని ప్లాన్ వేసింది సీఐఏ. తను తరచుగా స్కూబా డైవింగ్‌కు వెళ్లే ప్రదేశంలో దీన్ని ప్లాన్ చేసింది. అరుుతే అమలులో ఇబ్బందులతో దీన్ని ప్రయత్నించలేదు. అలాగే స్కూబా డైవింగ్ సూట్‌కు విషపూరిత రసాయనాలు పూసి ఓ మిత్రుడి ద్వారా దాన్ని ఫిడెల్ క్యాస్ట్రోకు అందించే ప్రయత్నం చేసింది. కానీ క్యూబా అధ్యక్షుడితో మంచి సాన్నిహిత్యమేర్పడిన ఆ లాయర్ విషపూరితమైన సూట్‌కు బదులు మామూలు సూట్‌ను అందజేశాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top